.
Pardha Saradhi Upadrasta …. ఆప్ నుంచి బీజేపీకి షిఫ్ట్… అసలు గేమ్ ఏమిటి? 7 మంది ఆప్ ఎంపీలు పార్టీ మారడం పెద్ద విషయంలాగా కనిపిస్తున్నది కదా, ఈ కథలో అసలు కీలక వ్యక్తి సందీప్ పాఠక్. ఇది కేవలం నాయకుల మార్పు కాదు… ఒక “ఎలక్షన్ సిస్టమ్” మార్పు.
పాఠక్ ఒక సాధారణ రాజకీయ నాయకుడు కాదు; డేటా ఆధారిత వ్యూహాలతో ఎన్నికల ఫలితాలను మార్చగల “Election Engineer”. ఆయన ఫార్ములా సింపుల్‌గా కనిపించినా చాలా శక్తివంతమైనది — Emotion + Data = Victory.
ఈయన్ని ప్రత్యేకంగా పంజాబ్ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు పంజాబ్ కి పట్టుకొచ్చారు. ఢిల్లీ, పంజాబ్ రాజకీయ సర్కిల్ లలో ఈయనొక మినీ ప్రశాంత్ కిషోర్ లాగా పిలవపడతారు
Ads
పంజాబ్ విజయం వెనుక అసలు మోడల్
ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో 92 సీట్ల భారీ విజయానికి కారణం ఈ డేటా మోడల్.
ఈయన పంజాబ్ లో మిస్డ్ కాల్ చేయి, నీ సీఎం చాయిస్ చెప్పు అనే డిజిటల్ కాంపెయిన్ నడిపారు
సాంప్రదాయ పార్టీలు స్థానిక నేతల ఫీడ్‌బ్యాక్‌పై ఆధారపడితే, ఈ మోడల్‌లో ప్రతి ఓటర్‌ను ఒక డేటా పాయింట్‌గా చూసారు. మిస్డ్ కాల్ క్యాంపెయిన్ ద్వారా లక్షల మొబైల్ నంబర్లు సేకరించి, ఓటర్ల ఆసక్తి, భావోద్వేగాలను మ్యాప్ చేసి టార్గెట్ క్యాంపెయిన్లు చేశారు.
మైక్రో టార్గెటింగ్ ఎలా పని చేసింది?
ప్రతి నియోజకవర్గాన్ని చిన్న గ్రూపులుగా విభజించారు . మహిళలు, యువత, రైతులు, SC/ST, OBC. ప్రతి వర్గానికి వేర్వేరు మెసేజ్, వేర్వేరు వాగ్దానాలు. అదే సమయంలో గ్రౌండ్ టీమ్స్ ద్వారా ఓటర్ల మూడ్, స్థానిక సమస్యలు, ప్రతిపక్ష బలహీనతలు నిరంతరం ట్రాక్ చేశారు. ఇది ఒక రాజకీయ “ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్” లాగా పని చేసింది.
స్వింగ్ సీట్లు ఎలా గెలిచారు?
ఒక సీటు 50- 50లో ఉందని డేటా చూపిస్తే వెంటనే భారీ ర్యాలీలు, హైపర్-లోకల్ క్యాంపెయిన్లు, సోషల్ మీడియా బూస్ట్, ఇలా ఫోకస్ పెంచి ఆ సీట్లను గెలిచేలా చేశారు. Close fights ను comfortable wins గా మార్చడం ఇదే మోడల్ ప్రత్యేకత.
ఇప్పుడు గేమ్ ఎందుకు మారుతుంది?
ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది , డేటా మాత్రమే కాదు, ఆ డేటాను ఎలా ఉపయోగించాలో తెలిసిన వ్యక్తి కూడా కీలకం. సందీప్ పాఠక్ వంటి స్ట్రాటజిస్ట్ మారితే, అదే మోడల్ మరో పార్టీకి వెళ్తుంది. అంటే ఒక పార్టీ స్ట్రెంగ్త్, మరో పార్టీకి ఆయుధంగా మారే అవకాశం.

బీజేపీకి లాభం ఏమిటి?
భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పంజాబ్‌లో బలహీనంగా ఉన్నా, ఇప్పుడు డేటా ఆధారిత వ్యూహాలతో ముందుకు రావచ్చు. AAP బలహీనతలు లోపల నుంచి అర్థం చేసుకోవచ్చు, స్వింగ్ ఓటర్లపై కచ్చితమైన టార్గెటింగ్ చేయవచ్చు.
5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తిగా అయిపోకుండానే ఫలితాలు రాకుండానే వచ్చే ఏడాది జరిగే పంజాబ్ ఎన్నికల మీద బీజేపీ దృష్టి పెట్టింది.
బీజేపీ అతిరధ నాయకులంతా అక్కడ ఎన్నికల ప్రచారంలో హడావుడిగా, ఉంటే బీజేపీ అధ్యక్షుడు తన పార్టీ వ్యవహారాల్లో పండిపోయిన BL సంతోష్, తరుణ్ చుగ్, ధర్మేంద్ర ప్రధాన్ , వినోద్ తావ్డేలతో ఒక జట్టు ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో పని ఎప్పుడో మొదలు పెట్టారు.
• బి.ఎల్. సంతోష్ – ఆర్గనైజేషన్ మాస్టర్
• తరుణ్ చుగ్ – పంజాబ్ ఇన్‌ఛార్జ్
• ధర్మేంద్ర ప్రధాన్ – స్ట్రాటజిక్ ప్లానింగ్
• వినోద్ తావ్డే – గ్రౌండ్ ఎగ్జిక్యూషన్
వీరు “Continuous Campaign Mode” లో ఉంటారు.
బీజేపీ ఇలా తవ ఎలక్షన్ machinery ను అలుపు ఎరగకుండా వాడుతుంది కాబట్టే దానికి ఫలితాలు కూడా వస్తాయి. గెలుపు వోటములతో పని లేకుండా క్షేత్ర స్థాయిలో కష్టపడతారు. ఏ రాష్ట్రంలో ఏ వ్యూహం పనికొస్తుందో దాన్ని వర్క్ ఔట్ చేస్తారు.
ఇది కేవలం పార్టీ మార్పు కాదు… ఇది “డేటా యుద్ధం”. పాత రాజకీయాలు “నాయకుడు + కులం + డబ్బు”పై నడిస్తే, కొత్త రాజకీయాలు “డేటా + వ్యూహం + అమలు”పై నడుస్తున్నాయి. చివరికి గెలిచేది ఎవరు అంటే — డేటా ఉన్నవాడు కాదు, దాన్ని సరిగ్గా ఉపయోగించినవాడు.
బీజేపీకి పంజాబ్ లో పోయేది ఏమి లేదు. వచ్చేది ఏమి లేదు. ప్రజలు ప్రత్యామ్నాయంగా భావిస్తే సీట్లొస్తాయి, ఇంకా అదృష్టం కలిసి వస్తే అధికారానికి వస్తుంది, లేకపోతే ప్రస్తుతం ఉన్న 3 సీట్లకంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా బోనస్. లాంగ్ టర్మ్ లో పార్టీ బలోపేతానికి ఈ కృషి పనికి వస్తుంది.
That’s how political organic growth helps.
—– ఉపద్రష్ట పార్ధసారధి
#PardhaTalks #AAP #BJP #PunjabPolitics #SandeepPathak #RaghavChadha #DataPolitics #ElectionStrategy #IndianPolitics #PoliticalStrategy
Share this Article