Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!

October 17, 2026 by M S R

.

రూ. 16 లక్షల వార్షిక టర్నోవర్ కంపెనీ… తరువాత రూ.48 కోట్ల పెట్టుబడిగా మారింది… ఇప్పుడు దాని విలువ రూ.5,800 కోట్ల సంపద! జియో ఐపీఓతో వార్తల్లోకి మహేంద్ర నహతా!! చిన్న వాటా.. భారీ సంపద! అంబానీ జియో ప్రయాణంలో కీలకమైన మలుపు దగ్గర ఉన్న ఈ వ్యాపారవేత్త కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అంబానీ టెలికాం ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి జస్ట్ 16 లక్షల వార్షిక టర్నోవర్ ఉన్న ఓ చిన్న కంపెనీని మధ్యవర్తిగా వాడుకున్నాడు… అది ఎలాగో మనం ఇంతకుముందు కథనంలో సవివరంగా చెప్పుకున్నాం… ఈ మొత్తం కథలో ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాలి… తన పేరు మహేంద్ర నహతా… ఇప్పుడు జియో భారీ ఐపీఓ నేపథ్యంలో చర్చకు వస్తున్న తన కథ చాలా అనూహ్యం, ఆశ్చర్యకరం… అంబానీ తోడుంటే సంపద ఎలా పెరుగుతుందో చెప్పే కథ…

Ads

తనకు సహకరించిన వారిని తను లాభాల్లో ముంచేస్తాడు అంబానీ… రూ.48 కోట్ల పెట్టుబడి విలువ సుమారు రూ.5,800 కోట్లకు చేరడం అంటే మామూలు విషయం కాదు… హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (HFCL) ప్రమోటర్‌గా పేరున్న మహేంద్ర నహతా కథలోకి వెళ్దాం…

mahendra nahata

పదహారేళ్ల క్రితం మొదలైన కథ! మహేంద్ర నహతా కథలో అసలు ఆసక్తికరమైన ఘట్టం 2010లో మొదలవుతుంది… ఇన్ఫోటెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఈయన కంపెనీ… అప్పటికి ఏదో నామ్‌కేవాస్తే… 16 లక్షల టర్నోవర్… దీన్ని అంబానీ స్పెక్ట్రమ్ వేలంలో ముందు పెట్టాడు… కథ నడిపించాడు…

దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే హక్కులను ఇన్ఫోటెల్ దక్కించుకుంది వేలంలో… వెంటనే ఈ కంపెనీని రిలయెన్స్ ఇండస్ట్రీస్ కొనేసింది… టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది… తరువాత జియో పుట్టుక (Reliance Jio Infocomm), ఎదుగుదల అందరికీ తెలిసిందే… 2016లో వాణిజ్య సేవలు ప్రారంభించిన జియో, ఉచిత వాయిస్ కాల్స్, చౌక డేటా వంటి వ్యూహాలతో భారత టెలికాం మార్కెట్‌ను సమూలంగా మార్చేసింది… జియో ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు 11 లక్షల కోట్లు…

ఐతే ఈ కంపెనీని కొన్నప్పుడు మహేంద్ర నహతాకు 0.54 శాతం అలాగే ఉంచేశారు… రిలయెన్స్‌తో బంధం ఈరోజుకూ కొనసాగుతోంది… జియో ఏర్పడినప్పుడు 4.79 కోట్ల షేర్లను పది రూపాయల ముఖవిలువతో అలాట్ చేశారు మహేంద్ర నహతాకు… అంటే 48 కోట్లు… ఇప్పటి జియో మార్కెట్ విలువతో లెక్కిస్తే ఆ వాటా ప్రస్తుత విలువ 5800 కోట్లు… అంటే 11,295 శాతం వృద్ధి… అదీ ఆరేళ్లలో… ఇంకేం కావాలి..?



jio

అన్నట్టు… మహేంద్ర నహతా ఇప్పటికీ రిలయెన్స్ గ్రూపుకి అత్యంత సన్నిహిత మిత్రుడు ప్లస్ వ్యాపార భాగస్వామిగా కొనసాగుతున్నాడు… రీసెంటుగా ఆకాశ్ అంబానీతో కలిసి 6జీ ప్రాస్పెక్టస్ మీటింగులో పాల్గొన్నాడు తను కూడా…

తను 2010 నుంచి నేటికీ Reliance Jio Infocomm Ltd బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు… తన HFCL సంస్థ రిలయన్స్ జియో 4G, 5G ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్, నెట్‌వర్క్ పరికరాల సరఫరాలో ఇప్పటికీ అతిపెద్ద వెండర్‌గా, నమ్మకమైన భాగస్వామిగా కొనసాగుతోంది… 16 ఏళ్ల క్రితం తను టెలికాం స్పెక్ట్రమ్ వేలం కోసం వాడుకున్న ఓ చిన్న కంపెనీకి అంబానీ సమకూర్చిన సంపద విలువ 5800 కోట్లు ప్లస్ తనతో వ్యాపార భాగస్వామ్యం..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!
  • వీథుల్లో అల్లర్లు – అలజడి … వీటితో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం !!
  • నోబెల్ విజేత – తండ్రి కోరిక కోసం, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది !
  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!
  • గడుసు వ్యాపారి మస్క్ – ‘రాకెట్ కారు’ లాంచింగ్ అదరగొట్టేశాడు !!
  • నీయక్క – రణబాలితోనూ నీ గ్రహచారం మారలేదోయ్ విజయ్…
  • నీట్, వోట్… అన్నీ సాకులు ! ప్రభుత్వం కూల్చడమే అసలు టార్గెట్ !!
  • ప్రేమ్ వత్స ! హైదరాబాద్ రూట్స్ – ఐడీబీఐ కొనే ఫెయిర్‌ఫాక్స్ తనదే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions