Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సో వాట్..? దివ్వెల మాధురి ఐతేనేం… టీటీడీకి అంత భయమా..? జడుపా..?

March 6, 2026 by M S R

.

తిరుమలను భ్రష్టుపట్టించడంలో ఆ రెండు ప్రధాన రాజకీయ పార్టీల వికృత వికారాలు, విన్యాసాల ముందు చిన్న చిన్న ఆర్డిస్టులు రీల్స్ వ్యూస్ కోసం చేసే తప్పులు ఆఫ్టరాల్… కౌంట్ లెస్… అక్కడ ప్రతి పనిలోనూ రాజకీయం, డబ్బు కక్కుర్తి, పాపభీతిరాహిత్యం, అవినీతి, అక్రమం కనిపిస్తూనే ఉంటాయి…

నెయ్యి కాని నెయ్యి, పట్టు కాని పట్టు… అందులో భాగమే… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..? నిన్నో మొన్నో దివ్వెల మాధురి అనే ఓ మహిళ బిగ్‌బాస్ రీసెంట్ షో రన్నరప్ తనూజ బర్త్‌డే వేడుకల్ని తిరుమల కొండపై ఏదో గెస్ట్ హౌజులో నిర్వహించిందట… సోషల్ మీడియాలో రచ్చ… అసలు కేక్‌ను ఎలా అనుమతించారు..? పైకి ఎలా తీసుకొచ్చారు..? తనిఖీలు లేవా..? మాధురి అతీతమా..? కొండపై జన్మదిన వేడుకలు ఏమిటి..? ఇలా…

Ads

అంతా నిజమే… దివ్వెల మాధురి ఇటీవల పాపులరవుతున్న…. కాదు, కాదు, పాపులర్ చేయబడుతున్న ఓ కంట్రవర్సీ కేరక్టర్… ఆమె మాట మహా పెళుసు… దువ్వాడ శ్రీనివాసుతో ఆమె సహజీవనం, ఆయన రాజకీయం ఏదో ప్రహసనం…

సరే, వాళ్ల జీవితం వాళ్లిష్టం అనుకుందాం… టీవీ నటి తనూజ పుట్టస్వామి మాట, ప్రవర్తన కాస్త పద్ధతిగానే అనిపిస్తాయి… బిగ్‌బాస్ షోలో మంచి ఆదరణ కూడా పొందింది… మరి మాధురి చెప్పగానే ఎందుకు అంగీకరించింది..? ఇదుగో ఇలాంటి వివాదాలకు గురిచేసి, చివరకు అభిమానులు కూడా ఛీకొట్టేలా చేస్తాయి… అదేదో గదిలో కేక్ కటింగ్ ప్రోగ్రాంలా అనిపిస్తోంది, సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇరుక్కున్నారు.,.

ఒక ప్రియాంక జైన్, ఒక శివజ్యోతి తదితరులు కూడా గతంలో ఇలాగే వివాదాల్లో చిక్కారు… క్షమాపణలు చెప్పారు… మాధురి నుంచి అవేమీ ఎక్స్‌పెక్ట్ చేయలేం, తనూజ మౌనం మాత్రం కరెక్టు కాదు… ఇలాంటోళ్లపై టీటీడీకి ఎందుకు యాక్షన్ చేతకాదు..? సర్లెండి… తిరుమలలో జరిగే భారీ యవ్వారాలతోనే టీటీడీకి సరిపోతోంది, ఈ చిన్న చిన్న తప్పుల మీద దృష్టి ఏముంటుంది అంటారా..?

అవును, పెద్ద పెద్ద తలకాయలకే ధర్మం, పద్ధతి సోయి లేకపోతే… ఈ చిన్న చిన్న తనూజలదేముంది లెండి… భారీ అక్రమాల సంగతి కాసేపు పక్కన పెడితే… జన్మదిన వేడుక అనగానే ఒకటి గుర్తొచ్చింది… వైవీ సుబ్బారెడ్డి గారు మహానుభావులు, కారణజన్ములు కదా…

మే 1, 2020 … తేదీ సబ్జెక్ట్ టు కరెక్షన్… లాక్ డౌన్ పీరియడ్… దేశమంతా కోవిడ్ కోరలు చాచి వేలాది మందిని కబళిస్తున్న కాలమది… తిరుమల గుడిని కూడా మూసేశారు… సుబ్బారెడ్డి కోసం తలుపులు తెరుచుకున్నాయి… ఆయన సతీమణి, తల్లితో పాటు వెళ్లి, ఏకంగా గుళ్లోనే 61వ పుట్టినరోజు జరుపుకున్నాడు అక్కడ… టీటీడీ ఛైర్మనే అలా చేస్తే ఇక మామూలు భక్తులను తప్పుపట్టి ఏం ప్రయోజనం..? దీనిపై సుబ్బారెడ్డి ఏదో వివరణ కూడా ఇచ్చుకున్నాడు…

ఈ మాధురి, ఈ తనూజ వేడుకల వార్తలు చదువుతుంటే ఇదే గుర్తొచ్చింది… అవునూ, వాళ్ల ఆధార్ కార్డులు బ్లాక్ చేయడంతో దర్శన నిషేధం వంటి చిన్న శిక్షలనైనా విధించలేదా ది గ్రేట్ టీటీడీ..?! ఏమాటకామాట దర్శనం అనంతరం మైకుల ముందు నానా రాజకీయ చెత్త వాగడం మాత్రం ఆగిపోయినట్టుంది… శుభం..!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • IPL … అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కాదు… ఇండియన్ పైసా లీగ్…
  • దురంధర్-3 కాదు…! ఆదిత్య ధర్ దృష్టి మరో పే-ద్ద ప్రాజెక్టు మీద..!!
  • సిద్దిపేట మాత్రమే కాదు..! సిరిసిల్ల, గజ్వెల్ కూడా *అన్ బ్రేకబుల్* కావు..!!
  • ఒక హైజాకర్… ఒక గ్యాంగ్‌స్టర్… వేర్వేరు కథలు… ఒకటే అంతిమతీర్పు…
  • క్షమాపణకు ‘దురంధర్ స్టార్’ రెడీ… ఇక్కడితో ముగించాలని వేడికోలు…
  • … ఇప్పుడైతే ఆ పాట మీద పెద్ద గొడవ అయ్యేదేమో… అసలే మోహన్‌బాబు…
  • మల్టీ నేషనల్ కంపెనీలకన్నా మనవాళ్లు తక్కువేమీ కాదు… చదవండి…
  • ఓహ్… స్టార్‌టీవీ Vs జీటీవీ… ఇంత కథ ఉందా..? స్టార్ ఫుల్‌ఫామ్ తెలుసా..?!
  • ఏడుపుగొట్టు కేరక్టర్లను వదిలేయండి… దురంధర్ సక్సెస్ ఏంటో తెలుసా..?!
  • వావ్, షేన్ వార్న్..! సంపద సృష్టించడం అంటే, ఇదుగో ఇదీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions