.
బాడీ షేమింగులు, అక్రమ సంబంధాలు, రోత కామెడీ, వెగటు పంచులు, వెకిలి కూతలు, బూతు స్కీట్లు ఎట్సెట్రా… జబర్దస్త్ మీద మొదటి నుంచీ అందరికీ ఉన్న అభిప్రాయమే ఇది… హైపర్ ఆది వంటి సీనియర్ల భాష, పెడర్థాలు, ద్వంద్వార్థాలు కూడా తెలిసిందే కదా…
సరే, ఈమధ్య ఆ షో మొత్తం మానేశాడు, చాలామంది రీల్స్, షార్ట్స్ చేసుకుని పాపులరైన కొత్త కామెడీ ఆర్టిస్టులను తీసుకున్నారని విని పొరపాటున ఓ ప్రోమో చూడబడ్డాను… అదేమీ మారలేదు, మరింత నాసిరకం అనిపించింది… ఆర్టిస్టుల కామెడీ టైమింగు, డైలాగ్ డెలివరీ బాగుంటోంది కానీ ఎటొచ్చీ కంటెంటే మరీ పూర్…
Ads
ఈటీవీ షోలను స్వయంగా రామోజీ వారసులు చూసుకుంటున్నారని విన్నాం గానీ…. సీరియళ్లు, ఇతర షోలు ఏమైనా మారాయో, లేక వాళ్లు కేవలం ఈటీవీ విన్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఇలాంటి తమ ఫ్లాగ్షిప్ షోలను వదిలేశారో తెలియదు గానీ… మల్లెమాల టీమ్ మారదు… ఆ షో మారదు…
ఆ ప్రోమోలో పొట్టి నరేష్, ఫైమా, భాస్కర్ తదితరులున్నారు… ఓ పాత కమెడియన్ కూడా ఉన్నాడు, పేరు తెలియదు… భాస్కర్ ప్రియురాలిని నరేష్ పెళ్లిచేసుకుంటాడు, విషయం తెలిసి నీ ప్రియురాలిని నువ్వే పెళ్లి చేసుకో, లేకపోతే నా బతుకు డ్రమ్ములు, కుక్కర్ల పాలవుతుంది అంటాడు నరేష్, ఇక్కడి వరకూ వోకే… కానీ ఓచోట భాస్కర్ నోట్లో వేలు పెట్టి, చూడు కొరికాడా అనడుగుతాడు నరేష్… అంటే నోట్లో వేలుపెట్టినా కొరకడం తెలియని అమాయకుడు అని చెప్పడం ఉద్దేశం…
కానీ సదరు పాత కమెడియన్ అందుకుని, వేలు పెడితే కొరకదు, మరొకటి పెట్టి చూడు, కొరికేస్తాడు అంటాడు… (అర్థమైంది కదా…) ఇదీ ఇప్పటికీ జబర్దస్త్ మెయింటెయిన్ చేస్తున్న రోత క్వాలిటీ… అసలు ఎప్పుడైనా శ్యాంప్రసాద్ రెడ్డి ఈ షో చూస్తాడా..? చూసి కాలరెగరేసి తన అభిరుచికి తనే ఆనందిస్తుంటాడా..?
మరీ పొట్టి నరేష్నైతే బాడీ షేమింగ్ వ్యాఖ్యలతో ఆడుకుంటున్నారు… డబ్బు కోసం భరిస్తున్నాడో, లేక అదీ కామెడీయే, నాదేం పోయింది, ఎవడేం కామెంట్ చేసుకుంటామో పోయేదేముంది అని ఊరుకుంటున్నాడో… పైన చెప్పిన స్కిట్ బిట్లో నీహారిక, రష్మి, జడ్జి ఖుష్బూ, నటుడు శోభన్, ఇంకెవరో గెస్ట్ నటి పకపకా నవ్వుతున్నారు… అది అసలు దరిద్రం… ఇంతకు మించి ఏం రాసినా వేస్ట్… గిట్ల తయారయ్యారేందిర భయ్ మీరంతా…
Share this Article