Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Madhuri Dixit … డబ్బు కోసం ఇదేం పని శ్రీమతి మాధురీ దీక్షిత్..?

June 29, 2024 by M S R

సినిమా తారలు… కాస్త హార్ష్‌గా ధ్వనించినా ఒక మాట… డబ్బు కోసం ఏదైనా చేస్తారు… ఎంత దిగజారమన్నా సరే… అందరూ కాదు, కాకపోతే మెజారిటీ..! వయస్సు మీద పడినా సరే, ఇంకా ఇంకా డబ్బు కావాలి… దాని కోసం ఏదైనా చేసేయాలి… ఒకప్పటి అందాల తార మాధురీ దీక్షిత్ దీనికి మినహాయింపు ఏమీ కాదు…

ఏక్ దో తీన్ చార్ పాంచ్ అంటూ గంతులేసి జనాన్ని వెర్రెక్కించిన మాధురీ దీక్షిత్ గిరాకీ తగ్గిపోయాక నేనే అనే ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది… కొన్నాళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చి తెర మీద కనిపిస్తోంది… అప్పటి ప్రేక్షకులకు ఇప్పటికీ మాధురీ దీక్షిత్ అంటే పిచ్చి… వాళ్లలో ఒకాయన… పేరు రెహాన్ సిద్దిఖీ.,.

ఈయన అమెరికా, హూస్టన్‌లో ఆగస్టు 16న ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాడు… దానికి మాధురీ దీక్షిత్ ప్రధాన అతిథి… 200, 300, 500 డాలర్లు రేట్లు… మీట్ అండ్ గ్రీట్… అంతే అంటున్నాడు… సమాచారం, టికెట్లు, స్పానర్‌షిప్ కోసం తననే సంప్రదించాలని అంటున్నాడు… ఇక్కడి వరకూ వోకే… కానీ..?

Ads

madhuri

ఎవరు ఈ రెహాన్ సిద్దిఖి..? అతను పాకిస్థానీ… అమెరికాలో ఉంటాడు… తనపై భారత ప్రభుత్వం నిఘా ఉంది, తనను ఉగ్రవాద మద్దతుదారుగా భావిస్తుంది… ఆయనకు ఐఎస్ఐతో సంబంధాలున్నాయని ఆరోపిస్తోంది… రెహాన్ సంస్థల్ని బ్లాక్ లిస్టులో పెట్టింది… అవకాశం దొరికితే ఎక్కడో ఓచోట బుక్ చేస్తుంది… మరి అలాంటి వ్యక్తి నిర్వహించే ప్రోగ్రాంకు మాధురీ దీక్షిత్ వెళ్లడం ఏమిటి..? ఇదేనా మీ ప్రశ్న… భలేవారే, డబ్బండీ డబ్బు…

madhuri

ఇదుగో అప్పటి హోం సహాయమంత్రి హోదాలో మన కిషన్‌రెడ్డి ఇలాంటి అసాంఘిక శక్తులకు మన నటీనటులు, సెలబ్రిటీలు దూరంగా ఉండాలన్నట్టుగా రాసిన ఓ లేఖ… పొలిటికల్ కాలమిస్ట్ సునంద వశిష్ట ఈ పోస్టర్‌ను షేర్ చేసుకుని, ఘాటుగా ఓ పోస్టు పెట్టింది… (దిగువన లింక్)…


Shocked to see @MadhuriDixit collaborate with Pakistani origin promoter who has been on the radar of Indian agencies and has been blacklisted by Govt of India. Minister @kishanreddybjp as MoS Home had publicly announced that Houston based Pakistani origin promoter, Rehan Siddiqi… pic.twitter.com/Kqu7lttt3k

— Sunanda Vashisht (@sunandavashisht) June 28, 2024


‘‘ఇలాంటివాడి కార్యక్రమానికి ఎందుకు వెళ్తున్నావో నీదగ్గర సరైన కారణం ఉందా మాధురీ..? ఎవరైనా ఆ వ్యక్తి గురించి ఆమెకు కాస్త చెప్పండి… మన సరిహద్దుల్లో మనకోసం ప్రాణాలకు తెగించి కాపలా కాసే సైనికులకు, మహిళలకు మాధురీ చర్య నిరుత్సాహాన్ని కలిగిస్తోంది…’’ అని ఏకిపారేసింది… ఆ ట్వీట్ వైరల్ అయిపోయింది…

నిజమే కదా… వీళ్లకు దేశం ఎంత ఇచ్చింది..? గుండెల్లో పెట్టుకుని ఆరాధించింది… ఓన్ చేసుకుంది… అలాంటిది ఇంత ఇచ్చిన దేశానికి ఇదా ద్రోహం అని కామెంట్లు… కొత్త ఎంపీ, ఇలాంటి విషయాల్లో ముందుండే కంగనా రనౌత్ ఎందుకోగానీ ఇంకా స్పందించలేదు… ఏమో, కొత్త హోం సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందించలేదు… అంతెందుకు..? ఈ వివాదంపై మాధురీ దీక్షితే ఇంకా స్పందించలేదు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…
  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions