.
ఓ ఉగ్రవాద ధూర్తదేశం పొరుగు దేశంపై అనేక ఉగ్రదాడుల్ని చేసింది… ఏళ్లుగా చేస్తూనే ఉంది… ఏకంగా సార్వభౌమాధికార ప్రతీక పార్లమెంటు మీదే దాడి చేసింది… అవన్నీ చెబితే, ఓ స్పై థ్రిల్లర్ కథ వెండి తెర మీద వస్తే ఎందుకు ఈ దేశంలోని కొన్ని శక్తులు లబలబ మొత్తుకుంటున్నాయి..?
అవును, దురంధర్ సినిమా గురించే చెబుతున్నా… ది ప్రింట్ వంటి సైట్లలో ఓ నెగెటివ్ వార్తో, విశ్లేషణో వచ్చిందంటే… సంబంధిత అంశం ఖచ్చితంగా జాతికి మేలు చేసేదే అయి ఉంటుంది కదా… మొన్న ఓ నెగెటివ్ పోస్టు పెట్టాడు, 600 లైకులు… కానీ ఎవరికో ఎక్కడో కాలి, నీ గు- కు వచ్చిన నొప్పేమిటి అనే అర్థంలో కామెంట్ పెడితే దానికి 3 వేలకుపైగా లైకులు…
Ads
సేమ్, దురంధర్ సినిమా మీద వచ్చే విమర్శలకు నెటిజనం సీరియస్‌గా, నెగెటివ్‌గా స్పందిస్తున్నారు… అవునూ, ఆ సినిమా మీద మన దేశంలోనే ఈ విమర్శలు దేనికి..? పరోక్షంగా పాకిస్థాన్ ఉగ్రదాడులు పర్లేదులే అని చెబుతున్నారా..? యాంటీ పాకిస్థాన్, యాంటీ టెర్రరిస్ట్ సినిమాలకు కూడా కాషాయ రంగు పులుముతున్నారా..?
పైగా వీళ్లే సినిమాను సినిమాలాగా చూడాలి అని నీతులు చెబుతారు… సరే, ఆరు గల్ఫ్ దేశాలు (బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యు.ఎ.ఇ) నిషేధించాయంటే వాళ్లకు ‘పాకిస్థాన్‌తో దోస్తీ‘ అనే ఓ కారణమైనా ఉంది… అవి ఇంతకుముందు ‘ఫైటర్’, ‘ఆర్టికల్ 370’, ‘టైగర్ 3’, ‘ది కశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాలనూ బ్యాన్ చేశాయి…
రాజకీయంగా సున్నితమైన కథాంశాలు కాబట్టి అవి నిషేధించాయి అనుకుందాం… ఎప్పుడైతే యాంటీ బీజేపీ ఫోర్సెస్ దీనికీ రాజకీయ రంగు పులిమి… ఇదీ కాషాయం సినిమాయే అని ముద్రలు వేయడం మొదలుపెట్టారో సినిమాకు ఆ క్యాంపెయిన్ పనికొచ్చింది… వసూళ్లు అమాంతం పెరిగిపోయాయి… అది ఏకంగా వారం రోజుల్లో 350 కోట్లను దాటేసింది…
ఆదిత్య ధర్ గతంలో దర్శకత్వం వహించిన ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ (Uri: The Surgical Strike), ‘ఆర్టికల్ 370’ (Article 370) వంటి సినిమాలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయవాద భావజాలాన్ని (Nationalistic Ideology) ప్రతిబింబిస్తాయని యాంటీ బీజేపీ సెక్షన్ గగ్గోలు పెట్టింది… ఇప్పుడు దురంధర్ పై కూడా…
ఉగ్రచర్యల తాలూకు నిజాలు చెబితే వాడెవడికో నచ్చలేదు సరే, ఈ దేశంలోనే యాంటీ టెర్రర్ సినిమాల మీద మొత్తుకోళ్లు, పెడబొబ్బలు దేనికి..? పోనీ, సినిమాలో ఏమైనా జరగని విషయాలు, సంఘటనలు చెప్పారా..? అన్నీ జరిగిన దాడుల సీన్లే…
నిజానికి గల్ఫ్ దేశాలు (ముఖ్యంగా UAE, సౌదీ అరేబియా, ఖతార్) భారతీయ సినిమాకు అతిపెద్ద ఓవర్సీస్ మార్కెట్‌లలో ఒకటి… అక్కడ ఇండియన్ వర్కర్లు ఎక్కువ… పైగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి ఇండియన్ సినిమాను ప్రేమించే వర్కర్లు కూడా ఉన్నారు… ఎటొచ్చీ కాస్త జాతీయవాదం కనిపిస్తే చాలు ఉలిక్కిపాట్లు…
ఇది కేవలం హిందీ వెర్షనే... ఎలాగూ Ranveer Singh , Sanjay Dutt, Akshaye Khanna, R. Madhavan, Arjun Rampal, Sara Arjun వంటి భారీ తారాగణం ఉంది కదా, సినిమా హిట్ కదా... పాన్ ఇండియా తరహాలో సౌత్ భాషల్లోకి కూడా డబ్ చేసి అందించొచ్చు కదా... ఓటీటీలకే కాదు, థియేటర్లకు కూడా..!!
Share this Article