Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సత్వర న్యాయం Vs చట్టప్రకారం న్యాయం… ఇదెప్పుడూ తెమిలే ప్రశ్న కాదు…

March 22, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ….. హమ్మయ్య ! అలనాటి అందాల భామలందరూ పోలీస్ ఆఫీసర్లుగా నటించేసారు . మిగిలింది మరో అందాల తార బి సరోజాదేవే . ఆమె కూడా 1990 లో వచ్చిన ఈ యమధర్మరాజు సినిమాలో DIG గా నటించేసింది . బహుశా బి సరోజాదేవి మాత్రమే ఈ సినిమాకు ముందు కృష్ణంరాజు పక్కన హీరోయిన్ గా నటించలేదు అనుకుంటా . అందుకే కృష్ణంరాజు తల్లిగా సరోజాదేవి నటించింది ఈ సినిమాలో .

ఏది ఏమయినా బి సరోజాదేవి , లక్ష్మి , జయప్రద , శ్రీదేవి , జయసుధ వంటి అందాల తారల్ని పోలీస్ ఆఫీసర్లుగా చూడటం కష్టమే వాళ్ళ అభిమానులకు . ముఖ్యంగా వాళ్ళ సౌందర్యాభిమానులకు .
కృష్ణంరాజు స్వంత బేనర్ సినిమా ఇది . హీరో ప్రభాస్ తల్లి శివకుమారి ఈ సినిమాకు నిర్మాత . మరో విశేషం ఏమిటంటే హాస్య సినిమాల స్కూల్ నుండి వచ్చిన రేలంగి నరసింహారావు ఈ ఏక్షన్ సినిమాకు దర్శకత్వం వహించటం . ఓంకార్ నేసిన ఈ కధకు రేలంగి నరసింహారావు స్క్రీన్ ప్లేని కృష్ణంరాజు రెబెల్ స్టార్డంకు అనుకూలంగా మలుచుకున్నారు .

Ads

తారాగణం కూడా భారీగానే ఉంది . ఇద్దరు అన్నదమ్ములుగా కృష్ణంరాజు ద్విపాత్రాభినయం చేసారు . వారికి జోడీగా రాధ , సుహాసిని , తల్లిదండ్రులుగా సరోజాదేవి , జగ్గయ్య నటించారు . విలన్లుగా సత్యనారాయణ , మోహన్ బాబు , త్యాగరాజు , కోట శ్రీనివాసరావు , అల్లు రామలింగయ్య నటించారు . అందరూ హేమాహేమీలే కావటంతో అందరి నటనా బాగా ఉంటుంది .

రాజ్- కోటి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . మూడు డ్యూయెట్లనీ రేలంగి నరసింహారావు అందంగా చిత్రీకరించారు . గడబిడ గడబిడ , ముద్దుకు హద్దులు లేవే , అమ్మాడి పండు గుమ్మడి పండు అంటూ సాగే మూడు డ్యూయెట్లు కృష్ణంరాజు , రాధ మీద రొమాంటిగ్గా ఉంటాయి .

ముద్దుకు హద్దులు లేవే పాట చిత్రీకరణ బాగుంటుంది . లిరిక్సుని భువనచంద్ర బాగా వ్రాసారు . మిగతా పాటల్ని వేటూరి వ్రాసారు . కొండంత దేవుడివి కోటకే సూర్యుడివి అనే పాట చాలా బాగుంటుంది . కృష్ణంరాజు కర్ణుడు , విశ్వామిత్రుడు , అల్లూరి సీతారామరాజు గెటప్పుల్లో బాగా కనిపిస్తారు .

బేక్ గ్రౌండులో వచ్చే పాట కూడా శ్రావ్యంగా ఉంటుంది . బాలసుబ్రమణ్యం , జేసుదాస్ (టైటిల్సులో జేసుదాస్ అనే వ్రాసారు) , సుశీలమ్మ , శైలజ పాడారు . కృష్ణంరాజు , రాధ డాన్సుల్ని శీను , తార , రఘులు బాగా కంపోజ్ చేసారు .

ఓంకార్ డైలాగులు బాగానే ఉన్నా అక్కడక్కడా ముఖ్యంగా తీవ్రవాది కృష్ణంరాజు పాత్రకు డైలాగులు కాస్త మొనాటనస్ గా అనిపిస్తాయి . ఆయన స్వంత సినిమా కదా ! ఇతర పాత్రల్లో డబ్బింగ్ జానకి , ప్రియాంక  తదితరులు నటించారు .

న్యాయవ్యవస్థ , చట్టవ్యవస్థల వైఫల్యాల వలన సత్వర న్యాయం కొరకు తీవ్రవాదులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సినిమా ప్రధాన కధాంశం . ఈ సత్వర న్యాయం vs చట్టప్రకారం న్యాయం చర్చ తెమిలేది కాదు . సినిమా కాబట్టి డబ్బులు తిరిగి రావాలి కాబట్టి ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఊహించి సినిమాను నడిపిస్తారు .

క్లైమాక్సులో దుష్టులను అందరినీ తీవ్రవాది కృష్ణంరాజు చంపేస్తాడు . ఆ క్రమంలో పోలీసులు అతన్ని చంపేస్తారు . ఆయన ప్రేయసి సుహాసిని ఆయన గొడ్డలి తీసుకుని ఆయన దుష్టశిక్షణ అమాయకరక్షణను కొనసాగిస్తానికి అడవుల్లోకి వెళ్ళిపోవడంతో సినిమా ముగుస్తుంది .

సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . కృష్ణంరాజు అభిమానులకు , అలనాటి అందాల నటి బి సరోజాదేవి (నాలాంటి) వృధ్ధాభిమానులకు , రాధ అభిమానులకు బాగానే నచ్చుతుంది …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎహె పో… నేను అసలే ఆడను… అదసలు బౌలింగే కాదు…
  • అసలు ప్రమాదం సీమైన్స్..! మీ చావు మీరు చావండి అంటున్నయ్..!!
  • అందరూ శుద్ధపూసలే..! రోత, బూతు వ్యాప్తిలో అందరూ ప్రసిద్ధులే..!!
  • క్రిస్టినా కోచ్… మంచు ధ్రువాలు, విశ్వాంతరాలే ఆమెకు ఇష్టమైన సవాళ్లు…
  • వివాదాస్పద సింగర్ మంగ్లిపై అక్రమ వసూళ్ల కేసు నమోదు..!!
  • అల్గా‘రిథమ్’ కాదు, స్కోర్ల ఈక్వేషన్ కాదు… లైఫ్ అంటేనే ఎమోషన్..!!
  • బీఆర్ఎస్‌లో హరీష్‌రావు ఒంటరి అయిపోతున్నాడా..? ఏమవుతోంది..?
  • మావిగన్ ప్రతిపాదన కాదు, సూచన కాదు, వెటకారం కాదు… అదొక హెచ్చరిక…
  • చర్చల దారి చర్చలదే… మరో అమెరికన్ నిఘా డ్రోన్ కూల్చివేత…
  • మీడియా రాజ్యాధికారాన్ని శాసించదు… శాసించగలమనే భ్రమల్లో ఉంటుంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions