ఈ వార, మాస పత్రికల మూసివేత వెనుక, సాధారణ ప్రజలకు తెలియని చాలా కారణాలున్నాయి. కాబట్టి ప్రతీ ఒక్కరూ జడ్జిమెంట్లు పాస్ చేయకండి. తెలుగు పాఠకులను విమర్శించకండి. ఆ కారణాలు:
ఈ వార, మాస పత్రికల యాజమానులు సాధారణంగా ఒక ప్రముఖ దిన పత్రిక నడిపే వారయి ఉంటారు. ఈ మధ్యన జరిగిన కొన్ని పరిణామాలు:
(1) ప్రజలకు తెలియకుండా అనేక దినపత్రికలలో విదేశీ పెట్టుబడులు వచ్చాయి. వారికి సాహిత్యం మీద ఇంట్రెస్ట్ లేదు.
(2) ఒక ప్రముఖ పత్రికలో హైదరాబాదుకు చెందిన ఒక ప్రముఖ ముస్లిం నాయకుడు బినామీ పెట్టుబడులు పెట్టాడు. అతనికి ఆ దినపత్రిక అనుబంధంగా నడిచే వారపత్రికలో వచ్చే హిందూ పురాణాలు, కథలు, ఆర్టికల్స్ నచ్చక పత్రిక మూయించాడు.
(3) దినపత్రికలకు సబ్సిడీ మీద న్యూస్ ప్రింట్ లభిస్తుంది. ఆ న్యూస్ ప్రింటును కొంత దారి మళ్ళించి వారపత్రికలకు ముడి సరుకుగా, అతి తక్కువ ధరకు దొరకడంతో వాడేవారు.
(4) ఇప్పుడు భారత ప్రభుత్వం న్యూస్ ప్రింట్ దిగుమతి మీద నిషేధం విధించింది. కస్టమ్స్ డ్యూటీ విపరీతంగా పెంచింది. దాంతో దినపత్రికలకే న్యూస్ ప్రింట్ సరిపోవడం లేదు. అందుకే జిల్లా టాబ్లాయిడ్స్ ఆగిపోయాయి. అటువంటప్పుడు వారపత్రికలకు ముడిసరుకు బందయ్యింది.
(5) ఇటువంటి న్యూస్ ప్రింట్ సౌలభ్యం లేదు స్వాతికి… అయినా పత్రికను పబ్లిష్ అవుతోంది. స్వాతి మ్యాగజైన్ ఇప్పటికీ ఆన్లైన్లో లేదు, కేవలం ఒక్కరి పట్టుదల వల్ల అది ఇంకా పుస్తక రూపంలో ఉంది. మంచి వ్యాపార లక్షణాలతో లాభసాటిగా నడుస్తుంది.
(6) వార, మాసపత్రికలకు పత్రికలు అమ్ముడయిన దాని కన్నా, యాడ్స్ ద్వారానే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. స్వాతి విషయంలో కూడా ఇదే నిజం.
(7) కాబట్టి, పాఠకులు పుస్తకాలు కొనకపోవడం వల్ల పత్రికలు మూతపడలేదు. తెలుగు వార, మాస పత్రికలు, దిన పత్రికల సవతి పుత్రికలు కాబట్టి ఆగిపోయాయి. ఆన్లైనులో పత్రిక నడపడానికి లక్ష రూపాయలు కూడా ఖర్చు కావు. ఇంత గొప్ప భాషా సేవకులు లక్ష రూపాయలు కూడా వెచ్చించలేని దీన స్థితిలో ఉన్నారా? ఆన్లైను మ్యాగజైన్లకు కూడా యాడ్ రెవెన్యూ వస్తుంది. అది లక్ష రూపాయలను మించే ఉంటుంది. కాబట్టి, ఆన్లైన్ మ్యాగజైన్లను, భాష గురించి తపించే సేవకులు, ఫ్రీగా కూడా ఇవ్వొచ్చు.
కొన్న పత్రికల మూత వెనుక “సన్ స్ట్రోక్” కూడా ఉందని వినికిడి.
