Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రామ‘దాసుడి నుంచి ఓ పంచముఖ మహాబలిగా పరివర్తన… ఓ పాఠం…

March 6, 2026 by M S R

.

విధేయత నుండి విజయానికి: హనుమంతుడి పరివర్తన కథనం … రామాయణంలో మనకు ఇద్దరు హనుమంతులు కనిపిస్తారు… ఒకరు రాముడి పాదాల చెంత చేతులు కట్టుకుని కూర్చునే ‘రామదాస హనుమంతుడు’…. మరొకరు పది చేతులతో, ఐదు తలలతో విశ్వరూపాన్ని ప్రదర్శించే ‘మహాబలి హనుమంతుడు’… ఈ రెండు రూపాల మధ్య ఉన్న ప్రయాణమే అసలైన వ్యక్తిత్వ వికాసం…

1. ఆదర్శవంతమైన అనుచరుడు (The Perfect Follower) తొలినాళ్లలో హనుమంతుడు మేధావి, బలవంతుడు అయినప్పటికీ తనకంటూ ఒక సొంత అజెండా లేని వ్యక్తి… సుగ్రీవుడికి మంత్రిగా, రాముడికి సేవకుడిగా తన బాధ్యతను అత్యంత నిబద్ధతతో నిర్వహించాడు… సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్నాడు… అక్కడ సీతమ్మను కలిసి, రాముడి ముద్ర ఉంగరాన్ని ఇచ్చి ఆమెలో నమ్మకాన్ని నింపాడు… ఇక్కడి వరకు హనుమంతుడు ఒక ‘నిర్వహణాధికారి’ (Manager) లాగా తనకు అప్పగించిన పనిని అద్భుతంగా పూర్తి చేశాడు…

Ads

2. ఒక్క మందలింపు.. మారిన ప్రవర్తన (The Impact of Criticism) అయితే, లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు ఒక చిన్న ‘చొరవ’ (Initiative) తీసుకున్నాడు… రాముడు చెప్పకపోయినా, రావణుడికి బుద్ధి చెప్పాలని లంకను దహనం చేశాడు… తిరిగి వచ్చిన హనుమంతుడిని రాముడు అభినందించడానికి బదులు, మెల్లగా మందలించాడు… “లంక ప్రజలను ఎందుకు శిక్షించావు? నేను చెప్పిన పని మాత్రమే చేయి” అన్నట్లుగా రాముడి మాటలు ఉన్నాయి…

పాఠం…: ఆ క్షణం నుండి హనుమంతుడు తన సొంత ఆలోచనలను పక్కన పెట్టేశాడు… “నేను అతిగా చేస్తే విమర్శలు వస్తాయి, కాబట్టి చెప్పింది మాత్రమే చేద్దాం” అనే ధోరణిలోకి వెళ్ళిపోయాడు… నేటి కార్పొరేట్ ప్రపంచంలో కూడా చాలా మంది ప్రతిభావంతులు బాస్ విమర్శిస్తారనే భయంతో తమ ‘క్రియేటివిటీ’ని చంపేసుకుని కేవలం ‘యంత్రాల’లా మారిపోతుంటారు…

3. సంజీవని అన్వేషణ – ఒక మేల్కొలుపు యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు, సంజీవని మూలికను తీసుకురావాలని రాముడు హనుమంతుడిని ఆదేశిస్తాడు… అప్పుడు జాంబవంతుడు రాముడితో ఒక కీలకమైన మాట అంటాడు.. “రామా! అతనికి పూర్తి వివరాలు ఇవ్వు… ఏ మూలిక తేవాలి, ఎలా తేవాలి, తెచ్చాక ఏం చేయాలి… అన్నీ చెప్పు… ఎందుకంటే నువ్వు మందలించినప్పటి నుండి అతను సొంతంగా ఆలోచించడం మానేశాడు… కేవలం ఆర్డర్స్ కోసం ఎదురుచూస్తున్నాడు…”

ఇది విన్న రాముడు దిగ్భ్రాంతి చెందుతాడు… తన అతి నియంత్రణ (Micro-management) ఒక మహావీరుడిని ఎలా బలహీనపరిచిందో గ్రహిస్తాడు… (నిజానికి హనుమంతుడికి తన బలం తనకు తెలియదు, ఎవరైనా గుర్తు చేస్తేనే ఆ బలాన్ని ప్రదర్శిస్తాడు, దీనికితోడు చెప్పింది మాత్రమే చేయాలనే తన బాస్ మందలింపు మరింతగా హనుమంతుడిని డిఫెన్స్ మోడ్‌లోకి నెట్టేసింది…)

