Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కరాటే కల్యాణి హైకోర్టుకు వెళ్తే… ‘మా’ పెద్దలకు సమాజ‘తత్వం’ తెలిసొస్తుంది…

May 26, 2023 by M S R

సో వాట్..? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులైనంత మాత్రాన ఒక ఎన్టీయార్‌నో లేక ఒక ఏఎన్నార్‌నో విమర్శించకూడదా..? నిజానికి కరాటే కల్యాణి ఎన్టీయార్ మీద ఏమీ విమర్శలు చేయలేదు… ఎన్టీయార్ బొమ్మ పెట్టుకుని, ఓ కులాన్ని పులిమి, కుల వోట్ల ధ్రువీకరణతో రాజకీయ లబ్ది పొందే నేలబారు ఎత్తుగడలు… శ్రీకృష్ణుడి రూపాన్నే కలుషితం చేసే వెగటు చర్య… దాన్ని విమర్శిస్తే తప్పేమిటి..?

కరాటే కల్యాణి జస్ట్, ఆ ప్రయత్నాన్ని విమర్శించింది… అంతే… ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ప్రతిష్టించే చర్యను హైదరాబాద్ హైకోర్టు కూడా తప్పుపట్టింది, స్టే విధించింది… బీసీ సంఘాలు అధికార పార్టీకి చెందిన మంత్రివర్యుడి చర్య మీద పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నయ్… ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా స్పందించే బీఆర్ఎస్ చడీచప్పుడూ లేదు… తమ మంత్రి కదా… తమకూ కమ్మ వోట్లు కావాలి కదా…

Ads

సో, ఇదంతా రాజకీయం… ఎన్టీయార్ నటనతో, వ్యక్తిగత జీవితంతో, అల్లుడితోనే వెన్నుదెబ్బలు తిన్న గతమో కాదు… ఆ విగ్రహం ఏర్పాటు మీద కరాటే కల్యాణి విమర్శలు చేసింది… ఆమె ఒక్కతే కాదు కదా, లక్షల మంది చేస్తున్నారు… వాళ్లందరినీ ఏం చేస్తున్నారు..? హైకోర్టు మీద ఏం యాక్షన్ తీసుకుంటారు సార్..? ఆమె మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ కాబట్టి ఆమె మీద ఆ కోణంలో యాక్షన్ స్టార్ట్ చేశారు…

maa

సో వాట్..? మా సభ్యులెవరూ, ఏ విషయంలోనైనా సరే ఏఎన్నార్, ఎన్టీయార్ పేర్లను ప్రస్తావించకూడదని మా బైలాలో రాసి ఉందా..? కల్యాణి గనుక కోర్టుకు వెళ్తే మా బాధ్యులకు పెద్ద ఎత్తున షాక్ తప్పదు… కానీ తెలివైన పోరాటం ఆమెకు చేతకాదు… నోరు పారేసుకోవడమే ఆమె పంథా… మా అధ్యక్షుడు మంచు బాబు, ఆ బాబుకు బాబు మోహన్ బాబు, ఆయనకిష్టుడు ఎన్టీయార్, ఆయన విగ్రహ స్థాపన మంచుకు ఇష్టం కాబట్టి మా సభ్యులందరూ ఇక నోళ్లు మూసుకోవాలా..? నచ్చకపోతే సంఘ సభ్యత్వమే మటాష్ అయిపోతుందా..? మా సంఘంలో అప్రకటిత రూలా ఇదేమైనా..?