(8) అదే నిజమైతే, మిగిలిన భాషల్లో సాహిత్య పత్రికలెలా నడుస్తున్నాయి అని మీకు అనుమానం రావచ్చు. అవి, కార్పొరేట్ శక్తులు నడుపుతున్న పత్రికలు కావు. యాడ్స్ వేటలో అడ్డమైన చెత్త ప్రచురించే నీచ పత్రికలు కావు. హీరోయిన్ల అర్థనగ్న ముఖచిత్రాలు వేసి అమ్ముకునే వారు కాదు. తెలుగులో నాకు తెలిసిన ఒక వారపత్రిక వార్షికాదాయం, అన్ని ఖర్చులు పోనూ, కోటి రూపాయలు. ఇంత ఆదాయం తమిళ, కన్నడ పత్రికలు ఆశించవు. చిన్న సైజులో, సింపుల్ గా ముద్రించి, సుమారు ఐదారు వేల కాపీలు వేసి నడుపుకొస్తున్నారు. నిజమైన సాహిత్యాభిమానుల కొరకు అవి కృషి చేస్తున్నాయి.
(9) చాలా మందికి అరవై పేజీల పత్రిక ముద్రణకు వేయి కాపీలకు ఎంత ఖర్చవుతుంది, అదే పత్రిక యాభై వేల కాపీలు, సబ్సిడీ మీద దొరికిన న్యూస్ ప్రింటు మీద, స్వంత ప్రెస్సులో ప్రింటయితే ఎంత ఖర్చవుతుందో కూడా తెలియకుండా, పత్రికల యాజమానుల మీద సానుభూతి వర్షాలు కురిపిస్తున్నారు.
(10) ఐదారు రూపాయల వెలతో ఇచ్చే ఆదివారం నాటి దినపత్రికతో పాటు 30 నుండి 32 పేజీలు గల ఆదివారం అనుబంధం ఎలా ఇవ్వగలుగుతున్నారో
ఆలోచించారా? అప్పుడు కూడా పత్రికాధిపతులకే లాభమే. అందుకే, ఆదివారం నాటి సర్క్యులేషన్, ఆయా పత్రికల పాపులారిటీని బట్టి, యాభై వేల నుండి పది లక్షల వరకు పెంచి, ప్రతులను ముద్రిస్తారు. ఎందుకో ఊహించండి?
(11) ఒకానొక సమయంలో హిందూకి, టైమ్స్ ఆఫ్ ఇండియాకు, ఇండియన్ ఎక్స్ప్రెస్సుకు, డక్కన్ క్రానికల్ కు తీవ్రమైన పోటీ ఏర్పడ్డప్పుడు రూపాయికి, యాభై పైసలకి కూడా పత్రిక అమ్మారు. అందులో ముప్పై నలభై పేజీలు ఉండేవి. పత్రిక కొని పాత పేపర్ల వాడికి అమ్ముకుంటే ఎక్కువ లాభం వచ్చేది. అంటే ఎందులో ఎంత లాభం గడిస్తున్నారో విఙ్ఞులైన పాఠకులు గమనించాలి.
(12) ఒక పత్రికలో వంద మంది ఉద్యోగులకు ఇది ఆఖరు నెల. కార్పొరేట్ మనస్తత్వం ఎట్లా ఉంటుందో దీన్ని బట్టే తెలుస్తుంది. తక్కువ లయబిలిటీకే ఎక్కువ ఔట్ పుట్ కావాలి. అదీ వాళ్ళకు బ్యాక్ గ్రౌండులో ఉన్న శక్తుల ప్రయోజనాలు కాపాడేలా ఉండాలి.
కాబట్టి, ఇది తెలుగుల పాఠకుల తప్పు కాదు. ముమ్మాటికీ, ఇది కార్పొరేట్ మాయాజాలం!
ఈ విషయాలన్నీ – పత్రికలు ఒకదాని వెనుక కనుమరుగవ్వడాన్ని తట్టుకోలేక – బాధపడుతున్న సగటు పాఠకుడిగా, రచయితగా, పరిశోధించడంలో బయటపడ్డ నిజాలు. పత్రికల యాజమాన్యం రాజకీయ పార్టీ అధినేతల చేతుల్లోకి పోయిన తర్వాత పట్టిన దుర్గతి…. By డాక్టర్ ప్రభాకర్ జైనీ… {Excerpts from my upcoming novel}
Share this Article