4. పాతాళ రామాయణం: నాయకుడి ఉదయం (The Rise of a Leader) నిజమైన నాయకత్వం ఎప్పుడు బయటపడుతుంది అంటే… మనకు దిశానిర్దేశం చేసేవారు లేనప్పుడు… పాతాళ రావణుడు (మహిరావణుడు) రాముడిని, లక్ష్మణుడిని మాయాజాలంతో అపహరించి పాతాళానికి తీసుకువెళ్తాడు… ఇప్పుడు హనుమంతుడికి ఆజ్ఞలు ఇచ్చే రాముడు లేడు, సలహాలు ఇచ్చే లక్ష్మణుడు లేడు…

హనుమంతుడు తన తెలివితేటలను, శక్తిని పూర్తిగా ఉపయోగించాల్సిన సమయం వచ్చింది… పాతాళంలో మాయలను ఛేదించడానికి, దుష్టశక్తులను అంతం చేయడానికి అతను తనలోని ఐదు శక్తులను ఏకం చేశాడు. అదే పంచముఖి రూపం….

  • కోతి (హనుమాన్)…: భక్తి , వినయం.

  • సింహం (నరసింహ)…: ధైర్యం, శత్రు సంహారం.

  • గరుడ (డేగ)…: వేగం, దూరదృష్టి.

  • వరాహం (అడవి పంది)…: పట్టుదల, కష్టాలను తవ్వితీసే శక్తి.

  • హయగ్రీవ (గుర్రం)…: జ్ఞానం, బుద్ధి కుశలత.

ఈ రూపంతో అతను రాముడిని రక్షించి తిరిగి తీసుకువస్తాడు… ఇక్కడ హనుమంతుడు ‘సేవకుడి’ నుండి ‘రక్షకుడి’గా, అంటే దేవుడిగా మారాడు…

5. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఈ కథ మనకు మూడు కీలకమైన సందేశాలను ఇస్తుంది…

  1. నాయకులకు…: మీ బృంద సభ్యులను మరీ ఎక్కువగా నియంత్రించకండి… వారికి తప్పులు చేసే స్వేచ్ఛను ఇవ్వండి… భయం ఉన్న చోట కేవలం ‘పని’ జరుగుతుంది, కానీ నమ్మకం ఉన్న చోట ‘అద్భుతాలు’ జరుగుతాయి…

  2. అనుచరులకు…: ఎప్పుడూ ఒకరి ఆదేశాల కోసమే వేచి ఉండకండి… పరిస్థితులకు అనుగుణంగా బాధ్యత తీసుకోవడమే మీ వ్యక్తిత్వాన్ని పెంచుతుంది… రామదాసుగా ఉండటం మంచిదే, కానీ అవసరమైనప్పుడు మహాబలిగా మారే సత్తా మీలో ఉండాలి…

  3. గుర్తింపు…: రాముడు పాతాళం నుండి తిరిగి వచ్చాక హనుమంతుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తాడు… ఆ గుర్తింపే హనుమంతుడిని చిరంజీవిని చేసింది… ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అనేది ఎదుగుదలకు ప్రాణం లాంటిది…


ముగింపు: ప్రతి వ్యక్తిలోనూ ఒక హనుమంతుడు నిద్రిస్తుంటాడు… అతను మేల్కోవాలంటే… భయం అనే సంకెళ్లను తెంచుకోవాలి, బాధ్యతను భుజాన వేసుకోవాలి…. అప్పుడే మనం చేసే పనిలో ‘దైవత్వాన్ని’ చూడగలుగుతాం…. ( వాట్సప్‌లో కనిపించిన ఓ ఆంగ్ల ప్రతికి స్వేచ్ఛా తెలుగీకరణ ఇది... )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రామ‘దాసుడి నుంచి ఓ పంచముఖ మహాబలిగా పరివర్తన… ఓ పాఠం…
  • అంతటి జయప్రదకు ఆ గంభీర బాధిత పాత్ర… పైగా చంపేశారు…
  • సో వాట్..? దివ్వెల మాధురి ఐతేనేం… టీటీడీకి అంత భయమా..? జడుపా..?
  • గెలిచాం సరే… కానీ ఈ సెమీస్ గెలుపుకీ ఓ పోస్ట్ మార్టం అవసరం…
  • అవును, మేమిద్దరమూ ఒకటే… విజయ్- త్రిష బంధం ఇక బహిరంగమే…
  • ఊగిపోయిన ముంబై… తలెగరేసి మరీ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌లో ఇండియా…
  • టీ20 వరల్డ్ కప్..! కెప్టెన్ అనాలోచిత వైఖరే ఇండియాకు పెద్ద బలహీనత..!!
  • స్ట్రాటో ఫోర్ట్రెస్..! అమెరికా గగన వజ్రాయుధం యుద్ధరంగంలోకి..!!
  • మానవతా సంస్కారం..! పల్లెలో ఇంకా ‘మంచి మనసులు’ బతికే ఉన్నయ్…!
  • చోకర్స్ కాదు..! దక్షిణాఫ్రికా దురవస్థ ప్రతిభ లేక కాదు..! అదృష్టం లేక…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions