Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మహువ మొయిత్ర వెనుక ఎవరున్నారు..? అమెరికాలో భేటీ వెనుక ఏ కుట్ర దాగుంది..?

October 22, 2023 by M S R

పార్ధసారధి పోట్లూరి ……. మొహువ మొయిత్ర దేశద్రోహం వెనుక మమతా బెనర్జీ ప్రోత్సాహం ఉందా? మమతా బెనర్జీకి తెలియకుండానే మొహువ లండన్ లో జార్జ్ సోరోస్ ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లి రాహుల్ తో సమావేశం అయ్యిందా?

*******************

తన మీద వచ్చిన ఆరోపణలు పూర్తిగా కొట్టివేయాలని మొహువ డిమాండ్ చేస్తున్నది. ఒకవేళ విచారణ చేయాల్సివస్తే అది రహస్యంగా చేయాలని డిమాండ్ చేస్తున్నది నిస్సిగ్గుగా! చేసింది దేశద్రోహం అయినప్పుడు విచారణ రహస్యంగా ఎందుకు చేయాలి? నిరాధారమయిన ఆరోపణలు ప్రధాని మోదీ మీద రహస్యంగా చేసిందా?

Ads

భారతదేశ పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి దేశ విద్రోహ శక్తులతో చేతులు కలిపి గౌతమ్ ఆదానీ మీద బహిరంగంగానే దాడి చేస్తే విచారణ మాత్రం రహస్యంగా చేయాలా?  వెస్ట్ బెంగాల్ లో ఆదానీ పరిశ్రమ పెట్టడానికి అనుమతి ఇచ్చిన మమత వెనక నుండి మొహువ చేత వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నించింది!

moitra

*****************

Ideas for India !

భారత దేశానికి ఆలోచనలు ఇవ్వడానికంటూ Ideas for India పేరుతో అమెరికాలో సమావేశం ఏర్పాటు చేశాడు జార్జ్ సోరోస్ (ఫోటో చూడండి). ఈ సమావేశంలో రాహుల్, శామ్ ఏసు పిట్రోడా, తేజస్వి యాదవ్ (10th ఫెయిల్డ్), సీతారాం ఏచూరి, మొహువ మొయిత్ర, సల్మాన్ ఖుర్షీద్, మనోజ్ ఝాలు హాజరయ్యారు! కామెడీ ఏమిటంటే భారత దేశం ఎలా అభివృద్ధి చెందాలో అమెరికాలో సమావేశం అయ్యి మన దేశానికి సలహాలు, సూచనలు ఇస్తారట! అది ‘Ideas for India’ కాదు. అది ‘ Ideas for how to destruct India’ సమావేశం.

***************

దర్శన్ హీరానందాని అప్రూవర్ గా మారిపోయాడు! రియల్ ఎస్టేట్ బిలియనీర్ నిరంజన్ హీరానందాని కొడుకే దర్శన్ హీరానందాని! దర్శన్ తాను తృణమూల్ రాజ్యసభ సభ్యురాలు అయిన మొహువ మొయిత్రని తన వ్యాపార అవసరాలకు అనుగుణంగా వాడుకున్నాను అని ఒప్పకుంటూ ఆఫిడవిట్ ఇచ్చాడు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి.

మొహువ మొయిత్ర పరువునష్టం దావా వేసింది బీజేపీ పార్లమెంట్ సభ్యుడు అయిన నిషికాంత్ దూబే మీద! నిశికాంత్ దూబే గతంలో మొహువ మొయిత్ర డబ్బులు తీసుకొని ప్రశ్నలు అడుగుతున్నది అంటూ ఆరోపణలు చేశాడు. మొన్న అనగా శుక్రవారం ఢిల్లీ హైకోర్టు లో విచారణకి వచ్చింది. వాయిదా పడ్డది అనుకోండి.

ఇప్పుడు దర్శన్ అప్రూవర్ గా మారాడు కాబట్టి నిషికాంత్ దూబే చేసింది ఆరోపణలు ఆరోపణలు కావు నిజాలే అని దర్శన్ అఫిడవిట్ నిరూపిస్తున్నది. ఢిల్లీ హైకోర్టు మొహువ వేసిన పరువు నష్టం దావా కొట్టివేస్తుంది వచ్చే వాయిదాలో! ఇక పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ మిగిలింది కానీ విచారణ రహస్యంగా చేయాలని డిమాండ్ చేస్తున్నది మొహువ.

