Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వీరసింహుడి ప్రియురాలు మీనాక్షి… అసలు ఎవరీ తేనె గులాబీ… అనగా హానీ రోజ్…

January 14, 2023 by M S R

అన్‌స్టాపబుల్ షోలో ఒక ఎపిసోడ్‌ను బాలకృష్ణ వీరసింహారెడ్డి ప్రమోషన్‌కు అంకితం చేశాడు కదా… అసలు ఆ షో కేరక్టర్ ఏమిటో, బాలయ్య ఏం చేస్తున్నాడో అంతా అల్లు అరవింద్‌కే ఎరుక… అసలే ఈసారి రకరకాల ప్రయోగాలతో అన్‌స్టాపబుల్ అనాసక్తికరంగా తయారైంది… దానికితోడు ఏకంగా తన సినిమా ప్రమోషన్‌కు ఒక ఎపిసోడ్ మొత్తాన్ని అంకితం చేయడంతో దానిపై ఇంట్రస్ట్ పోయింది చాలామందికి… ఇక రాబోయే ఎపిసోడ్ పవన్ కల్యాణ్‌తో ఉంటుంది… ఏముంది..? జజ్జనకరి జనారే…

వీరసింహారెడ్డి ప్రమోషనల్ ఎపిసోడ్‌లోకి ఆ సినిమాలో నటించిన కీలక తారాగణం మొత్తాన్ని తీసుకొచ్చాడు… డైరెక్టర్ గోపీచంద్‌ను కూర్చోబెట్టి మొదట వరలక్ష్మితో కాసేపు చిట్‌చాట్… వరలక్ష్మి సినిమాల్లో చూపించినట్టు గాకుండా యాక్టివ్‌గా, సరదాగా కనిపించింది… బాగా సన్నబడింది కూడా… హీరోహీరోయిన్లుగా చేద్దామా ఒక సినిమాను అని వరలక్ష్మిని అడిగితే వెంటనే సై అనేసింది… తరువాత అన్ని భాషల్లో నటించిన తరుణి అంటూ మరొకరిని పిలిచాడు బాలయ్య…

వావ్, అన్ని భాషల్లోనూ నటించిన తరుణియా..? ఎవరబ్బా..? అంత పాపులర్, అంత ఫేమస్ నటికి వీరసింహారెడ్డితో ఏం పని అనుకుంటుండగానే హానీరోజ్ అడుగుపెట్టింది సెట్ మీదకు… నిజానికి బాలయ్య చెప్పింది దక్షిణ భారత భాషలన్నింటిలో నటించిన అని… తరువాత వెనక్కి వెళ్లి చూస్తే తెలిసింది… అవును, ఆమె ఖాతాలో నాలుగు భాషలూ ఉన్నాయి… కానీ అలా నాలుగు దక్షిణ భాషల్లోనూ నటించిన వాళ్లు బోలెడుమంది నటీమణులు ఉంటారు… అదేమీ గొప్పతనం కాదు…

Ads

ఇంతకుముందు తమిళ, మలయాళం సినిమాల్లో నటీనటులు దాదాపు సేమ్… పెద్ద హీరోలు, కమెడియన్లు మినహా మిగతా ఆర్టిస్టులు..! తరువాత వారిలో చాలామంది తెలుగులోనూ నటించారు… గతంలో పెద్దగా లేదు గానీ ఇప్పుడు కన్నడ ఆర్టిస్టులు కూడా ఇతర భాషల్లో, ఇతర భాషల ఆర్టిస్టులు కన్నడంలో నటిస్తున్నారు… అసలు ఎవరు ఈ హానీరోజ్…

honey rose

ఆమె కెరీర్ ఓసారి తిరగేస్తే 2005 నుంచీ తిప్పలు పడుతూనే ఉంది… అడపాదడపా సినిమాలు తప్ప అంత పెద్ద గిరాకీ ఉన్న నటేమీ కాదు… 2016లో ఒక్క సినిమా కూడా లేదు… కెరీర్ మొదట్లో ఆలయం అనే తెలుగు సినిమాలో చేసింది… అసలు ఆ సినిమా వచ్చిపోయినట్టు కూడా ఎవరికీ తెలియదు… అందులో ఈమె ఏ పాత్ర చేసిందో అసలే తెలియదు…

2014లో ఈ వర్షం సాక్షిగా అనే తెలుగు సినిమా చేసింది… అది వరుణ్ సందేశ్ సినిమా, ఈమెది లీడ్ రోల్ కాదు… కన్నడ నటి శృతిచంద్రసేన అలియాస్ హరిప్రియ చేసింది లీడ్  రోల్… ఇక తెలుగుతో హానీ రోజ్‌కు లింకేమీ లేదు… తాజాగా వీరసింహారెడ్డిలో చేసిన మీనాక్షి పాత్రతో మళ్లీ తెలుగుతో అనుబంధం… దర్శకుడు గోపీచంద్ చెప్పినట్టు ప్రస్తుతం హానీ రోజ్ మలయాళంలో ఫుల్ రెయిజింగులో కూడా ఏమీ లేదు…

rose

మధ్యలో ట్రివేండ్రమ్ లాడ్జిలో తన పాత్ర బాగా హిట్టయ్యేసరికి ఆ పాత్ర పేరు ధ్వనిని తన తెరపేరుగా మార్చుకుంది ఈమె… కొన్నాళ్లకే మళ్లీ ఏమనిపించిందో పాత హానీ రోజ్‌గా మారిపోయింది… వీరసింహారెడ్డిలో కూడా మీనాక్షి పాత్రకు పెద్ద ప్రాధాన్యమేమీ లేదు… పెద్ద వీరసింహుడికి ప్రియురాలి పాత్ర… చివరగా… ప్రస్తుతం ఆమె చేతిలో కొత్త సినిమాలు ఏమీ లేవు…! బాలయ్య చెప్పినంత పెద్ద సీనేమీ లేదు ఆమెకు… ఈ సినిమాలో, బయట..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions