.
పెడ వాదనలు, శుష్క బాష్యాలు, డొల్ల సిద్దాంతాలు, ద్వేష సూత్రీకరణలు… ఇక ఆపేస్తాను, అరమేధావి కంచ ఐలయ్య గురించి అందరికీ తెలిసిందే… కాంగ్రెస్ పత్రిక తనను మోస్తూ ఉంది, ఆ మేధస్సు స్థాయి తెలిసి అందరూ దూరం పెట్టేశాక… ఏదో ఓ వెబ్ పత్రిక ఏదో రాసిందట, దాన్ని పట్టుకుని ఇక తన లేని మేధావిత్వాన్ని ప్రదర్శించాడు ఏదో సదస్సులో… తనేమన్నాడో ఆ మాటల సారం ఓసారి చదివి, తరువాత అసలు నిజాలు చెప్పుకుందాం…
(చివరకు ఐలయ్య మాటలకూ కౌంటర్లు అవసరమా అనడక్కండి… ఆ మతిమాలిన ప్రసంగాన్ని గులాబీ క్యాంపు తెగమోస్తూ, భలే దొరికాడు రేవంత్ రెడ్డి అని ఆనందపడిపోతూ, ప్రచారం చేస్తోంది… ఆ క్యాంపుకి చివరకు ఐలయ్య కూడా ఓ ప్రాధాన్య పదార్థం అయిపోయాడు… ప్చ్, అదొక మహా విషాదం…)
Ads

‘‘రేవంత్ రెడ్డి మనవడి పేరు రేయాన్ష్ రుద్రదేవ్ రెడ్డి… వరంగల్ ఎయిర్‌పోర్టులో ఒక టర్మినల్‌కు రేవంత్ రెడ్డి తెగ అభిమానించే తన సామాజికవర్గానికి చెందిన రేచర్ల రుద్రారెడ్డి పేరు పెట్టబోతున్నాడు, అంటే తన మనవడి పేరు, ఇదే జరిగితే తన సీఎం పదవికే కాదు, కాంగ్రెస్‌కు పుట్టగతులుండవ్, దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలి, ఎంతసేపూ అగ్రవర్ణాల పేర్లేనా..?’’
…. ఇంకా ఏమేమో చెప్పుకొచ్చాడు… మొత్తం ఆ ప్రసంగం వింటే తనకు రేచర్ల రుద్రుడి చరిత్ర ఏమీ తెలియదనీ, ఎప్పటిలాగే తన వక్రమేధస్సులో శుష్యబాష్యానికి దిగాడనీ అర్థమవుతోంది… రేచర్ల రుద్రుడిది నీచ చరిత్ర కాదు… రాజ్యం కాజేయడానికి బంగారు అవకావం వచ్చినా విధేయ సైన్యాధ్యక్షుడిగా కాకతీయ రాజులకే కట్టుబడిన కేరక్టర్… తనెవరో చెప్పిన ‘ముచ్చట’ లింక్ ఇదుగో…

అసలు ఈ చర్చ ఆరంభం గాకముందే ‘ముచ్చట’ రేచర్ల రుద్రుడిపై గత ఫిబ్రవరిలో మరో కథనం ప్రచురించింది… ఇదీ ఆ లింక్…
అగ్రవర్ణాల పేర్లేనా అనడుగుతాడు..? ఇదే ఎయిర్‌పోర్టుకు రకరకాల పేర్ల ప్రతిపాదనలు వచ్చాయి… సమ్మక్క పేరు కూడా..! అదెందుకు పెట్టకూడదు? దొడ్డి కొమురయ్య పేరే ఎందుకు..? సర్వాయి పాపన్న పేరెందుకు వద్దు..? అసలు ఒవైసీ చెప్పిన మౌల్వీ సయ్యద్ అలావుద్దీన్ పేరెందుకు వద్దు..? తనదీ గొప్ప చరిత్రే కదా… ప్రజలు రకరకాల పేర్లు ప్రతిపాదించారు… ఎవరి అభీష్టం వాళ్లది…
అసలు రన్‌వ్ టెండర్లే పిలవలేదు, అప్పుడే పేరు ప్రస్తావన దేనికి అంటాడు ఐలయ్య… ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక ఐలయ్య కాదు కాబట్టి… జనాభీష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం కాబట్టి… నిజానికి అసలు మామునూరు ఎయిర్‌పోర్టుకు ఏ పేరూ అధికారికంగా ఖరారే చేయలేదు, ఒకటీరెండు పేర్లను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపినట్టు వార్తలే తప్ప… ఇప్పటికి ఏదీ లేదు… పైగా టర్మినళ్లకు కూడా పేర్లు పెడతారా..? ఏమో, కేంద్రమే చెప్పాలిక…

ఒక ప్రధాన వార్త… ఎయిర్‌పోర్టు ముందు రేచర్ల రుద్రారెడ్డి, రాణి రుద్రమ విగ్రహాలను పెడతారని… అదీ సర్కారు ఆలోచన మాత్రమే… కాకతీయ పాలన, స్త్రీశక్తి అంశాలకు రాణి రుద్రమ ప్రతీక… విలువల రక్షకుడు రేచర్ల రుద్రారెడ్డి విధేయతకు, ధైర్యానికి ప్రతీక… ఈ విగ్రహాల స్థాపనే నిజమైతే రేవంత్ రెడ్డిని అభినందించాలి…
తన మనవడి పేరు కాబట్టి రుద్రుడి పేరు నిషిద్ధమా..? రుద్రుడు రెడ్డి కాబట్టి నిషిద్దమా..? ఇదెక్కడి పిత్త బాష్యం..? (దొడ్డి కొమురయ్యను ఐలయ్య కులానికి చెందిన వ్యక్తిగా మాత్రమే చూడదు తెలంగాణ సమాజం… తను తెలంగాణ చారిత్రక సాయుధ పోరాటంలో తొలి అమరుడిగా కీర్తిస్తుంది, గుర్తుంచుకుంటుంది)… రేవంత్ రెడ్డికి తన పేరెంట్స్ పెట్టుకున్న అసలు పేరు రేయాన్ష్… అంటే సూర్యుడి తొలి కిరణం… రేవంత్ రెడ్డి తనకు ఇష్టమైన రుద్రదేవ్ పేరుతో పిలుచుకుంటాడు… చివరకు దీనికీ వక్ర వ్యాఖ్యానాలేనా..?

రేచర్ల రుద్రుడి చరిత్రను నిజానికి మనం మన పిల్లలకు సరిగ్గా చెప్పలేకపోయాం… కేవలం రామప్ప గుడి నిర్మాతగానే తెలుసు చాలామందికి… కానీ కాకతీయ సామ్రాజ్య విధేయ రక్షకుడు అనే కోణంలో తన చరిత్ర రికార్డు కాలేదు… సో, నిజంగానే వరంగల్ ఎయిర్‌పోర్టుకు ముందు తన విగ్రహం పెడితే… అది సరైన న్యాయం అవుతుంది… అరమెదళ్లను సంతృప్తిపరచాల్సిన అగత్యం అవసరం లేదు..!!
Share this Article