సాధారణంగా సినిమావాళ్ల ఇంటర్వ్యూలు మొత్తం హిపోక్రసీతో నిండి ఉంటయ్… హీరోయిన్ల ఇంటర్వ్యూలయితే రిపోర్టర్లే రాసేస్తుంటారు చాలాసార్లు… కానీ మంచి లైవ్‌గా, లవ్లీగా ఉండేవి కొన్ని మాత్రమే ఉంటయ్… ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ కోసం రాజమౌళి నానా వేషాలు వేస్తున్నాడు కదా… అందులో భాగంగా రాంచరణ్, జూనియర్‌తో కీరవాణి చిట్‌చాట్ ఏర్పాటు చేశాడు… అది జనంలోకి వదిలాడు… కానీ విశేషం ఏమిటంటే..? రాజమౌళి సినిమాలాగా కృతకంగా గాకుండా సరదాగా సాగింది…
ప్రత్యేకించి రాంచరణ్ కాస్త సిగ్గరి, కొంచెం డిప్లొమాట్ అనిపించింది… కానీ జూనియర్ మాత్రం ఏ హిపోక్రసీ, తొక్కాతోెలూ లేకుండా తన మనసులో ఉన్నది ఉన్నట్టు షేర్ చేసుకున్న తీరు కాస్త బాగనిపించింది… నిజానికి ఇండస్ట్రీలో ఒకరిని మెచ్చుకోవడానికి, సర్టిఫికెట్ ఇవ్వడానికి చాలా చాలా ఆలోచిస్తారు… చాలా లెక్కలుంటయ్… చాలావరకు మాటలు నాలుక మీద నుంచే తప్ప గుండె నుంచి రావు… కానీ జూనియర్, కొన్నిచోట్ల రాంచరణ్ భేషజాలు, దాచుకోవడాలు, డిప్లొమసీ వంటివేమీ లేకుండా మాట్లాడారు…
ఇదే కీరవాణి వందల పాటల్ని కంపోజ్ చేశాడు, ఏం పాట మీకు నచ్చలేదు అనే ప్రశ్నకు జూనియర్ నిర్మొహమాటంగా జవాబు చెప్పాడు… అదేదో సినిమాలో భీమవరం బుల్లోడా పాలు కావాలా అనే పాట… హిట్ పాటే, కానీ నాకే ఎందుకో కనెక్ట్ కాలేదు అనేశాడు… స్ట్రెయిట్ ఆన్సర్… అలాగే నచ్చిన సింగర్ ఎవరు అనేది చాలా గొట్టు ప్రశ్న… ఐనా సరే, జూనియర్ ఒక్క క్షణం తడబడకుండా, వెనుకాడకుండా మోహన భోగరాజు పేరు చెప్పాడు… రాంచరణ్ కూడా ఏకీభవించాడు…
Ads
ఎందుకు..? ఆమె అరవింద సమేత సినిమాలో పాడిన రెడ్డమ్మ తల్లి పాటకు బాగా కనెక్టయ్యాడుట… (బుల్లెట్ బండెక్కి పాట ఫేమ్)… గీతామాధురి పాడిన జై బాలయ్యా పాటను మెచ్చుకున్నారు… రాంచరణ్ ప్రత్యేకంగా మంగ్లిని ప్రశంసించాడు… కారణం :: సారంగదరియా పాట
ఈ చిట్‌చాట్‌లో బాగా సరదాగా అనిపించింది మరో విషయం… సుమ కనకాల… అసలు కీరవాణి ఈ ప్రశ్న ఎందుకు అడిగాడో అర్థం కాలేదు, అఫ్‌కోర్స్, కీరవాణి అంటేనే అర్థం కాని ఓ కేరక్టర్ కదా… వందల సినిమా ఫంక్షన్స్ చేసింది కదా ఆమె… అందరికీ చనువు ఎక్కువ, అందరితోనూ ఆ కార్డియల్ రిలేషన్ మెయింటెయిన్ చేస్తుంది తను… ఇప్పుడు జయమ్మ పంచాయితీ అని ఓ సినిమా చేస్తోంది… కీరవాణి ప్రశ్న ఏమిటంటే… ఒకవేళ సుమకు మీ సినిమాల్లో చాన్స్ ఇవ్వాలి, ఎలాంటి పాత్ర సజెస్ట్ చేస్తారు..?
జూనియర్ ఇక్కడ కూడా సరదాగా… అప్పుడెప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టింది, బామ్మ లేదా మామ్మ కేరక్టర్ బెటర్… అసలు ఛాయాాదేవి, సూర్యకాంతం, నిర్మలమ్మల తరువాత బామ్మ పాత్రలు పోషించేవాళ్లే లేకుండా పోయారు… సుమ కరెక్టుగా ఆ ఖాళీని భర్తీ చేయగలదు అన్నాడు… హహహ… రాంచరణ్ చిన్నప్పుడు కర్నాటక సంగీతం నేర్చుకున్నాడు అనేది కొత్తగా తెలిసిన సంగతి…!! అరగంట ప్రమోషనల్ వీడియోలో మిగతా అంశాలన్నీ బ్లా బ్లా…!!
Share this Article