Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దురంధర్..! మనం సినిమా చూసే విధానాన్ని మార్చేస్తోంది… కొత్తగా, బలంగా…!

March 22, 2026 by M S R

.

Raghu Mandaati …. గూఢచారుల ప్రపంచంలో…
అత్యంత శక్తివంతమైన ఆయుధం తుపాకీ కాదు…
ప్రజలు నమ్మాలని ఎంచుకునే కథ.
ఈ ఒక్క లైన్‌తోనే
ధురంధర్ & ధురంధర్: ది రివెంజ్
మొత్తం ప్రయాణం అర్థమవుతుంది…

ధురంధర్ 1 & 2
కలిపి చూస్తే అది సినిమా అనిపించదు…
ఒక అనుభవం… ఒక అంతర్ముఖ ప్రయాణం…
కొన్ని ప్రశ్నలు వేసి వెళ్లిపోతుంది… కొన్ని జవాబులు మనలోనే వదిలేస్తుంది…

Ads

మొదటి భాగం
కథను నమ్మించే పని చేస్తుంది…
రెండో భాగం
ఆ నమ్మకాన్ని ‌వెపన్గా మార్చుతుంది…
సినిమా ఒక కథ చెబుతుంది అనుకోవడం సులభం…
కానీ కొన్ని సినిమాలు కథను చెప్పవు…
మనల్ని కథలోకి నెట్టేస్తాయి…
ధురంధర్ అలాంటిది.

దేశం అనే భావన కేవలం భౌగోళిక రేఖలతో కాదు ఎవరో కనిపించని వ్యక్తుల త్యాగాలతో నిలబడుతుంది అని నిరూపించే స్క్రీన్ ప్లే నిర్మాణం…
ఒక కంప్లీట్ స్పై ఎక్స్పీరియన్స్ కాదు…
ఇదొక సైకాలజికల్ వార్.

హౌసలా: భయంతో పోరాటం
ఈంధన్: నిశ్శబ్దంగా కాలిపోతున్న మనసు
బద్లా: ఒక భావానికి ఇచ్చే సమాధానం
సాధారణంగా మనం చూసే స్పై సినిమాలతో పోలిస్తే ఇది మాత్రం చూడని వాటి గురించి చెబుతుంది…
ఎవరూ గుర్తించని వాళ్ల గురించి…
గుర్తించకూడని వాళ్ల గురించి…
అక్కడే ఈ సినిమా తన భారం పెంచుకుంటుంది…

నిజం… కల్పన కంటే ఎక్కువ ఆశ్చర్యకరం అంటారు…
కానీ ఇక్కడ కల్పన కూడా నిజం ముందు తలవంచినట్టు అనిపిస్తుంది…
కొన్ని సంఘటనలు మనం వార్తల్లో చూసి మర్చిపోతాం…
ఇక్కడ అవే సంఘటనలు…
ఒక నిశ్శబ్దంగా తిరిగి నెమరు వేస్తాయి.
సినిమా నడుస్తున్నంతసేపు
మనం చూస్తున్నామా… లేక మనల్ని ఎవరో గమనిస్తున్నారా అన్న భావన వస్తుంది…
ఎందుకంటే
ఇది బయట జరిగే కథ కాదు…
లోపల నడిచే యుద్ధం…

కొన్ని పాత్రలు నటుడిని మరిచిపోతాయి…
కొన్ని పాత్రలు నటుడిలోనే మిగిలిపోతాయి…
ఇది రెండోది.
ఒక సినిమా ముగిసిన తర్వాత మనం థియేటర్‌ నుంచి బయటకు వస్తాం…
కానీ ఆ సినిమా మనలో నుంచి బయటకు వస్తుందా?
కొన్ని డైలాగులు మనలోనే మిగిలిపోతాయి.
కొన్ని సన్నివేశాలు మన ఆలోచనల్లో తిరుగుతూనే ఉంటాయి.
కొన్ని పాత్రలు… మనకు తెలియకుండానే మన అభిప్రాయాలుగా మారిపోతాయి.
ఇదే అసలైన ప్రభావం.

ఇప్పటి భారతీయ సినిమాలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది.
హీరో అంటే కేవలం ఒక వ్యక్తి కాదు… ఒక ఐడియాలజీ కి ప్రతినిధి.
విలన్ అంటే కేవలం చెడు మనిషి కాదు…
కొన్ని సందర్భాల్లో ఒక వర్గం, ఒక ఆలోచన, ఒక చరిత్ర.
మనం కథ చూస్తున్నామని అనుకుంటాం…
కానీ నిజానికి మనం ఒక పర్స్పెక్టివ్ ను నేర్చుకుంటున్నాం.

