.
Gurram Seetaramulu …. అసలు ఎవరీమే ? యేం చదువుకుంది.
ఇంతలా నోరేసుకుని అరుస్తూ ఉంటది.
నిజాం ఒక రాజు, ఆయన ఆస్తి ఆయన అమ్ముకున్నాడు.
నీకు అవసరం ఉంటే గొలుసో
ముక్కు పుల్లో అమ్ముకోవా?
Ads
ఎంత అమ్ముకున్నా నిజాం ప్రపంచంలోనే ధనవంతుడైన రాజు.
ఆయన్ను పట్టుకుని వీడు వాడు అంటావా
ఎంత పొగరు నీకు
బుద్దిలేదు?
మీ కులపాయన మామను కూల్చి,
అక్రమంగా అధికారంలోకి వచ్చాడు.
ఆయన అమ్మిన ప్రభుత్వ ఆస్తుల చిట్టా కింద ఉంది.
ఆసియాలోనే అతిపెద్ద సుగర్ ఫ్యాక్టరీ, బోధన్ లో ఉన్న దక్కన్ నిజామ్స్ షుగర్ తన పార్టీ వ్యక్తికి అమ్ముకున్నాడు.
అదీ కాక మా జిల్లాలో వందల కోట్ల విలువైన రాజేశ్వరపురం షుగర్ ఫ్యాక్టరీ కేవలం ఇరవై కోట్ల లోపు నామా నాగేశ్వర రావు అనే మాజీ తెలుగు దేశం నాయకుడికి అమ్మేశాడు. ఆయన ఇప్పుడు దాని పిల్ల పార్టీ భారాస తరఫున ఖమ్మంలో పోటీలో ఉన్నాడు.
అలా చంద్రబాబు తొమ్మిది చక్కర కర్మాగారాలతో బాటు అజంజాహి మిల్స్, ఆల్విన్ , IDPL, ప్రాగా టూల్స్, HMT, సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్ , రామగుండం ఫెర్టి లైజర్స్… ఒకటా రెండా, యెన్నో ప్రభుత్వ సంస్థలను ప్రయివేట్ వ్యక్తులకు అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేశాడు. అడ్డికి పావుశేరు.
నిజాం రాజు తన సొంత ఆస్తిని భూమిని అమ్ముకున్నారు.
చంద్రబాబు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అయితే కావచ్చు.
ఆయన దివాన్ కాదు, జాగీర్దారు కాదు.
మరి ఎవడబ్బా సొమ్ము అని అమ్ముకున్నాడో…
నీకు తెలుసా, చూస్తూనే ఉండు.
ఆయన దిగిపోయే లోపు ఉక్కు ఫ్యాక్టరీని అదానీకి అమ్మేసి దిగక పోతే … అప్పుడు చూసుకుందాం
వంటి మీద సోయి లేకుండా మాట… వెధవ సంత…
Share this Article