.
గేమ్ ఛేంజర్ సినిమా హైడెఫినిషన్ పైరేటెడ్ కాపీలను నెట్‌లోకి తీసుకువచ్చారు రిలీజైన మూణ్నాలుగు రోజులకే… అది నిర్మాతకు నష్టమే… కానీ దాని వెనుక ఏదో కుట్ర కథనం వినిపించింది…
మెగా క్యాంపుకీ, బన్నీ క్యాంపుకీ పడటం లేదు కదా కొన్నాళ్లుగా… పుష్పరాజ్ రికార్డులు పదిలంగా ఉండటానికి, రాంచరణ్ ఇమేజీ తగ్గించడానికి బన్నీ, వైసీపీ క్యాంపులు కావాలని పైరసీ కుట్రకు పాల్పడ్డాయనే కథనాలు వచ్చాయి… నిజానిజాలు పెరుమాళ్లకెరుక…
Ads
దాన్నలా వదిలేస్తే… అల్లు అరవింద్ (మెగా క్యాంపు కాదు, బన్నీ క్యాంపు… తండేల్ నిర్మాత) నాగార్జున, నాగచైతన్య, బన్నీ వాసు, చందు మొండేటి తదితరులు బాగా ఆశలు పెట్టుకున్న సినిమా… సరే, పర్లేదు, సినిమా బాగానే వచ్చింది… చైతూను నిలబెట్టింది… తొలిరోజు కలెక్షన్లు కూడా 20 కోట్ల దాకా వచ్చినట్టు చదివాను… (తమిళం, తెలుగు, హిందీ… హాఫ్ పాన్ ఇండియా)
ఐతే గేమ్ ఛేంజర్‌లాగే ఈ సినిమా ప్రింట్ కూడా థియేటర్ క్వాలిటీతో నెట్‌లోకి వచ్చేసింది… ఇదీ నిర్మాతకు నష్టమే… ఓటీటీ, టీవీ రైట్స్ కొన్నవాళ్లకు, ఎగ్జిబిటర్లకు, బయ్యర్లకు అందరికీ నష్టమే… సరే, గేమ్ ఛేంజర్ వెనుక ఏదో కుట్ర కోణం ఉందనుకుందాం… మరి తండేల్ నాగ చైతన్య మీద కోపం ఎవరికి..?
ఎవరో ప్రొఫెషనల్, రెగ్యులర్ పైరసీరాయుళ్ల పని కాదంటున్నారు… ఫిలిమ్ సర్కిళ్లలో డిస్కషన్లు రకరకాలుగా సాగుతున్నాయి… ముందే ఓ డిస్‌క్లెయిమర్… ఇవన్నీ వినిపించే అభిప్రాయాలు, నిజానిజాల నిర్ధారణలోకి వెళ్లడం లేదు ఇక్కడ… కాకపోతే టాలీవుడ్‌లో పెద్ద తలకాయల నడుమ ఏదో ప్రచ్ఛన్న సమరం నడుస్తోంది… అదీ చెప్పదలిచింది…
వాళ్లూ వాళ్లూ తన్నుకుంటే టాలీవుడ్ కూడా మాలీవుడ్‌లాగా తీవ్ర నష్టాల్లోకి కూరుకుపోయి, షూటింగులు బంద్ పెట్టాల్సి వస్తుంది బహుపరాక్… డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి టాలీవుడ్‌లో కొన్ని వివాదాలున్నాయి… ఆ నలుగురు అని పదే పదే సిండికేట్ల గురించి చెబుతుంటారు కదా… దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్, సురేష్ బాబు…
వీళ్లకూ మైత్రికీ పడటం లేదట చాన్నాళ్లుగా… వాళ్లేమో తమ సినిమాలు మొత్తం దిల్ రాజుకే డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చేవాళ్లు… అది ముసలానికి, సమరానికి కారణమంటారు మరి.. దిల్ రాజు, అల్లు అరవింద్ క్లోజ్… అదీ కొందరికి పడటం లేదు… వాళ్ల మరింత ఎదుగుదల మీద కన్నెర్రతో దెబ్బతీసే ప్రయత్నాలు సాగుతున్నాయని ఓ కథనం…
కాదు, ఈ వివాదాలన్నీ సీజనల్ గొడవలు… అన్నీ సినిమా టు సినిమా… సితార ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్లు మొన్న డాకూ మహారాజ్ సినిమా విషయంలో బాగా నొచ్చుకున్నారట… గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్ రాజు 70 శాతం థియేటర్లు ఉంచుకుని (తన చేతిలో పని కదా…) బాలయ్య సినిమాకు సరిగ్గా థియేటర్లు ఇవ్వలేదనే చర్చ సాగుతోంది…
నిజానికి సితార వాళ్ల సినిమాల్ని దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాడు… సితార వెనుక మై హోం అనే ఓ బలమైన గ్రూపు ఉంది… సో, ఇలా ప్రచ్ఛన్న సమరం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి… బట్, తండేల్‌ను, తద్వారా అల్లు అరవింద్‌ను నష్టపరచాలనే ప్రయత్నం ఎవరిది..? ముందుగా టాలీవుడ్ పెద్దలు తమను తాము దిద్దుకోవల్సి ఉంది, సర్దబాట్లు, రాజీలు తప్పవు… లేకపోతే మాలీవడ్ గతే… బహుపరాక్… (Ashok Pothraj)
Share this Article