ఒకప్పుడు సినిమాలు మనల్ని ప్రశ్నించేవి
ఎందుకు? అని అడిగేవి.
ఇప్పుడు కొన్ని సినిమాలు మనకి సమాధానాలు ఇస్తున్నాయి
ఇదే నిజం అని చెప్పేస్తున్నాయి.
ప్రశ్నలు తగ్గి… నిర్ణయాలు పెరిగితే,
అక్కడే ఆలోచన క్రమంగా బలహీనపడుతుంది.
సినిమా ఒక అద్దం లాంటిది అంటారు.
సమాజాన్ని ప్రతిబింబించాలి.
కానీ…
అద్దం ముందు నిలబడిన మన ముఖాన్ని మార్చడం మొదలుపెడితే?
అది ప్రతిబింబం కాదు…
అది నిర్మాణం.

నేటి దర్శకులు, రచయితలు, నిర్మాతలు
వాళ్లు కేవలం కథలు చెబుతున్నారో…
లేక కథల రూపంలో ఒక భావజాలాన్ని నిర్మిస్తున్నారో…
అది వాళ్లకే తెలుసు.
కానీ ప్రేక్షకుడిగా మనం ఒక చిన్న పని చేయాలి
చూసిన ప్రతి సన్నివేశం తర్వాత ఒక క్షణం ఆగాలి.
ఇది నన్ను ఏం ఫీలవ్వమని ప్రయత్నిస్తోంది?
నేను ఎందుకు ఈ పాత్రను ఇష్టపడుతున్నాను?
ఈ కథలో ఎవరు కనిపించడం లేదు?
ఈ మూడు ప్రశ్నలు చాలు.

ఎందుకంటే
ప్రాపగాండా ఎప్పుడూ అబద్ధంగా రాదు.
అది నిజాల మధ్యలో దాగి వస్తుంది.
ఒక అర్ధసత్యం…
ఒక బలమైన భావోద్వేగం…
ఒక గొప్ప విజువల్…
ఇవన్నీ కలిసినప్పుడు, మనం చూసేది సినిమా కాదు మనకు చూపించాలనుకున్న ప్రపంచం.

అయితే మనకు అనిపించేది ఒకటే…
నువ్వు నమ్మేది నిజమా…
లేదా నువ్వు నమ్మాలని ఎంచుకున్న కథా…?
సినిమా మారాలా?
లేక మనం చూసే విధానం మారాలా?
సినిమా ఎప్పుడూ ఎవరో ఒకరి కథే చెబుతుంది.
కానీ మనం వినేది… మనం ఎంచుకున్న అర్ధం.

అందుకే…
కథలు వినండి.
అందులో మునిగిపోండి.
కానీ బయటకు రావడం మర్చిపోవద్దు.
ఎందుకంటే
థియేటర్‌ లో లైట్లు ఆఫ్ అవుతాయి…
కానీ మనలో ఆలోచించే వెలుగు మాత్రం ఆరిపోకూడదు…
ఇదంతా ఎందుకు రఘూ అసలు విషయం చెప్పు అంటారా… అయితే ఇవి ఒక కల్ట్ మూవీస్ అని చెప్పొచ్చు…
.
.
.
.
.
.
.
రఘు మందాటి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దురంధర్..! మనం సినిమా చూసే విధానాన్ని మార్చేస్తోంది… కొత్తగా, బలంగా…!
  • నో, నో… నేను దురంధర్ సినిమా చూడను… ప్లీజ్, నన్నొదిలేయండి…
  • అవును, నేను నేషనలిస్టునే… సో వాట్..? అదేమైనా భ్రష్టాచారమా..?
  • ‘కేసీయార్ అమృత హస్తాలు – హరీష్‌ దివ్యాశీస్సులతో’ అని చెక్కించాలా..?!
  • కొందరు బ్రాండ్లను నమ్ముకోరు – వాళ్లే స్వయంగా బ్రాండ్లు అవుతారు…
  • పొలిటిషయన్ తెలివి ముందు జర్నలిస్టుల తెలివి… జస్ట్ ఓ జుజుబీ…
  • సినిమా- రాజకీయం… పడుగూపేక..!! అరవ పాలిటిక్స్ అదోరకం… ఎలాగంటే..?
  • గ్యాస్, పెట్రో, డీజిల్ మాత్రమే కాదు… ఎరువులకూ కొరత ప్రమాదం…
  • దురంధర్ లో బాగా పేలిన పాత్ర… బడే సాహెబ్… ఎవరీ నటుడంటే..?
  • భయం నుంచి విముక్తి – ఆ పచ్చిపుండు వేదన – దురందర్ మరో కోణం…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions