.
ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించాం అని రాస్తున్నారు చాలామంది… తప్పు… ఇంగ్లండ్ చాలా గౌరవప్రదంగా, పోరాడి, ఒ దశలో ఇండియాను ఓడించినంత పని చేసి, వణికించి, చెమటలు పట్టించి మరీ ఎలాగోలా గెలిచింది… గెలుపు గెలుపే, నిజమే, కానీ గెలుపు వెనుక తప్పొప్పుల మథనం అవసరం… 253 పరుగుల భారీ స్కోర్ చేసినా సరే, ఇంగ్లండ్ జస్ట్ 7 రన్స్ దూరం దాకా ఛేజ్ చేసిందంటే మామూలు విషయం కాదు కాబట్టి మన మైనసుల సమీక్ష అవసరం…
ఎందుకంటే… మార్చి 8న ఫైనల్స్‌లో ఆడబోయే న్యూజీలాండ్ కూడా టఫ్ ఫైటరే… చివరి బాల్ వరకూ పోరాడే తత్వమే… మరి మనం..? అదుగో ఆ ప్లస్ మైనసులే ఓసారి చెప్పుకోవాలి… బహుశా ఇదే టీమ్‌ను ఆడిస్తారేమో గానీ… తప్పొప్పుల నెమరివేత కూడా తప్పక అవసరమే మరి…
Ads
ఫస్ట్ క్రెడిట్ సంజూ శాంసన్… సెమీస్‌లోకి తీసుకొచ్చిన తనే ఇప్పుడు ఫైనల్స్‌లోకీ తీసుకొచ్చాడు… హీరో నంబర్ వన్… వికెట్ కీపింగులో మెరుపుల్లేకపోయినా తప్పిదాలు మాత్రం కనిపించలేదు… విధ్వంసుడు బెథెల్ రనవుట్ క్రెడిట్‌లో తనకూ పార్టనర్‌షిప్ ఉంది…
హీరో నంబర్ టూ బుమ్రా… కీలకమైన ఓవర్లలో పొదుపుగా రన్స్ ఇచ్చి, ఇండియాను గెలుపు గాడిలో పడేసింది తనే… ఇది ప్రధనంగా బ్యాటర్ల గెలుపు… ఎస్, వాంఖెడ్ స్టేడియం బ్యాటింగ్ పిచ్, పైగా బౌండరీ లైన్ దగ్గరగా ఉంటుంది… ఐనా సరే, మన బ్యాటర్లు బాగా ఆడారు… ఎప్పటిలాగే అభిషేక్ శర్మ మరోసారి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు…

నిజానికి వరుణ్ చక్రవర్తి టీ20 మ్యాచుల్లో అగ్రగణ్యుడైన బౌలర్… కానీ అస్సలు ఫామ్‌లో లేడు… ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు… కొట్టినోడికి కొట్టుకున్నంత అన్నట్టుగా… ఇంగ్లండ్ బౌలర్ అర్చర్ 61 పరుగులు ఇస్తే, నేనేం తక్కువ అన్నట్టు వరుణ్ చక్రవర్తి 64 పరుగులు ఇచ్చాడు… అర్షదీప్ కూడా 51 పరుగులు ఇచ్చాడు… పైగా అనేకె వైడ్లు… ఏమాత్రం క్రమశిక్షణ లేని బౌలింగ్…

పదే పదే ఈ సూర్యకుమారుడు శివమ్ దూబేకు బౌలింగ్ ఎందుకిస్తాడో తెలియదు… ఒకే ఓవర్ ఇస్తే ఏకంగా 22 పరుగులు ఇచ్చాడు, కాకపోతే అప్పటికే మన గెలుపు ఖాయమైంది కాబట్టి నష్టం జరగలేదు… అంతకుముందు మ్యాచుల్లో కూడా దూబెకు బౌలింగ్ ఇచ్చాడంటేనే ఫ్యాన్స్‌లో గుబులు… అయ్యా, సూర్యకుమారా..? ఏమిటిది..? తిలక్ వర్మ లేకపోతే నువ్వు బౌలింగ్ చేసినా బాగుండు…
పైగా కెప్టెన్ అప్పుడప్పుడూ బుమ్రాకు బౌలింగే ఇవ్వడు సరిగ్గా… ఈ సెమీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు అరివీర భీకరంగా బాదుతున్నప్పుడు 18 వ ఓవర్‌లో కేవలం ఆరు పరుగులు ఇచ్చాడు తను… 16వ ఓవర్‌లో కూడా కేవలం ఎనిమిది రన్స్… అదీ బుమ్రాను సరిగ్గా వాడుకుంటే వచ్చే ఫలితం… తను ఇండియా తురుఫు ముక్క…
అర్షదీప్, వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె… న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచులో విలన్లు కావద్దంటే జాగ్రత్తగా బౌల్ చేయాల్సిందే… లేకపోతే ఫిన్ అలెన్, సీఫర్ట్ ఇద్దరు చాలు ఉతికి ఆరేయడానికి… చూశాం కదా, బలమైన దక్షిణాఫ్రికా జట్టునే 13 ఓవర్లలో చాపచుట్టేసి గెలిపించారు ఈ ఇద్దరు ఓపెనర్స్…

హార్దిక్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగుల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు, పర్లేదు, సూర్యకుమార్ స్వయంగా ఓ మంచి ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు… ఇషాన్ కిషన్ వోకే… ఈ సెమీస్ మ్యాచులో మెచ్చాల్సింది క్యాచులు… అక్షర్ పటేల్, తిలక్ వర్మ, దూబె క్యాచులు ఔట్ స్టాండింగ్… అక్షర్ క్యాచ్ మరీ స్టన్నింగ్…
ఒక్కసారి ఊహించండి… ఇండియా టీ20 మ్యాచుల్లో నాలుగో హయ్యెస్ట్ స్కోర్, ఇండియా సెకండ్ హయ్యెస్ట్ స్కోర్ సాధించకుండా ఉండి ఉంటే… బెథెల్ ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ను ఫైనల్స్‌లోకి తీసుకుపోయేవాడు కాదా..? తప్పొప్పుల సీరియస్ సమీక్ష ఫైనల్స్‌కు ముందు అవసరమా, కాదా..?!
Share this Article