**************

మొయిత్ర

హీరా నందాని మొత్తం 3 పేజీల అఫిడవిట్ ఇచ్చాడు పార్లమెంట్ ఎథిక్స్ కమిటీకి! ఆ అఫిడవిట్ లోని కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

1.తన అఫిడవిట్ లో రెండు చోట్ల రాహుల్ పేరుని ప్రస్తావించాడు. అంటే ఈ కుట్రలో రాహుల్ కి సంబంధం ఉండవచ్చు అన్నాడు.

2.తను దుబాయ్ లో ఉండగా ఫోన్ చేసి రమ్మంటే మొహువ దుబాయ్ వచ్చింది. విమానం టికెట్ నేనే బుక్ చేశాను అన్నాడు.

3.దుబాయిలో నా ఫ్లాట్ లో మొహువ ఉన్నప్పుడే నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను, నువ్వు ఇప్పుడు పార్లమెంట్ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ అవగలవా అని అడిగితే, నేను యూజర్ id, పాస్వర్డ్ ఇస్తాను నువ్వే చూసుకో అంటూ నాకు లాగిన్ వివరాలు ఇచ్చింది మొహువ, నేను లాగిన్ అయ్యి వివరాలు తీసుకున్నానంటున్నాడు.

4.జార్జ్ సోరోస్, హిండెన్ బర్గ్, శశిథరూర్, మరికొందరి పేర్లు ప్రస్తావించినట్లు తెలుస్తున్నది.

5.మొహువ మొయిత్రతో తన సంబంధం గురుంచి ఇలా చెప్పుకొచ్చాడు హీరా నందాని…….

2017 లో నేను వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంకి చెందిన టెండర్లలో పాల్గొన్నాను. నాకు పోటీగా గౌతమ్ ఆదానీ కూడా టెండర్లు వేశాడు. నేను వేసిన టెండర్లు ఏవి కూడా సక్సెస్ కాలేదు. అప్పుడు మొదటిసారిగా మొహువ మొయిత్రని కలిసి వేరే ప్రాజక్టుల కోసం మళ్లీ టెండర్లు పిలవబోతున్నది మమత, కనుక ఈసారైనా నా టెండర్లు సక్సెస్ అయ్యేట్లుగా మమతతో మాట్లాడమని అడిగాను, మొహువ ఈసారి నా పని చేసిపెట్టింది.

6.అది మొదలుగా తనకి లగ్జరీ వస్తువులు కొనిపెట్టమని డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఖరీదయిన కార్లు, విదేశీ ప్రయాణాలు ( ఎక్జిక్యూటివ్ క్లాస్, బిజినెస్ క్లాస్ టికెట్లు), విదేశీ మద్యంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి. అడుగుతున్న కొద్దీ ఇస్తూ పోయానంటున్నాడు.

7.మొహువ మొయిత్ర తనతో చేసిన whats up చాట్స్ వివరాలు అన్నీ ఆఫిడవిట్ లో పొందుపరిచాడు దర్శన్ హీరానందాని!

*******************

దర్శన్ తన అఫిడవిట్ లో పేర్కొన్న మరో విషయం ఏమిటంటే… మొహువ మొయిత్ర చిన్న విషయమని, రాహుల్,జార్జ్ సోరోస్, శామ్ పిట్రోడా, శశి థరూర్ ల విషయంలో అంతర్జాతీయ కుట్ర ఉందనీ, విచారణ చేస్తే అన్నీ బయట పడతాయని పేర్కొన్నాడు!

అసలు ఒక రికార్డ్ గురుంచి చెప్పుకోవాలి ఇక్కడ. అదేమిటంటే భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక కుట్ర బయటపడి, మూడు రోజుల్లోనే మొత్తం కుట్ర తాలూకు వివరాలు బహిర్గతం కావడం ఇదే మొదటిసారి!

2005 లో అనుకుంటా 11 మంది పార్లమెంట్ సభ్యులు ఇలాంటి కేసులో ఇరుక్కోని పార్లమెంట్ నుండి బహిష్కరించబడ్డారు! పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ విచారణ తరువాత ఈ కేసు విషయంలో ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుస్తుంది. రాహుల్ మళ్లీ చిక్కులలో పడడం తధ్యమనే అంటున్నారు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions