అబ్బే, ఒక్క తమన్ మాత్రమే అనుకున్నారా..? నో, నో… అందరూ అలాగే తయారయ్యారు… కొత్త ట్యూన్లు కట్టే క్రియేటివిటీ లేదు, పోయింది, కొత్తవాళ్లను రానివ్వరు… ఏదో పాత సినిమాల్లో పాటల్నో, విదేశీ పాటల్లోని ట్యూన్లలో కాపీ కొట్టేయడం, దానికి తెలుగు పదాల వాసనను తగిలించి జనం మీదకు వదిలేయడం… మణిశర్మ కూడా మనఖర్మ అనిపించుకోవడం తాజా విషాదం… ఏమో, అంతకుముందు ఏమేమున్నాయో తెలియదు గానీ తాజాగా ఏకంగా చిరంజీవి పాటకే ఓ పాత హిందీ పాట ట్యూన్ కొట్టేశాడు… సోషల్ మీడియా పట్టేసుకుంది వెంటనే…
ముందుగా ఇది చూడండి… ఇదీ జిలేలే జిలేలే పాట యూట్యూబ్ లింక్… అప్పుడెప్పుడో… 1985 నాటి సినిమా… టార్జాన్ దాని పేరు… బప్పీలహరి మ్యూజిక్ కొట్టాడు… తనే అలీషా చినాయ్ గొంతుకు శృతికలిపాడు కూడా… అప్పట్లో సూపర్ హిట్ పాట… 2009లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే, ఆ పాటకే కోటీ76 లక్షల వ్యూస్ ఉన్నయ్, ఆ ట్యూన్ దమ్ము అదీ… ఇక సినిమాలో కిమీకాట్కర్ హొయలు, ఎక్స్‌పోజింగు ఎట్సెట్రా ఇక్కడ అప్రస్తుతం… ఆ ట్యూన్ గుర్తుంది కదా… ఇక ఇదొకసారి వినండి… ఆచార్య సినిమాలో ఈ కొత్త పాట లింక్ ఇది … పోనీ, ఈ వీడియో ఓసారి చూడండి… అదే ట్యూన్… ఊర్మిల మతోంద్కర్ డాన్స్… యాయిరే యాయిరే అంటూ అదీ ఐటం వంటి సాంగే…
Ads
పోలా, అదిరిపోలా… మొదట్లో మణిశర్మ బయటపడిపోలా… రేవంత్, గీతామాధురి పాడారు పాటను… జిలేలే జిలేలే ఉచ్ఛరణ స్టయిల్‌లోనే కల్లోలం కల్లోలం అంటూ పాట పల్లవి మొదలవుతుంది… సానా కష్టం అని రెజీనా కసాండ్రా కసికసిగా నర్తిస్తుంటే, చిరంజీవి ఓపిక చేసుకుని తన పాత స్టయిలిష్ స్టెప్పులతో ఆ మాస్ సాంగ్‌కు జతకలిపాడు… నిజానికి ఆ ట్యూన్‌కు తగిన క్యాచీ పదాలు పడలేదు… పైగా తనను ఎక్కడెక్కడో నిమరొచ్చని కుర్రాళ్లంతా ఆరెంపీలవుతున్నారు అనే వ్యక్తీకరణ మరీ టేస్ట్ లెస్… మిగతా పాట గురించి చెప్పుకోనక్కర్లేదు… ఐనా ఐటమ్ మాస్ సాంగులంటే ఏమీ చూసుకోనక్కర్లేదుగా… ఊపాలి, ఎగరాలి… పాట కంటెంట్ ఎవడికి కావాలి..? కనిపించే ‘సరుకు క్వాలిటీ’ తప్ప..! అంతటి సమంతే ఊ అంటావా, ఊఊ అంటావా అంటూ జానెడు, బెత్తెడు బట్టపీలికలతో ఎగురుతూ ఉంటే, ఫాఫం, రెజీనాకు ఏమొచ్చింది..? తనూ కష్టపడింది…!!
Share this Article