Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అనేకానేక ‘మొగుడు’ సినిమాల్లో… ఇతడు ఈవీవీ మార్క్ ‘అద్దె మొగుడు…

March 27, 2026 by M S R

.

Subramanyam Dogiparthi …. మొగుడు , దొంగ మొగుడు , ఘరానా మొగుడు . తెలుగులో మొగుడు టైటిల్‌కు బాగా వాల్యూ… సరే, ఇది అత్తింట్లో అద్దె మొగుడు . 1991 లో వచ్చిన ఈ కుటుంబ కధాచిత్రం హిందీలో ఘర్ హై తో ఐసా అనే సినిమాకు రీమేక్ . హిందీలో అనిల్ కపూర్ , మీనాక్షి శేషాద్రి లీడ్ రోల్సులో నటించారు . అక్కడే కాదు ; ఇక్కడా బాగానే ఆడింది .

అత్తలు , ఆడపడుచులు నోరు లేని కోడళ్ళను రాచిరంపాన పెట్టే సినిమాలు మనకు చాలానే ఉన్నాయి . ఈ సినిమా కూడా ఆ కేటగిరీ లోనిదే . వయ్యారాల వై. విజయ పరమ గయ్యాళి అత్త . ఆమె మొగుడు గారు సుత్తి వేలు నోరు లేని పెళ్ళాం చాటు మొగుడు . వాళ్ళ పెద్ద కొడుకు ఆహుతి ప్రసాద్ , అతని భార్య వైష్ణవి . ఓ నంగనాచి కూతురు , ఆ కూతురికో పనికిరాని ఇల్లరికం మొగుడు మల్లికార్జున రావు . రెండో కొడుకు మన హీరో రాజేంద్రప్రసాద్ .

Ads

పెద్ద కోడల్ని అత్త , ఆడపడుచు , మొగుడు గారు 1950s , 1960s సినిమాల్లోలాగా రాచిరంపాన పెడుతుంటారు . ఆ కోడలు మాత్రం నోరెత్తకుండా అన్ని కష్టాలు పడుతూ చాకిరి చేస్తూ ఉంటుంది . హీరోయిన్ నిరోషా . మొండి ఘటం , పొగరుబోతు . తండ్రి పెద్ద ఇండస్ట్రియలిస్ట్ . ఆమెను దారిలో పెట్టేందుకు హీరోకి మేనేజర్ ఉద్యోగం ఇస్తాడు .

ముందు నిరసించినా క్రమంగా ప్రేమలో పడుతుంది . ఈలోపు వదిన కూతురితోసహా ఆత్మహత్య చేసుకుందని తెలిసిన హీరో , హీరోయిన్ , ఆమె తండ్రి కలిసి ఓ నాటకాన్ని రచిస్తారు . తాత మనవడు సినిమాలో రాజబాబు , విజయనిర్మల లాగా దండలతో ప్రత్యక్షమవుతారు .

ఇంట్లో అత్తామామల్ని , పెద్ద కొడుకుని , ఆడపడుచుని దారిలోకి తెస్తారు . చివర్లో పెద్ద కోడలు , ఆమె కూతురు వచ్చి అత్తమామల్ని క్షమించేయడంతో హీరో హీరోయిన్లు ఒకటి కావటం , సినిమా శుభాంతం కావటం జరిగిపోతాయి .

ఈ సినిమాలో గొప్ప ఎట్రాక్షన్ ఏంటంటే బట్టల సత్యం తుమ్మితే దగ్గర్లో ఉన్న ఆడవాళ్ళ కుచ్చెళ్ళు , మగవాళ్ళ పంచెలు ఊడిపడతాయి . కొంచెం ముతకగా అనిపించినా సినిమాలో బాగానే చూపారు దర్శకుడు రేలంగి నరసింహారావు .

ఈ సినిమా టైంకే మాంచి ఫాంలో ఉన్న రాజేంద్రప్రసాద్ , నిరోషాలు చాలా హుషారుగా నటించారు . అత్త ఆడపడుచు ఆరళ్ళను భరించే పెద్ద కోడలిదే ప్రధాన పాత్ర . వైష్ణవి బాగా నటించింది . ఇల్లరికం అల్లుడిగా బట్టల సత్యం , పెద్ద కొడుకుగా ఆహుతి ప్రసాద్ . Spartex Ceremics సినిమా ఓనరుగా గొల్లపూడి మారుతీరావు , వయ్యారాల వై విజయ భర్తగా వేలు , ఆడపడుచుగా కాంచన (హీరోయిన్ కాంచన కాదు) , ఆహుతి ప్రసాదుకి బుధ్ధి చెప్పేవారిగా డిస్కో శాంతి , వంకాయల , డబ్బింగ్ జానకి  తదితరులు నటించారు .

డైలాగులను మా గుంటూరు వారు , మిత్రులు Divakara Babu Madabhushi గారు చాలా బాగా వ్రాసారు . కీరవాణి సంగీత దర్శకత్వంలో వేటూరి పాటల్ని వ్రాసారు . ఒక్క పాటను మాత్రం కీరవాణి వ్రాసారు . బాలసుబ్రమణ్యం , చిత్ర , రమణ పాడారు .

చలాకీ పాలపిట్ట , బాత్ రూమ్ అంటూ సాగే రెండు డ్యూయెట్లు చాలా హాటుగా ఉంటాయి . నిరోషాని టీజ్ చేసే గ్రూప్ డాన్స్ హుషారుగా ఉంటుంది . డిస్కో శాంతి అందగాడా అందుకోరా గొల్లభామ చేతిలోని పాలకుండ బాగా వచ్చింది . రాజేంద్రప్రసాద్ , నిరోషా , బట్టల సత్యం కలిసి అత్తమామల్ని , ఆడపడుచుని డిసిప్లిన్ చేసే భజగోవిందం పాట హుషారుగా ఉంటుంది .

వెరశి సినిమా బాగుంటుంది . It’s a good entertainer . చూడబులే . యూట్యూబులో ఉంది .

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘కొరుకుడుపడని’ రోత… మారితే మల్లెమాల కాదు… జబర్దస్త్ అసలే కాదు…
  • ప్లీజ్ సర్, కాదంటే మా మీదొట్టే… ఈ గౌరవ డాక్టరేట్ తీసుకొండి ప్లీజ్
  • ఎహె… ఈ రేవంతుడికి ఏమీ తెల్వదు, మొత్తుకోదు… ఏదీ సమజ్ కాదు…
  • పోటాపోటీగా తాయిలాలు… రాజకీయాల్లో మాత్రం వెకిలి కూతలు…
  • కాషాయం వదిలేసిన పులిబిడ్డ … తమిళ జాతీయవాదానికి సై…
  • సో కాల్డ్ కాంగ్రెస్ సీనియర్లు..! ఏదేదో మాట్లాడేస్తున్నారు..!!
  • అనేకానేక ‘మొగుడు’ సినిమాల్లో… ఇతడు ఈవీవీ మార్క్ ‘అద్దె మొగుడు…
  • ప్రతి పదమూ ఓ మంగళ వాయిద్యంగా వినిపించే పెళ్లి మురిపెం..!!
  • ఇండియా తొలి ప్రైవేటు శాటిలైట్ టీవీకి ఎన్నెన్నో పురిటినొప్పులు..!!
  • పెట్రో పానిక్ – చమురు పరుగులు…! మూసీపై మాత్రం ఏడుపులు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions