Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇదేమి కురచ బుద్ధి బిగ్‌బాస్..? మరీ ఇంత దిగజారుడు ప్రచారమా..?

September 14, 2023 by M S R

అట్టర్ ఫ్లాపయిన సినిమాకు అడ్డగోలు కలెక్షన్ల లెక్కలతో ప్రచారం చేసుకున్నట్టుంది… బిగ్‌బాస్ టీం కురచ బుద్ధి చివరకు నాగార్జున ఇజ్జత్ కూడా తీసేస్తున్నట్టుగా ఉంది… విషయం ఏమిటంటే…?

పొద్దున్నే బార్క్ తాజా రేటింగ్స్ వచ్చాయి… ఓసారి పైపైన పరిశీలిస్తుంటే బిగ్‌బాస్ లాంచింగ్ టీఆర్పీలు కనిపించినయ్… ఎనిమిది చిల్లర ఉంది… పర్లేదు, ఈరోజుల్లో ఇంకా బిగ్‌బాస్‌కు ఈమాత్రం రేటింగ్స్ బాగానే వచ్చాయి కదా, అఫ్‌కోర్స్ లాంచింగ్ షో కాబట్టి కాస్త పర్లేదేమో… వీక్ డేస్‌లో ఎలాగూ వీక్ పర్‌ఫామెన్సే కదా అనుకున్నాను…

కానీ బిగ్‌బాస్ టీం ప్రచారం చేసుకుంటున్న ఓ యాడ్ చూస్తే ఆశ్చర్యంతోపాటు ఏవగింపు కూడా కలిగింది… మరీ ఇంత దిగజారుడుతనం దేనికి అనిపించింది… ఈ తెలివి క్రియేటివ్ టాస్కుల మీద చూపిస్తే ఎప్పుడో గాడి తప్పిన బిగ్‌బాస్ మళ్లీ పట్టాలెక్కుతుంది కదా అనే భావన స్ఫురించింది… ఇదంతా కలిసి తన పరువు తీస్తున్నదనే సోయి నాగార్జునకు కూడా లేకుండా పోయింది…

Ads

bb7

ఏదో వాళ్లు డబ్బులిస్తున్నారు, నేను హోస్ట్ చేస్తున్నాను అనే తప్ప మరే ధ్యాస లేనట్టుంది నాగార్జునకు కూడా… అసలే గత సీజన్ డిజాస్టర్… ఈసారి ఏదో ఉల్టా అన్నారు, పుల్టా అన్నారు… తీరా చూస్తే అంత సీన్ లేదు… అసలు కంటెస్టెంట్ల ఎంపికే దారుణంగా ఉంది… ఉన్న 14 మందిలో రతిక, శోభ, ప్రియాంక మినహా మిగతావాళ్లెవరూ అంత సీనున్నవాళ్లు లేరు… ఇక శివాజీ, ప్రశాంత్ ఓవరాక్షన్ మొత్తం సీజన్‌కే ఎసరు పెట్టేలా ఉంది…

మరి ఈ దిక్కుమాలిన ప్రచారం దేనికి..? నిజంగా 18.1 రేటింగ్ వచ్చిందా..? సూపర్ డూపర్ బంపర్ హిట్ సినిమాకు కూడా అంత టీఆర్పీ రావడం లేదు కదా… 10 లోపు రేటింగ్స్ వస్తేనే గొప్పగా చెప్పుకునే రోజుల్లో ఏకంగా 18 దాటిందని చెప్పుకోవడం నిజమేనా..? ఒకసారి హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ ఒరిజినల్ టాప్ 30 జాబితాను పెడతాను చూడండి…

బార్క్

చూశారు కదా… టాప్ 30లో ఎక్కడో 24వ ప్లేసులో ఉంది బిగ్‌బాస్… అదీ జస్ట్, 8.46 రేటింగ్స్… సరే, మొత్తం రేటింగ్స్ (ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ కలిపి) ఏమిటబ్బా అని ఆరా తీస్తే… 15 అని తెలిసింది… అఫ్ కోర్స్ అదీ ఎక్కువే… అదీ డౌట్ ఫుల్లే… (మరోసారి క్రాస్ చెక్ అవసరం…) మరి ఈ 18.1 ఎక్కడి నుంచి వచ్చినట్టు..? 5.1 కోట్ల వ్యూస్ నిజమేనా..? ఆ యాడ్‌లోనే చిన్న డిస్‌క్లయిమర్ కనిపించనంత సూక్ష్మంగా వేశారు… MF 15-50 ABC అని రాసి ఉంది గమనించండి… ఇలాంటి తలతిక్క యాడ్స్ మల్టీ నేషనల్ ప్రొడక్ట్స్ యాడ్స్ లో కనిపిస్తుంటాయి సాధారణంగా…

ఈ కేటగిరీ ఏమిటంటే… 15 నుంచి 50 వయస్సున్న కేటగిరీలో ఏదో ఓ ప్రాంతంలో నమోదైన టీఆర్పీలు కావచ్చు బహుశా… ఐనా ఓవరాల్ రేటింగ్స్ చెప్పుకుంటే సరిపోతుంది కదా, ఈ చిత్తపైత్యం దేనికి..? పైగా దీనికి Terrific అన్నట్టుగా కలరిస్తూ, కవరింగ్ ఇస్తూ TVRific అట… ఓసారి ఇది ప్రొనౌన్స్ చేసి చూడండి… చిత్రంగా ఉందా..? అవును సేమ్ ఈ యాడ్‌లాగే…! అన్నట్టు వీక్ డేస్‌లో 7.1 రేటింగ్స్ అట (SD+HD) … ఇప్పుడు అదీ నమ్మశక్యం కావడం లేదు…!! ప్చ్, ఈ వికారం షో కొత్తగా నడిపించడంలో చూపిస్తే ఎంత బాగుండు..! మరీ షోలో శివాజీ ఓవరాక్షన్‌లాగా… బిగ్‌బాస్ టీం కూడా తను ప్రభావానికి గురైందా ఏంటి..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏడీ..? ఏమైపోయాడు నేను ప్రేమించిన ఆ నా మణిరత్నం..?!
  • భారీ డిజాస్టర్ దిశగా థగ్ లైఫ్… హిందీవాడు అడ్డంగా ఛీకొట్టేశాడు…
  • అమెరికా అధ్యక్షుడు… ఆ టేబుల్‌కు ఆ రెండు ఇంపార్టెంట్ బటన్లు…
  • తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం కాక..! అసలు దోషి ఎవరు..?!
  • మహేష్ బాబును త్వరగా పంపించేయండి, నిద్రకు ఆగలేడు… కెవ్వు కేక..!!
  • మిలమిల మెరిసిన తార… వెన్నెల పైటేసిన కిన్నెరసాని…
  • అల్లరి నవ్వుల అల్లు రామలింగయ్య … మనెవ్వరికీ తెలియని ఓ ఫ్లాష్ బ్యాక్ …
  • సో, ప్లీజ్… దయచేసి ఎవరూ ఆ ఇద్దరికి మాత్రం ఈ స్టోరీ చూపించొద్దు…
  • పార్లె జీ బిస్కట్స్… ఈసారి విషాద వార్తల్లోకి… అంతర్జాతీయ ఖ్యాతితో…
  • అమరావతిపై ద్వేషం, విషం… మరీ ఈ డర్టీ ముద్రలతోనా..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions