Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేపు చంద్రగ్రహణం- దీనికి ఓ విశిష్టత… ఇవీ జాగ్రత్తలు- పరిహారాలు…

March 2, 2026 by M S R

.

ఈ సంవత్సరం (2026) ఒకే రోజున ఫాల్గుణ పౌర్ణమి,, చంద్రగ్రహణం రావడం గమనించాల్సిన విషయం… ధర్మ శాస్త్రాల ప్రకారం, గ్రహణ సూతక (వేధ) కాలంలో లేదా గ్రహణ సమయంలో ఎటువంటి పూజలు, పండుగలు చేయకూడదు… కాబట్టి హోళికా దహనం ఎప్పుడు చేయాలనే సందేహం చాలామందికి వస్తుంది…

శాస్త్రీయ పరిష్కారం…: మార్చి 3వ తేదీ సాయంత్రం 6:47 కు గ్రహణం పూర్తయిన (మోక్షం) తర్వాత, స్నానాదులు ముగించుకుని, ఆ తర్వాతే హోళికా దహనం (కామ దహనం) పూజను నిర్వహించాలి… ఆ మరుసటి రోజు అనగా మార్చి 4, 2026 వ తేదీన రంగుల పండుగ (హోళీ) జరుపుకోవడం సర్వత్రా శాస్త్ర సమ్మతం…

Ads

భారతదేశంలో చంద్రోదయ సమయంలోనే గ్రహణం పట్టి ఉండటం వల్ల దీనిని గ్రస్తోదయ చంద్ర గ్రహణంగా పరిగణిస్తారు… మన దేశంలో గ్రహణ మోక్ష కాలం (ముగింపు దశ) మాత్రమే కనిపిస్తుంది…

మన సనాతన ధర్మంలో గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేయడం ఒక ఆనవాయితీ… గ్రహణ కాలంలో వెలువడే ప్రతికూల కిరణాల ప్రభావం విగ్రహాలలోని దైవశక్తిపై పడకుండా ఉండేందుకు ఆగమ శాస్త్రాలు ఈ నియమాన్ని విధించాయి…

  • మూసివేత సమయం…: చంద్రగ్రహణానికి 9 గంటల ముందు నుండే సూతకం (గ్రహణ వేధ) ప్రారంభమవుతుంది…. మార్చి 3 ఉదయం 9:23 గంటలకు వేధ ప్రారంభం అవుతున్నందున, ఆ సమయం నుంచే దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి ఆలయంతో సహా దాదాపు అన్ని ప్రధాన దేవాలయాల ద్వారాలు మూసివేస్తారు…
  • తిరిగి తెరిచే సమయం…: సాయంత్రం 6:47 కు గ్రహణ మోక్షం (ముగింపు) జరిగిన తర్వాత, ఆలయాల్లో సంప్రోక్షణ, పుణ్యాహవచనం నిర్వహించి, దోష నివారణ పూజల అనంతరం రాత్రికి మళ్లీ భక్తుల దర్శనార్థం తెరుస్తారు….

గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండే ఏకైక శైవ క్షేత్రం – శ్రీ కాళహస్తి…: దేశమంతా ఆలయాలు మూతబడినా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ కాళహస్తి (వాయు లింగం) శివాలయం మాత్రం గ్రహణ సమయంలో యథావిధిగా తెరిచే ఉంటుంది… ఇందుకు కారణం, ఈ క్షేత్రం స్వయంగా రాహు-కేతువుల పరిహార క్షేత్రం కావడం…

ద్వాదశ రాశుల వారి దైనందిన జీవితంపై గ్రహణ ప్రభావం – పరిహారాల కోసం ఈ లింకు ఓపెన్ చేయండి… https://www.onlinejyotish.com/articles/lunar-eclipse-march-2026-telugu.php 

  • గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ, ధర్మపురి, తెలంగాణ… https://www.onlinejyotish.com/

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేపు చంద్రగ్రహణం- దీనికి ఓ విశిష్టత… ఇవీ జాగ్రత్తలు- పరిహారాలు…
  • *99 రోజుల ప్రోగ్రాం* వెనుక రేవంత్ రెడ్డి లక్ష్యాలేంటి- సవాళ్లేంటి…!!
  • ‘‘ఏం..? ఆమెకు ఓ కొత్త జీవితం ప్రసాదించాలనుకున్నాడు, తప్పేంటి..?’’
  • ముందు ఓ పాట యూట్యూబ్‌లో చూడండి… తరవాతే ఇది చదవండి…
  • నాలుగు దేశాల క్రికెట్ ఫ్యాన్స్‌కు చాన్నాళ్లు గుర్తుండే ఓ వైడ్ బాల్..!!
  • అదిరింది..! ఆ పెళ్లి ఫోటోలకన్నా బాగుంది..! ఇంతకీ ఎవరు ఆ రణబాలి..?!
  • గల్ఫ్ వార్ విస్తరిస్తోంది… ఇజ్రాయిల్, అమెరికాల వ్యూహం ఏమిటి..?
  • దేశవాళీ క్రికెట్‌లో అనూహ్యంగా ఓ కొత్త చరిత్ర రాసిన జమ్ముకశ్మీర్..!!
  • సీడాన్స్..! ఇలా చెప్పండి, అలా ఓ అవతార్ తాతను క్రియేట్ చేసిస్తుంది..!!
  • దేవుడే ఇచ్చాడు వీథి… నిజంగా ఈ పాట సందర్భానికి, పాత్రలకూ నప్పిందా..?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions