పొద్దున్నే ఓ దిక్కుమాలిన వార్త చదవబడితిని… నిజానికి ఇతర తెలుగు పత్రికల్లో వచ్చే రాజకీయ వార్తలతో పోలిస్తే ఆంధ్రజ్యోతి కథనాలు మంచి దమ్ బిర్యానీ టైపులో ఉండునని ప్రతీతి… (తెలుగు రాజకీయ వార్తలు మినహా.., ఎందుకనగా, అవి పసుపు రంగులో చిక్కగా అదోమాదిరి వాసన వేస్తుండును)… కానీ ఈ ఉత్తరప్రదేశ్ కథనమొకటి చదివాక ఆంధ్రజ్యోతి మీద అపారముగా జాలికలిగెను… అసలు రాధాకృష్ణుడు తన పత్రికలో, తన టీవీలో, తన సైటులో ఏం వార్తలు వస్తున్నాయో వెనుతిరిగి చూసుకుంటున్నాడా లేడా అనే సందేహం కూడా బలపడెను… అసలే ఆఫీసుకు రావడం లేదట, ఏవో పిచ్చి వర్మ ఇంటర్వ్యూలు, ప్రతి ఆదివారం ఓ కొత్తపలుకు రాసుకుని, లేదా రాయించుకుని ఇక పత్రికను, టీవీని పట్టించుకోవడం లేనట్టుంది…
పోనీ, పాపం, ఆయన చాలా బిజీ అనుకుందాం… కానీ సెకండ్ లేయర్‌లో ఎవరైనా బాధ్యులు ఉండాలి కదా… ఆ వ్యవస్థ కూడా లేనట్టుంది సరిగ్గా… అసలు ఆ వార్త ఏమిటంటే… ఇదీ ఆ లింకు… https://www.andhrajyothy.com/telugunews/one-up-cm-contested-from-gorakhpur-and-lost-now-yogi-takes-challenge-mrgs-national-1922012008134622?fbclid=IwAR2PpovKE7ALL6B5s3tyjQ1TJDzPIxvWgYM_QreFihEB5NXFRoXOj_xD0Pw
సంక్షిప్తంగా చెప్పాలా..? ‘‘ఉత్తరప్రదేశ్‌లో పూర్తికాలం పనిచేసినవారు 2007కు ముందు ఎవరూ లేరు.., యూపీలో ఎన్నికల్లో పోటీచేసిన గెలిచిన సీఎంలు ఉండరు.., పార్టీల ముఖ్యులు సీఎం చాన్స్ వస్తే చేసేవాళ్లు, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేవాళ్లు కాదు… ఇప్పుడేమో అఖిలేష్ పోటీచేస్తున్నాడు… యోగి ఆదిత్యనాథ్ పోటీచేస్తున్నాడు… కానీ మాయావతి పోటీచేయడం లేదు… ఇప్పుడు యోగి పోటీచేస్తున్న గోరఖ్‌పూర్ స్థానానికి ఓ విశేషం ఉంది… అప్పట్లో ఒకాయన ఇక్కడ పోటీచేసి సీఎం పదవి పోగొట్టుకున్నాడు… గోరఖ్‌పూర్ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఎవరూ రాలేదు… 1971 నాటి ఆ సీన్ రిపీట్ అయితే యోగి ఇంటిబాట పట్టాల్సిందే…’’ హమ్మయ్య… ఇదండీ ఆ వార్త సారాంశం…
- వార్తల్లో చెప్పినట్టు గోరఖ్‌పూర్ బీజేపీకి పట్టున్న ప్రాంతం కాదు… అది యోగి ఆదిత్యనాథ్ పీఠాధిపతిగా ఉన్న గోరఖ్‌నాథ్ ఆశ్రమం పట్టున్న ప్రాంతం… యోగికి హిందూ యువవాహిని పట్టున్న ప్రాంతం… చాలాసార్లు దానికి బీజేపీకి పొసిగేది కాదు… బీజేపీకి వ్యతిరేకంగా 2002లో యోగి హిందూమహాసభ పేరిట అభ్యర్థిని నిలిపి ఓ కేబినెట్ మంత్రిని ఓడించాడు… తను స్వయంగా 1998 నుంచి అక్కడి ఎంపీగా గెలుస్తూనే ఉన్నాడు…
- యోగి ఇప్పుడు పోటీచేసే గోరఖ్‌పూర్‌లో 1989 నుంచీ ఆ ఆశ్రమం ఎవరి వైపుంటే వాళ్లదే విజయం… అలాంటిది ఇప్పుడు ఆ ఆశ్రమ పీఠాధిపతి యోగియే స్వయంగా పోటీచేస్తున్నాడు…
- 1971 నాటి సిట్యుయేషన్ వేరు… ఏదో ఒక సభ నుంచి ఎన్నికై ఉండాలి కాబట్టి, సీఎం త్రిభువన్ ఈ సీటును యోగి గురువు అవైద్యనాథ్ నుంచి ఖాళీ చేయించి, నిలబడ్డాడు… ఓడిపోయాడు… దానివల్ల సీఎంగా దిగిపోవాల్సి వచ్చింది… నిజానికి సీఎం కుర్చీలో ఉన్నవాళ్లు మండలికి ఎన్నికై, ఈ పరిస్థితి ఎదురుగాకుండా జాగ్రత్తపడతారు… త్రిభువన్‌కు ఆ పొలిటికల్ సోయి లేదు… (ఇక్కడ అవైద్యనాథ్ వరుసగా అయిదుసార్లు గెలిచాడు… అంటే త్రిభువన్ ఓడిపోయాడు అంటే తెర వెనుక కత్తెర పాలిటిక్స్ పనిచేశాయి అని అర్థం…)
- అక్కడి నుంచి గతంలో ఏ సీఎం పోటీచేయలేదు కాబట్టి… పోటీచేసిన ఒక్కడూ ఓడిపోయాడు కాబట్టి… అసలు సీఎంలు అసెంబ్లీకి పోటీచేయడమే యూపీ పాలిటిక్సులో ఉండదు కాబట్టి… ఇప్పుడు పోటీచేసే యోగికి ఇది యాంటీ సెంటిమెంట్ అన్నట్టుగా రాయడం పెద్ద అబ్సర్డిటీ… (యోగికి ఓటమి తప్పదు అనే భావన వచ్చేలా రాయబడిన, వండబడిన వంటకం అది… ఎవడో ఇంగ్లిష్ పత్రికలో రాసి ఉంటాడు… దాన్ని ఎత్తుకొచ్చి, తెలుగులోకి దింపేసి, కొట్టేసి ఉంటుంది ఆంధ్రజ్యోతి…
- సరే, యోగి ఓడిపోతాడు అనుకుందాం… రాజకీయాల్లో ఒక నాయకుడు ఓడిపోకూడదు అని ఏమీ ఉండదు కదా… యోగికి బీజేపీలోనే శత్రువులెక్కువ… ఢిల్లీ పెద్ద కుర్చీలు కూడా యోగిని సహించవు… యోగి టెంపర్‌మెంట్ వేరు… మొన్నటికిమొన్న తనను దింపేయాలని అనుకుని, భంగపడ్డారు కూడా…! అలాంటప్పుడు ఈయన ఈసారి ఓడిపోతాడు అనే అనుకుందాం… సో వాట్..? తను సీఎం కావాలీ అనుకుంటే మళ్లీ మండలి లేదా..? ఇప్పుడు తను మండలి సభ్యుడిగానే సీఎంగా ఉన్నాడు..!!
Share this Article
Ads