Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చెన్నైలో రజినీ బిడ్డ ఐశ్వర్య… హైదరాబాదులో చిరంజీవి బిడ్డ శ్రీజ… ఒకేరోజు..?!

January 18, 2022 by M S R

రజినీకాంత్ బిడ్డ ఐశ్వర్య… హీరో ధనుష్ విడాకుల వార్త ఇప్పుడు గాసిప్ కాదు, రూమర్ కాదు… హఠాత్తుగా అది అధికారికం అయిపోయింది… ధనుషే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు కాబట్టి…. కానీ ఒకవైపు తమిళ సుప్రీం మెగా స్టార్ రజినీకాంత్ బిడ్డ విడాకుల వార్త టాంటాం అయినరోజే… తెలుగు సుప్రీం మెగా స్టార్ చిరంజీవి బిడ్డ విడాకుల వార్త కూడా ఒక్కసారిగా టాంటాం అయిపోతోంది… సరే, ధనుష్ విడాకుల వార్త అధికారికం… మరి చిరంజీవి బిడ్డ సంగతి..?

హఠాత్తుగా ఆమె ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఖాతాల్లో తన పేరు పక్కన భర్త కల్యాణ్ దేవ్ పేరుకు బదులు తమ పుట్టింటి ఇంటిపేరు వచ్చేసింది మళ్లీ… శ్రీజ కొణిదెల అని కనిపిస్తోంది… నిజమే, ఆమె రెండు అఫిషియల్ ఖాతాల్లోనూ ఈ మార్పు కనిపిస్తోంది… సాధారణంగా విడాకుల వంటి వ్యవహారాల్లో ఫస్ట్ సందేహాలు తలెత్తేది సోషల్ ఖాతాల్లో పేర్ల మార్పిడితోనే… సమంత కూడా అక్కినేని అనే ఇంటిపేరు తొలగించాక దాదాపు అందరికీ కన్‌ఫమ్ అయిపోయింది… చివరకు విడిపోయారు… వాళ్లే కాదు, సెలబ్రిటీలు తమ పేర్లలో ఏదో మార్పు చేశారు అంటే, ఏదో జరుగుతోంది అనే అర్థం… షణ్ముఖ పేరును దీప్తి కొట్టేసుకున్నా అంతే… సిరి హన్మంతు పేరును శ్రీహాన్ కొట్టేసుకున్నా అంతే…

konidela sreeja

Ads

సేమ్, సమంతలాగే ఇప్పుడు శ్రీజ కూడా ఏమైనా ఇండికేషన్స్ ఇస్తోందా..? ఇంకేముంది, విడాకులే అన్నట్టుగా పలు సైట్లు, యూట్యూబ్ చానెళ్లు అప్పుడే వార్తలు స్టార్ట్ చేశాయి… కానీ అధికారికంగా ఏమీ తెలియదు… బయటికి రాలేదు… నిజానికి శ్రీజ మొదటి భర్త పేరు శిరీష్ భరధ్వాజ్… 2007లోనే పెళ్లయింది… నాలుగేళ్లకు అది పెటాకులు… అందరికీ తెలిసిందే… తరువాత కల్యాణ్‌దేవ్‌తో పెళ్లయింది… 2016లో… తను కూడా హీరో అయ్యాడు… మొన్నమొన్ననే ఓ సినిమా కూడా రిలీజైంది… (ఆ కొత్త సినిమాను మెగాక్యాంప్ పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు…) శ్రీజకు ఇద్దరు పిల్లలు… మొదటి భర్త ద్వారా నివృత్తి, రెండో భర్త ద్వారా నవిష్క…

ఓ నగల వ్యాపారి కెప్టెన్ కిషన్ కొడుకు తను… శ్రీజకు చిన్నప్పటి దోస్త్… మొదటి పెళ్లి నాలుగేళ్లు… ఇప్పుడు అయిదారేళ్లు… అసలేం జరుగుతోంది..? ఆమె సోషల్ పేర్ల మార్పిడి వెనుక అసలు ఆంతర్యం, మళ్లీ విడాకులేనా..? ఈ వార్తలు తెలుగు ఇండస్ట్రీకి ఓ షాక్… జరగొద్దని ఏమీ లేదు, వాళ్ల నిర్ణయాలు వాళ్లిష్టం… కానీ విన్నప్పుడు ఒకింత షాకింగ్… కొంత చర్చ… బహుశా ఇది కారణమై ఉండొచ్చు, నో, నో, ఈ కారణాలే అయి ఉండొచ్చు అంటూ కొన్నాళ్లు చర్చ… ఏముంది..? తరువాత ఎవరి బతుకులు వాళ్లవి… వాళ్లేమైనా చిన్న పిల్లలా..? ఆలోచించకుండా నిర్ణయాలు తీసేసుకోవడానికి..? ఏమంటారు..?! ఇంతకీ ఆమె ఆ పేర్లు ఎందుకు మార్చింది..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఘర్షణలో నష్టాలు సహజం… కానీ మనం 100 % అప్పర్ హ్యాండ్ సాధించాం…
  • నో డౌట్… రాఫెల్ అల్టిమేట్ వార్ ఫైటర్… మన పైలట్లూ సేఫ్…
  • అప్పటికప్పుడు కొత్త సీన్లు… ఆలోచనల కసరత్తులు… మేధో మథనాలు…
  • బాపూ, నీ పాదాలేవి..? ఒక్కసారిగా బావురుమని ఏడవాలనుంది..!!
  • మీడియా చెవుల్లో శ్రీలీల పూలు… నువ్వూ తయారయ్యావా తల్లీ…
  • …. అసలు ఇలాంటి సినిమాలు కదా రీరిలీజ్ చేయాల్సినవి…
  • ‘మా’ పూనుకుని… రాజేంద్ర ప్రసాద్‌కు మానసిక చికిత్స చేయించాలి..!!
  • ‘పోషకాల పుట్ట’గొడుగు..! మాంసాహార ముద్ర తప్పు.., తినకపోతేనే తప్పు..!!
  • ఐపీఎల్ ఫైనల్స్‌లోకి… పాకిస్థానీ జాతిపిత మునిమనుమడి టీమ్…!!!
  • మమత బెనర్జీ… ఆమె అంతే… దేశభక్తి ఆమె దృష్టిలో ఎప్పుడూ నేరమే…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions