.
ముందుగా ఒక మాట :: మన సమాజంలో అన్ని పోరాటాలకు, అన్ని పార్టీలకు, అన్ని సెక్షన్లకూ అగ్రవర్ణాల నాయకత్వమే… చిన్నాచితకా కాలనీల సమస్యల నుంచి సాయుధ విప్లవ పోరాటాల దాకా… పొరపాటున కూడా బలహీనవర్గాల చేతుల్లోకి నాయకత్వాల్ని పోనివ్వరు… చివరకు, బలహీనవర్గాల స్వీయపోరాటాల్ని కూడా అగ్రవర్ణాలే లీడ్ చేయాలని అనుకుంటాయి… ఇదొక పెద్ద పారడాక్స్…
కల్వకుంట్ల కవిత ఎత్తుకున్న సామాజిక న్యాయం నినాదం కూడా అదే కోవలోనిదే అనిపిస్తుంది… అగ్రవర్ణమైతేనేం, సోషల్ జస్టిస్ గురించి మాట్లాడకూడదని కాదు, అడగాల్సిన వ్యక్తుల్ని, అడగాలి, నిలదీయాలి, బలహీనవర్గాల్ని చైతన్యపరుస్తూ కనీసం వాళ్ల పోరాటాలకైనా వాళ్లను ముందుంచాలి… సరే, ఇదంతా ఓ చర్చ…
Ads
నిన్న కవిత సుదీర్ఘ ప్రెస్‌మీట్‌లో కొన్ని అంశాలు నవ్వు పుట్టించాయి, కొన్ని సానుభూతిని కలిగించాయి… ఏమయ్యా, రేవంత్ రెడ్డీ, విజయశాంతిని ఎమ్మెల్సీని చేశావు, కానీ ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదేం అనడుగుతోంది… విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలో లేదో కాంగ్రెస్ పార్టీ అంతర్గతం, దాని లెక్కలు దానికి ఉంటాయి… మధ్యలో ఈమె ఆమెను ఎండార్స్ చేయడం ఏమిటో.,.
నిష్ఠుర నిజం ఏమిటంటే..? ఈమె తండ్రిగారే విజయశాంతి పార్టీని విలీనం చేసుకుని, తరువాత అవమానకరంగా తన పార్టీ నుంచి పంపించేశాడు… విజయశాంతికి అన్యాయం చేసిందెవరు..? ఎప్పుడూ దీన్ని ఎందుకు అడగలేదు కవిత..? నరేంద్ర, కేశవరావు వంటి ఎందరు పెద్దలు లేరు ఈ జాబితాలో..? హఠాత్తుగా సామాజిక న్యాయం, బహుజనరాజ్యం నినాదాలు ఎందుకు నెత్తికెత్తుకుంటున్నట్టు..,? ఇందులో క్రెడిబులిటీ ఏముంది..?
విజయశాంతి కంట్రిబ్యూషన్ ఏముంది కాంగ్రెస్ పార్టీకి..? జీరో..! ఇప్పుడు కవిత చెప్పింది కాబట్టి మంత్రి పదవి ఇవ్వాలా..? మేం సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ పెట్టిన తర్వాతే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు అంటోంది… గుడ్, క్రెడిట్ తీసుకో, పర్లేదు…
మరో హాస్యాస్పద పోలిక… వీహెచ్‌కన్నా శివధర్‌రెడ్డికి ఎక్కువ జీతం ఏమిటి అనడుగుతోంది..? అసలు వాళ్లిద్దరి నడుమ పోలిక దేనికి..? వీహెచ్‌కు ఓ పోస్టు ఓ పునరావాస రాజకీయ గౌరవం… అంతే… కానీ శివధర్‌రెడ్డి సర్వీస్ ఇప్పటికీ వాడుకోవడానికి తనకు సలహాదారు పదవి..! వీహెచ్ తన చిన్నప్పటి నుంచీ రాజీవ్ జయంతి నిర్వహిస్తున్నాడు కాబట్టి మంచి ప్రయారిటీ ఇచ్చి, గుర్తించాలట… అదేం అర్హతో…
నేను మరో షర్మిలను కానే కాను అంటుంది పదే పదే కవిత… కానీ అప్పుడప్పుడూ షర్మిలే బెటరేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది… రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్న కేసీయార్ ఫ్యామిలీ జస్టిస్ గురించి పల్లెత్తు మాట మాట్లాడదు… తను లబ్ధిదారే కదా…
గత రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే… బీసీల కోసం ఖర్చు చేసింది 5 వేల 5 వందల కోట్లే… అంటోంది ఆమె… శాఖల వారీ బడ్జెట్ కేటాయింపులపై ఆమె అవగాహన ఏమిటో అర్థమవుతోంది… యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం గారిని కింద కూర్చోబెట్టి అవమానించారు అని ఓ పాత సంగతి చెబుతోంది… ఆ విమర్శను సాక్షాత్తూ భట్టి స్వయంగా ఖండించాడు, వివరణ ఇచ్చాడు…

భూమిలేని వాళ్లందరికీ తలా ఒక ఎకరం భూమి ఇస్తేనే సామాజిక న్యాయం అంటోంది… కేసీయార్ ప్రవచించిన కుటుంబానికి మూడెకరాల మాట ఎందుకు వట్టిపోయిందో ఓసారి అర్థం చేసుకుంటే బాగుండు… మేం అధికారంలోకి రాగానే భూలక్ష్మి పేరుతో ప్రతి కుటుంబానికి ఓ ఎకరం భూమి ఇచ్చేస్తాం అని కూడా ఉదారంగా ఓ హామీ పడేసింది…
ఫీల్డ్ రియాలిటీ తెలియనితనం… సామాజిక న్యాయం అంటే భూ పునఃపంపిణీ అట… హేమిటో… తను మొన్నమొన్నటిదాకా ఉన్న తమ కుటుంబ పార్టీలో బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు పార్టీ పోస్టుల్లో ఎంత పెద్ద పీట వేశారో చరిత్ర చెబుతుంది…
Share this Article