Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హరీష్ రావు క్షుద్ర పూజలు ఎవరిపై, ఎందుకు – కవిత ఇచ్చిన మరో ట్విస్టు !!

August 28, 2026 by M S R

.

తెలంగాణలో పొలిటిషియన్స్ క్షుద్ర పూజలు, ప్రత్యేకించి హరీష్ రావు తాంత్రిక పూజల యవ్వారం మరో మలుపు తిరిగింది… మొదట్లో కొందరు కాంగ్రెస్ నాయకులు, పీసీసీ, సీఎం సహా హరీష్ రావు రాష్ట్రంలో కరువు రావాలని, జనం తీవ్రంగా కష్టాలు పడి ప్రభుత్వం వ్యతిరేకత పెంచుకోవాలని తిరుచ్చి, షిమోగాలలో క్షుద్ర పూజలు చేయించాడని ఆరోపించారు, తమ ఆరోపణలకు కట్టుబడే ఉన్నారు…

ఎహె, ఇవన్నీ క్షుద్ర విమర్శలు, నాన్సెన్స్ అని హరీష్ రావు కొట్టిపడేశాడు… రాజకీయాల్లో జరిగే విమర్శలు, కౌంటర్లు, ప్రచారాలకు సంబంధించి నిజానిజాల నిర్ధారణ ఎప్పుడూ ఓ యజ్ఞమే… ఐతే ఇప్పుడు ఆ క్షుద్ర పూజల యవ్వారానికి నిన్న కల్వకుంట్ల కవిత ఓ ట్విస్ట్ ఇచ్చింది…

Ads

‘‘క్షుద్ర పూజల గురించి కాంగ్రెస్ వాళ్లకు సరిగ్గా తెలియదు, నాకు తెలుసు… కేసీయార్ ఆరోగ్యం బాగుండకూడదని ఎప్పటి నుంచో పూజలు చేయిస్తున్నాడు, మాలో అందరికీ తెలుసు ఆ రహస్యం…’’ అని ఆరోపించింది… అంటే, కేసీయార్ చావు కోరుకుంటున్నాడా హరీష్ రావు..? కేసీయార్ కన్నుమూస్తే హరీష్ రావుకు వచ్చే ఫాయిదా ఏమిటి మరి..? అదొక చిక్కు ప్రశ్న!!

కేసీయార్ కనుమరుగైతే తన నెత్తుటి మగ వారసుడు కేటీయార్ ఉత్తరాధికారి అవుతాడు తప్ప హరీష్‌కు ఒరిగేదేమిటి..? హరీష్ వేల కోట్ల క్విడ్ ప్రోకో పాల వ్యాపారాల గురించి చెబుతూనే… ‘‘కేసీయార్ అచ్చం ఎన్టీయార్ టైపే, ఎన్టీయార్ కొడుకులు రాజకీయాలకు కొరగానట్టే అని చెబుతూ, బీజేపీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తూ, రాజ్ పుష్ప వెంచర్‌లో రెగ్యులర్ సంప్రదింపుల్లో ఉన్నాడు… మెదక్ బీఆర్ఎస్ నేతలతో భేటీలు వేస్తున్నాడు’’ అని మరో బాంబు పేల్చింది…

ఎవరో ఏదో రాయడం వేరు… సాక్షాత్తూ కేసీయార్ కుటుంబసభ్యురాలు కవిత ఆరోపణలకు ఉండే విలువ వేరు… సరే, క్షుద్ర పూజల సంగతికొద్దాం… నిజానికి క్షుద్రం అంటూ పూజల్లో కేటగిరీ ఏమీ ఉండదు, బహుశా ఇవి తాంత్రిక పూజలు… రాజకీయ నాయకులు, ధనికులు, పారిశ్రామికవేత్తలు, అవినీతి అధికారులు, సెలబ్రిటీలు చేయించుకుంటూనే ఉంటారు… దేశంలో పేరొందిన చాలామంది నాయకులకు అలవాటే…

అందులో హోమాలు, యాగాలు ఉంటాయి, వామాచార పద్ధతిలో జరిగే బలులు, శక్తిపూజలు కూడా ఉంటాయి… నాయకులు తరచూ చేయించుకునే రాజశ్యామల, భగాలాముఖి కూడా వామాచార పూజలే… ఐతే తెలుగు రాజకీయాల్లో అప్పట్లో ఎన్టీయార్ మీద వచ్చిన శవపూజల ఆరోపణల తరువాత మళ్లీ ఇంతగా చర్చల్లోకి వచ్చింది హరీష్ రావే…

అప్పట్లో ఎన్టీయార్ మహా సిద్దులు, సంకల్పసిద్ది కోసం ఎవరో ఓ చోటా నటితో కలిసి తన ఆశ్రమంలో అర్ధరాత్రి ఏవో తాంత్రిక పూజలు, శవపూజలు చేశాడని అప్పట్లో విపరీత ప్రచారం జరిగింది, తనకు జ్యోతిష్యాలు, నమ్మకాలు చాలా ఎక్కువ… చివరకు తనకు వీరభోగవసంతరాయలు పుడతాడని కూడా నమ్మాడంటారు… దానిపైనా చాలా వార్తలొచ్చాయి, వాటినలా వదిలేస్తే…

ఏ సెలబ్రిటీ అయినా తమ సంకల్పసిద్ది కోసం, ఎదుగుదల కోసం, ప్రత్యర్థులపై విజయం కోసం హోమాలు, తాంత్రిక పూజలు చేస్తారు, పరిపాటే… కానీ రాష్ట్రం దెబ్బతినాలనీ, రైతులు అరిగోస పడాలని, తద్వారా ప్రత్యర్థి నాశనం కావాలని హరీష్ రావు తాంత్రిక పూజలు చేయించడం ఇదే తొలిసారి వినడం!

నిజమేనా అంటారా..? రాజకీయ ప్రచారాల్లో మైండ్ గేమ్స్ ఉంటాయి, బుదర జల్లడం ఉంటుంది… జరిగే ప్రచారాల్లో కొన్ని నిజాలు ఉండొచ్చు, నిరూపణ కావు… కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, కానీ అవి జనంలోకి వెళ్లడమే ప్రచారకర్తల వ్యూహం కావచ్చు… అప్పట్లో గొప్పగా ఆయుత చండీయాగం చేశాడు కేసీయార్, కాకపోతే ఏదో అపశృతి, ఏదో అపచారం కావచ్చు, చివరలో యాగశాల దహించుకుపోయింది…

అలాంటి కేసీయార్ చావు కోరుతూ, అంటే అనారోగ్యం కోరుతూ, తన క్యాంపు పెద్ద తలకాయ తాంత్రిక పూజలు చేయిస్తాడని కేసీయార్ బిడ్డ స్వయంగా ఆరోపించడం విశేషమే..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హరీష్ రావు క్షుద్ర పూజలు ఎవరిపై, ఎందుకు – కవిత ఇచ్చిన మరో ట్విస్టు !!
  • సోనియా ఆత్మకథకు బ్రేకులు – ప్రచురణకు పెంగ్విన్ వెనుకంజ !!
  • వానలో తడిసిన రాఖీ – వదలనంత బలంగా బిగుసుకుంటుంది !
  • బొద్దింక కాదు- విజయ్ బెటర్ అట… అప్పుడే దేశ్‌కీ నేత అయిపోయాడు !!
  • అయ్యా, దొరవారూ… స్వరాష్ట్ర పాలనలో ఇదా నీ దైత్య పాలన !!
  • జెన్ జీ ! దీన్ని కూడా ఓ తిట్టులా మార్చేసింది జబర్దస్త్ ! ఖర్మరా బాబూ !!
  • టాక్సిక్ డైలాగ్స్ ! ఇది తెలుగేనా..? ఓ ఆసక్తికరమైన చర్చ !!
  • ఓహ్.., బాబా రాందేవ్ వుమెన్ ఇన్నర్‌వేర్ కూడా అమ్ముతున్నాడా..?!
  • ఫుట్‌పాత్ ఎవరిది ? ఢిల్లీ హైకోర్టులో ఓ ఇంట్రస్టింగ్ కేసు – తీర్పు !
  • Toxic – ఎందుకు డిజాస్టర్ అయ్యిందో తెలుసా..? ఇదుగో ఇందుకు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions