.
జెన్ జీ వేరు- కాక్రోచ్ పార్టీ వేరు… రెంటినీ ఒకే గాటన కట్టడం తప్పు… జెన్ జీ అంటే ఒక ఏజ్ గ్రూపు, ఒక తరం… (జెనరేషన్ జెడ్)… 1997- 2012 నడుమ పుట్టిన పిల్లలు… సరే, విషయానికి వద్దాం…
ఈటీవీలో వచ్చే జబర్దస్త్ అనే ఓ కామెడీ షో కంటెంటులో ఎంత వెగటు, ఎంత రోత ఉంటుందో అందరికీ తెలుసు… ఎన్ని విమర్శలు వచ్చినా సరే అదలాగే కొనసాగుతూ ఉంటుంది… రోజా, నాగబాబు వంటి ప్రజాజీవితంలో ఉన్న నాయకులు సైతం అక్కడ జడ్జిగా ఉండీ, అలాంటి వెకిలితనాన్ని ఎంజాయ్ చేస్తూ, నవ్వుతూ, అదే హాస్యంగా చూపిస్తూ ఉంటారు… అదొక విషాదం…
Ads
నిజానికి జెమినిలో వస్తున్న మాస్ జాతర కామెడీ షో బాగుంటోంది… జానీ మాస్టర్, బిందు మాధవి, నవదీప్, దీపిక, సుప్రీత, యాదమరాజు తదితరులతో, చాలామంది కొత్త కొత్త ఆర్టిస్టులతో స్కిట్లు బాగానే ఉంటున్నాయి… సద్దాం ఈటీవీకి జంపయ్యాడు… ఐనా జబర్దస్త్ మాత్రం మారదు, మారడం లేదు… ఈమధ్య స్కిట్లలోకి పాత వాళ్లను, గెస్ట్ సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి నటింపజేస్తున్నారు… బేసిక్‌గా కంటెంటు మాత్రం అదే…
ఓ ప్రోమో కనిపించింది… అందులో చంటి ఉన్నాడు ఓ సీసా పట్టుకుని, దేవదాసు పేరడీ… సీత అని మరో టీవీ సెలబ్రిటీ (రెగ్యులర్ ఆర్టిస్టు కాదు) వస్తుంది… చంటి ఆవేశంతో మాట్లాడుతూ ప్రేమ అన్నావు, ఇష్క్ అన్నావు, నాన్నకు అనారోగ్యం అన్నావు, తల్లికి కేన్సర్ అన్నావు, నా డబ్బులు దొబ్బేశావు, తరువాత వదిలేశావు అంటూ… జెన్ జీ అంటాడు సీత వైపు అసయ్యంగా చూస్తూ… అంటే అది ఓ తిట్టులాగా…
అదీ చంటి స్కిట్ రాసిన ఎవరో మహానుభావుడి అవగాహన… జెన్ జీ అంటే మోసగాళ్లు, ద్రోహులు అనా వీళ్ల భావన..? అదేనా చెప్పదలుచుకున్నది… అదేదో మస్తు పంచ్ ఉన్న జోక్ అనుకుని రష్మి, నాగబాబు, ఇంద్రజ పకపకా నవ్వారు ఎప్పటిలాగే… వాళ్ల సోయి కూడా అంతే అన్నమాట…!!
Share this Article