Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవి ‘పులి’ట్జర్ అవార్డులు కావు… ‘నక్క’ట్జర్ అవార్డులు… లైట్ తీసుకొండి…

May 11, 2022 by M S R

ఒకప్పుడు పులిట్జర్ అవార్డు అంటే విశేష గుర్తింపు… ప్రాచుర్యం… ఆనందం… జర్నలిస్టు సర్కిళ్లలో పులిట్జర్ అవార్డు అంటే నోబెల్ ప్రయిజ్… ఓ ఆస్కార్ అవార్డు… అంతటి ఘనతను సొంతం చేసుకున్న ఆ అవార్డుల అసలు రూపమేమిటనే చర్చ కొత్తగా మొదలైంది… అవార్డుల ప్రకటన వెనుక చాలా రాగద్వేషాలు పనిచేస్తున్నాయా..? అవార్డులకు అందుకే మకిలి పడుతోందా..? చెప్పుకోవాలి… చెప్పుకోకపోతేనే తప్పు…

ఒక్కసారి 2022 అవార్డులకు సంబంధించి, ఆ పులిట్జర్ వెబ్‌సైటులోకి వెళ్లి చూడండి… అనేక కేటగిరీల్లో అవార్డులు ఉంటాయి… ప్రతి అవార్డు ప్రకటన వెనుక ఏదో ‘ఉద్దేశం’ కనిపిస్తూ ఉంటుంది… అర్థమవుతూ ఉంటుంది… అసలు ఏ కేటగిరీలో ఎవరికి అవార్డులు ప్రకటించారో ఓసారి నిశితంగా పరిశీలించండి…



పబ్లిక్ సర్వీస్… వాషింగ్టన్ పోస్ట్, అమెరికన్ మీడియా

Ads

బ్రేకింగ్ న్యూస్ రిపోర్టింగ్… మియామీ హెరాల్డ్, అమెరికన్ డెయిలీ

ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్… థంపాబే టైమ్స్, అమెరికన్ డెయిలీ

ఎక్స్‌ప్లనేటరీ రిపోర్టింగ్… క్వాంటా మ్యాగజైన్, న్యూయార్క్, అమెరికా

లోకల్ రిపోర్టింగ్… చికాగో ట్రిబ్యూన్, అమెరికా

నేషనల్ రిపోర్టింగ్… న్యూయార్క్ టైమ్స్, అమెరికా

ఇంటర్నేషనల్ రిపోర్టింగ్… న్యూయార్క్ టైమ్స్, అమెరికా

ఫీచర్ రైటింగ్… ది అట్లాంటిక్ మ్యాగజైన్, అమెరికా

కామెంటరీ… ది కాన్సస్ సిటీ స్టార్, అమెరికా

క్రిటిసిజం… న్యూయార్క్ టైమ్స్, అమెరికా

ఎడిటోరియల్ రైటింగ్… ది హూస్టన్ క్రానికల్, అమెరికా

ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్… న్యూయార్క్ టైమ్స్, అమెరికా

బ్రేకింగ్ న్యూస్ ఫోటోగ్రఫీ… లాస్ ఏజెంల్స్ టైమ్స్, అమెరికా

ఆడియో రిపోర్టింగ్… ఫ్యూచరో మీడియా, న్యూయార్క్, అమెరికా



……. ప్రపంచవ్యాప్తంగా కేవలం అమెరికా మీడియా మాత్రమే అంత ఘనంగా, గొప్పగా, విశేషంగా, సమున్నతంగా పనిచేస్తోందా..? ఇన్ని దేశాల్లో ఇన్ని వేల పత్రికలు, జర్నలిస్టులు, రోజూ లక్షల వార్తలు… ఒక్కటీ పులిట్జర్‌కు నోచుకోలేదు… నిజానికి అమెరికన్ మీడియా అంతటి దిక్కుమాలిన మీడియా ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు… ఫుల్లీ బయాస్డ్… అమెరికాకు పడని దేశాలపై కాలకూటాన్ని చిమ్మగలవు… ఎవరైనా నచ్చకపోతే భీకరంగా నెగెటివ్ క్యాంపెయిన్ చేయగలవు… వీటిలో ఇల్లస్ట్రేటెడ్ రిపోర్టింగ్ అండ్ కామెంటరీ విభాగంలో అవార్డు ఎందుకు వచ్చిందో తెలుసా..? వీగర్ ముస్లింలపై చైనా అణిచివేతను రిపోర్ట్ చేసినందుకు… చైనా అంటేనే అమెరికాకు, ఆ మీడియాకు ఎంతటి కంపరమో తెలిసిందే కదా…

ఇక ఫీచర్స్ ఫోటోగ్రఫీ విభాగానికి వద్దాం… నలుగురు భారతీయ ఫోటోగ్రాఫర్లకు అవార్డులు ప్రకటించారు… సంతోషమే… అన్నీ కరోనా మరణాలు, ఆ విషాద సంబంధ ఫోటోలే… (ఒకటీ అరా మినహాయించి)… నిజం చెప్పాలంటే నిష్ఠురమే… వీళ్ల ఫోటోల్లో అంతగా అప్‌‌టుది మార్క్ ఫోటోలేమీ లేవు… పులిట్జర్ అవార్డు కాదు, పోటీకే అనర్హమైనవి కూడా… పులిట్జర్ వాళ్లు తమ సైటులో పబ్లిష్ చేశారు, పరిశీలించండి… వాటిని చూస్తే విస్మయం కలుగుతోంది… ఎందుకంటే..?

covid

  1. అవన్నీ ఇండియా కరోనా మరణాల్ని ఓ బ్యాడ్ లైట్‌లో ఫోకస్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి… (WHO వాడు ఇండియాలో మరణాల సంఖ్యపై దుర్బుద్ధితో చేసిన వ్యాఖ్యలు గుర్తొచ్చాయి… అసలు ఆ సంస్థే చైనా చెప్పుచేతల్లో నడుస్తోందిగా…)
  2. కరోనా మరణాలు, కన్నీళ్లు, బాధలు కేవలం ఇండియాలోనే సంభవించాయా..? వేరే దేశాలు అద్భుతంగా కరోనా మీద పోరాడాయా..?
  3. పలు దేశాల్లో కుప్పలుతెప్పలుగా పీనుగలు అంత్యక్రియలకు, క్యూలలో నిరీక్షించడం నుంచి సామూహిక ఖననాల దాకా గుండెల్ని పిండేసే లక్షల ఫోటోలు మీడియాలో ప్రచురితం అయ్యాయి…
  4. అంతెందుకు..? ఇండియాలో కూడా ప్రముఖ మీడియా సంస్థలు కరోనా విషాద తీవ్రతను పట్టిచ్చే అద్భుతమైన, ప్రభావవంతమైన ఫోటోల్ని అనేకం ప్రచురించింది… లోకల్ మీడియా కూడా…
  5. వాటితో పోలిస్తే ఇప్పుడు అవార్డులు పొందిన ఫోటోలు నాసిరకమే…
  6. ఉదాహరణకు… ఢిల్లీలో ఓ స్మశానంలో చితిమంటల్ని బర్డ్ వ్యూలో తీసిన ఫోటో… ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ స్మశానాలు అలాగే కనిపించాయి కరోనా ఉధృత వేవ్ సందర్భంగా…
  7.  కాశ్మీర్‌లో ఓ పశువుల కాపరికి కోవిడ్ వేక్సిన్ వేస్తున్న ఫోటోకు సనా ఇర్షాద్‌కు (అందరూ రాయిటర్స్ ఫోటోగ్రాఫర్లే…) అవార్డు ఇచ్చారు… అదంత ఎఫెక్టివ్‌గా ఏమీలేదు… దుర్గమ ప్రాంతాలకు వెళ్లి టీకాలు వేసే బ్రహ్మాండమైన ఫోటోలు బోలెడు ఇండియన్ మీడియాలో అచ్చయ్యాయి…

బుక్స్, డ్రామా, మ్యూజిక్ కేటగిరీలో… ఫిక్షన్, డ్రామా, హిస్టరీ, బయోగ్రఫీ, పొయెట్రీ, జనరల్ నాన్-ఫిక్షన్ విభాగాల్లోనూ అవార్డులు ఇక ఏ ధోరణిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు కదా… చివరగా… ఉక్రెయిన్ జర్నలిస్టులకు ప్రత్యేక పురస్కారాలు అని ప్రకటించింది… యుద్ధరంగంలో పనిచేస్తున్నందుకట… పలు దేశాల్లో అంతకు మించి భీకరంగా అంతర్యుద్ధాలు సాగుతున్నాయి… కానీ ప్రస్తుతం ఉక్రెయిన్‌ను ముందుపెట్టి అమెరికా, రష్యాతో పరోక్షంగా యుద్ధం చేస్తోంది కదా… సో, ఆ జర్నలిస్టులకు ఇలా నైతిక మద్దతు అన్నమాట… సో, పులిట్జర్ అవార్డు అంటే అదేమీ పెద్ద విశేషం కాదు… కాదు…!! మన అసలైన దరిద్రం ఏమిటంటే… ఆ దిక్కుమాలిన అవార్డుల వార్తల్ని కళ్లకద్దుకుని, అచ్చేసి, పులకరించిపోతాం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇంకొన్నాళ్లు పోతే… రూట్ – కోహ్లీ ట్రోఫీగా పేరు మారుస్తారా..?
  • ‘‘బనకచర్ల ఏపీకి మరో కాళేశ్వరం అవుతుంది బహుపరాక్…’’
  • ఫాఫం జగన్… ఈ రఫారఫా నరుకుడు భాషేమిటో, ఈ సమర్థనేమిటో…
  • కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల సాహిత్య పురస్కారాలు వీళ్లకు…
  • వర్తమాన సినిమా ప్రపంచంలో నిజంగానే ఇది ‘అరుదైన సరుకు’…
  • అక్కినేని అలా… కాంతారావు ఇలా… కాంట్రాస్టు జీవితాలు… డెస్టినీ…!!
  • అసలే చిరంజీవి… ఆపై రాఘవేంద్రరావు… ఆవేశంతో శారద… ఇంకేం..?!
  • అన్నదాతకు సంకెళ్లు… ఖచ్చితంగా ప్రభుత్వానికి మరక, మచ్చ..!!
  • దేనికీ టైమ్ లేదా…? పరుగు తీస్తున్నావా..? టైమ్ మింగేస్తుంది జాగ్రత్త..!!
  • గోదావరి- బనకచర్ల ఇష్యూ రాజకీయంగా రేవంత్‌రెడ్డికి కలిసి వస్తోంది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions