….. By…. పార్ధసారధి పోట్లూరి………….. సుప్రీం కోర్టు రెండు కీలకమయిన తీర్పులు ఇచ్చింది !
1. ప్రధాని మోడీ భటిండా పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా లోపం మీద అటు పంజాబ్ ప్రభుత్వం హై లెవల్ ఎంక్వైరీకి ఆదేశించింది, ఇటు కేంద్ర హోమ్ శాఖ మరో కమిటీని వేసింది సమగ్ర దర్యాప్తు కోసం. అయితే ఈ రెండు విచారణలని నిలిపివేసి, ప్రధాని పర్యటన షెడ్యూల్ వివరాలు ఉన్న రికార్డులని స్వాధీనం చేసుకోమని పంజాబ్ & హర్యానా హై కోర్టు రిజిస్ట్రార్ ని ఆదేశించింది సుప్రీం కోర్ట్ ! ఇప్పటికే ఉన్న రికార్డులు, కమ్యూనికేషన్ రికార్డులు యధాతధంగా ఇటు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్, అటు పంజాబ్ ప్రభుత్వం పంజాబ్- హర్యానా హై కోర్ట్ రిజిస్ట్రార్ కి ఇవ్వాలని ఆదేశించింది అదే సమయంలో ఎలాంటి దర్యాప్తుని నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
2. వెస్ట్ బెంగాల్ మాజీ చీఫ్ సెక్రటరీ కేసు: మాజీ వెస్ట్ బెంగాల్ కూడా చీఫ్ సెక్రటరీ అల్పన్ బందోపాధ్యాయ ప్రధాని పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘించాడు. 2021 May 28 న ప్రధాని ‘’యాస్ ‘’ తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని పరిశీలించడానికి మిడ్నపూర్ లోని కలైకుంద ఎయిర్ బేస్ కి వెళ్లారు. అక్కడే యాస్ తుఫాను సృష్టించిన నష్టాన్ని, సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అయ్యారు కానీ ప్రధాని పూర్తిగా నష్ట వివరాలు అడుగుతుండగానే మధ్యలోనే మమతతో పాటు చీఫ్ సెక్రటరీ అల్పన్ బందోపాధ్యాయ కూడా వెళ్లిపోయారు. ఇది ప్రోటోకాల్ ని ఉల్లంఘించినట్లు అవుతుంది.
Ads
3. ప్రధాని ఏ రాష్ట్ర పర్యటనకి వెళ్ళినా ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు DGP కూడా ఖచ్చితంగా హాజరు అవ్వాలి. అలాగే ప్రధాని వెళ్ళే వరకు అక్కడే ఉండాలి. ఇది ప్రోటోకాల్. ముఖ్యమంత్రులు హాజరయ్యి మర్యాద పూర్వకంగా కలిసి వెళ్లిపోవచ్చు. కానీ మమత తో పాటు చీఫ్ సెక్రటరీ అల్పన్ బందోపాధ్యాయ కూడా వెళ్ళిపోయాడు. దీని మీద అదే రోజు Department of Personnel and Training వెస్ట్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ మీద విచారణకి ఆదేశించి, ఢిల్లీ రమ్మని కోరింది. కానీ చీఫ్ సెక్రటరీ అల్పన్ బందోపాధ్యాయ విచారణకి రమ్మని ఇచ్చిన ఆదేశాలని ఖాతరు చేయలేదు. కనీసం జవాబు కూడా ఇవ్వలేదు. తరువాత కొద్ది రోజులకే చీఫ్ సెక్రటరీ అల్పన్ బందోపాధ్యాయ పదవీ విరమణ చేశాడు కానీ మమత అతన్ని చీఫ్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
4. జూన్ 16 న కేంద్రం అల్పన్ బందోపాధ్యాయ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ చార్జ్ షీట్ దాఖలు చేసింది. దీని మీద అల్పన్ బందోపాధ్యాయ అక్టోబర్ 8న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కలకత్తా బ్రాంచ్ లో అపీల్ చేశాడు. తన మీద విచారణ కలకత్తాలోని ట్రిబ్యునల్ లో విచారణ చేయమని..! కానీ కలకత్తా CAT అల్పన్ బందోపాధ్యాయ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ మీరు ఢిల్లీలో ప్రధాన CAT లోనే విచారణని ఎదుర్కోవాలి అంటూ తీర్పు ఇచ్చింది. దాంతో ఢిల్లీ వెళ్ళడం ఇష్టంలేని అల్పన్ బందోపాధ్యాయ కలకత్తా హై కోర్ట్ లో ట్రిబ్యునల్ తీర్పుని సవాలు చేస్తూ పిటిషన్ వేశాడు.
5. కలకత్తా హైకోర్టు అల్పన్ బందోపాధ్యాయకి అనుకూలంగా తీర్పు ఇస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారిని విచారించడానికి ఢిల్లీ ఎందుకు, అది కలకత్తాలోని ట్రిబ్యునల్ లో విచారించవచ్చు అని…! పైగా కేంద్ర ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేసింది కలకత్తా హై కోర్ట్ !
6. కలకత్తా హై కోర్ట్ తీర్పు మీద కేంద్రం సుప్రీం కోర్టులో సవాలు చేసింది. నిన్న సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ అసలు కలకత్తా హైకోర్టు పరిధి [Jurisdiction ] లో రాని కేసుని ఎలా స్వీకరించింది ? పైగా కేంద్ర ప్రభుత్వం మీద అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముంది అంటూ ప్రశ్నించింది మరియు కలకత్తా హై కోర్టు తీర్పు కొట్టివేసింది. ఏదన్నా న్యాయ పరిధి ఉంది అంటే అది ఢిల్లీ హైకోర్టుకి ఉంటుంది తప్పితే కలకత్తా హైకోర్టుకి ఉండదు అని వ్యాఖ్యానించింది సుప్రీం కోర్ట్.
7. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇటు పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు DGP లకి కూడా వర్తింస్తుంది. అంటే ఇద్దరూ ఢిల్లీ వచ్చి విచారణని ఎదుర్కోవాల్సిందే. ఎందుకంటే ప్రధాని భటిండా పర్యటనలో కూడా చీఫ్ సెక్రటరీ మరియు DGP లు ప్రధానితో పాటు లేరు, అసలు అక్కడికి రాలేదు కూడా…
చీఫ్ సెక్రటరీలని, DGP లని తమ అక్రమాలలో భాగస్వాములని చేసి, తమ గుప్పిట్లో పెట్టుకొని, ప్రోటోకాల్స్ ని నిర్లక్ష్యం చేయడం అటు వెస్ట్ బెంగాల్ లో చూసాము, రెండు రోజుల క్రితం పంజాబ్ లో కూడా చూసాము… గతంలో ముంబై పోలీస్ కమీషనర్ ని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి చివరికి అదే పోలీస్ కమీషనర్ పారిపోయేదాకా తెచ్చాడు. నిబంధనలని పాటించకపోవడం అనేది నిత్య కృత్యం అయిపోయింది. ఇక్కడ ఎవరి అధికార పరిధి ఎంతో కోర్టులు చెప్పాల్సిన స్థితి దాపురించింది. అదీ నెలల కొద్దీ విచారణ పేరుతో జాప్యం చేసి మరీ ! సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత ఈ రోజు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంజాబ్ DGP కి షోకాజ్ నోటీసు ఇచ్చింది. అదీ 24 గంటలలోపు సమాధానం ఇవ్వమని… చూడాలి 24 గంటలలోపు సమాధానం ఇస్తాడా లేదా అని…
Share this Article