ఆమె మా సభ్యురాలు కాబట్టి ఆమె సభ్యత్వాన్ని డిస్మిస్ చేశారట… ఎంతటి నీచపు చర్య..? కనీసం నోటీస్ అయినా ఇవ్వాలి కదా… ఆమె జవాబు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయేది… మా సంఘం మీద ఓ కులం పట్టు, పెత్తనం ఏమిటో తెలిసేది… ఎన్టీయార్‌ను రాజకీయంగా వ్యతిరేకించే బోలెడుమంది బోలెడురకాలుగా ఆయన్ని తిట్టిపోశారు… బతికి ఉన్నప్పుడు కూడా… అప్పుడు కనిపించని స్పందన, ఫాఫం మీ సంఘంలో సభ్యురాలు అయినందుకా ఇప్పుడు కనిపిస్తోంది… ఆడది ఏం చేస్తుందిలే అనే అహమా..? పెత్తందారీ పోకడా..? పోనీ, మా అసోసియేషన్ వైఖరి హైకోర్టు నిర్ణయాన్ని పరోక్షంగా అభిశంసిస్తున్నట్టుగా లేదా..?

ఐనా మా సంఘం చేసిందేమిటట… దాని ఎన్నికలు జరిగితే ఆ కులపు హీరోలు, ప్రముఖ నటులే రారు, వోటు వేయరు… దాని విలువ అదీ… దర్శకులతో, నిర్మాతలతో తగాదాలు వస్తే ఏ ఒక్క నటుడికి మద్దతుగా నిలిచిన దాఖలాలు లేవు… ముసలోళ్లయితే ముష్టి పెన్షన్లు వేయడం తప్ప మా సంఘం సాధించింది ఏమిటి..? ఈమాత్రం సంఘంలో సభ్యత్వానికి డబ్బు ఖర్చు… ఇలాంటి సందర్భాల్లో సభ్యుల మీద తమ సొంత అభిప్రాయాల్ని రుద్ది, సభ్యత్వాల్నే రద్దు చేసే అహం…

Ads

ఆమె బీసీ… రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ, ప్రత్యేకించి యాదవ సంఘాలు ఎన్టీయార్ విగ్రహ స్థాపనను వ్యతిరేకిస్తున్నాయి… ఆమె కూడా వ్యతిరేకించింది… తద్వారా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయడం అంటే…. మా సంఘం యాదవ వ్యతిరేకం, బీసీ వ్యతిరేకం అనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోందా..? లేక మా సంఘం ఫలానా కులానికే పరిమిత సంఘం అని చెప్పదలుచుకుందా..? ఇవేనా వృత్తి సంఘాలు అంటే..? కరాటే కల్యాణి పోకడల మీద అందరికీ బోలెడు కంప్లయింట్స్ ఉన్నాయి… ఈ విషయంలో మాత్రం ‘మా’ సంఘం మరీ దిగజారి వ్యవహరిస్తోంది… ఈ సంఘం మీద ఇంకెవరికైనా ఇంకా భ్రమలున్నాయా..?!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • మరీ అంత పెదకాపు ఏమీ కాదు… ఈ విరాటకర్ణుడు జస్ట్, ఓ చినకాపు మాత్రమే…
  • బట్టలిప్పుకుని బజారులో బరిబాతల డాన్స్ ఆడుతున్న చానెళ్లు…!!
  • బిగుసుకున్న ఇందిర చేతివేళ్ళు… సిరులు ఒలికించిన పంట చేలు…
  • పితృపక్షం అంటే ఏమిటి..? పితృదేవతలకు మనం ఏం చేయాలి..?
  • నారాతో నేను… ఒక విస్తృత దేవతా వస్త్రాల కథ…
  • ఆశలు ఉన్నచోట ఆశాభంగాలు… అలాగే లక్ష్యాలు కూడా..!!
  • 1.26 కోట్లు ఒక లడ్డూ… ఓ విల్లా ధరలా బాగా ఖరీదైన భక్తి…
  • దంచుడే దంచుడు… తెర నిండా బీభత్సమే… అచ్చమైన బోయపాటి సినిమా…
  • తలుపు తట్టిన చప్పుడు… డెయిలీ పేపర్ కింద పడిన చప్పుడు… నేనింకా బతికే ఉన్నాను…
  • అందంలో… అభినయంలో… జ్యోతికకు ఆమడదూరంలోనే ఆగింది కంగనా…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions