.
Pardha Saradhi Potluri …. అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ CIA చీఫ్ రాంట్ క్లిఫ్ ( John Ratcliffe) రహస్యంగా మాస్కో సందర్శించాడు! 25-08-2026… దీనిపై ఊహగానాలు వెల్లువెత్తుతున్నాయి!
అమెరికన్ CIA డైరెక్టర్ విలియం బర్న్స్ ( William Burns ) మాస్కోకి వచ్చింది 2021 లో! ఆ తరువాత 2022 ఫిబ్రవరి 22 న పుతిన్ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్ మీద సైనిక చర్యకి ఆదేశాలు ఇచ్చాడు!
Ads
మొన్న అంటే 25 ఆగస్ట్ న జాన్ క్లిఫ్ మాస్కోకి వచ్చి వెళ్ళాడు! CIA డైరెక్టర్ విదేశాలకి వెళ్ళేది గల్ఫ్ స్ట్రీమ్ (Gulf Stream ) ఎగ్జిక్యూటివ్ జెట్ లో! కానీ జాన్ క్లిఫ్ మాత్రం మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం అయిన C-17 Globemaster III లో మాస్కో వచ్చాడు.
అంత పెద్ద మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానంలో ఎందుకొచ్చినట్లు?
C-17 Globemaster III లో రావడానికి కారణం హై సెక్యూరిటీ ఏక్విప్మెంట్, కమ్యూనికేషన్ వ్యవస్థని అమర్చడానికి కావాల్సినంత స్పేస్ ఉంటుంది కాబట్టి. అదే గల్ఫ్ స్ట్రీమ్ ఎగ్జిక్యూటివ్ జెట్ లో అయితే అంత స్థలం ఉండదు! ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా మాస్కో రావడానికి అంత పెద్ద విమానం అక్కరలేదు కానీ జాన్ రాట్ క్లిఫ్ తో పాటు పదుల సంఖ్యలో ఇతర CIA అధికారులు, డిప్లొమాట్స్ కూడా వచ్చారు!
కేవలం అమెరికన్ మిలిటరీకి చెందిన హై రాంకింగ్ అధికారులు వాడే ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ వ్యవస్థ అయిన సిల్వర్ ఈగల్ కమ్యూనికేషన్ పాడ్ ( Silver Eagle Communication Pod ) ని అమర్చారు C-17 Globemaster III కి. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థతో నేరుగా పెంటగన్ , వైట్ హౌస్ తో మాట్లాడవచ్చు ప్రయాణించేటపుడు!
So ! ఏదో అత్యంత ప్రముఖమైన విషయం మీద మాట్లాడడానికే మాస్కో వచ్చాడు రాట్ క్లిఫ్!
దాదాపుగా 8 గంటల పాటు రష్యన్ ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపి తిరిగి వెళ్లిపోయారు!
పుతిన్ నేరుగా ఎవరితోనూ కలవడు! భారత్ కి చెందిన NSA అజిత్ దోవల్, జైశంకర్ తో మాత్రమే నేరుగా కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడతాడు! మిగతా దేశాల NSA లు లేదా విదేశాంగ మంత్రులు సంబంధిత అధికారులతో కలిసి వెళతారు!
C-17 గ్లోబ్ మాస్టర్ మొదట వాషింగ్టన్ DC కి పది మైళ్ళ దూరంలో ఉన్న మేరీ ల్యాండ్ లోని ఆండ్రు జాయింట్ బేస్ ( Joint Base Andrew )నుండి బయలుదేరి, మధ్యలో లాత్వియా దేశంలోని రిగా (Riga ) ఎయిర్ పోర్ట్ లో ఆగి, అక్కడి నుండి మాస్కో లోని Vnukovo ఎయిర్ పోర్టులో లాండ్ అయ్యింది!
మొత్తం ఎంతమంది అమెరికా నుండి వచ్చారో వివరాలు బయటికి రాలేదు కానీ దాదాపుగా 30 మంది CIA, ఇతర హై ర్యాంకింగ్ అధికారులు వచ్చి ఉండవచ్చు. ఎందుకంటే సిల్వర్ ఈగిల్ కమ్యూనికేషన్ పాడ్ అమర్చారు అంటే సీనియర్ హై ర్యాంకింగ్ అధికారులు ప్రయాణిస్తేనే అలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థని అమర్చుతారు!

స్పెక్యూలేషన్స్!
CIA డైరెక్టర్ మాస్కో పర్యటన మీద చాలా రకాలైన ఊహగానాలు చేస్తున్నారు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు! వాటిలో లాజిక్ కి నిలబడగలిగే వాటిని చూద్దాం!
1.పుతిన్ నేరుగా ఏదీ అడగడు. అవతలి పక్షం నుండి ఏవన్నా ఆఫర్స్ వస్తే వాటిలో తన దేశానికి అను కూలమైన వాటిని అంగీకరిస్తాడు. అదీ తనకు తానుగా నేరుగా చెప్పడు, అధికారుల ద్వారా తన అంగీకారాన్ని తెలియచేస్తాడు.
2.రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యి ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది కానీ ఎటూ తేలట్లేదు! రెండు దేశాల మధ్య సంధి కుదర్చడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ తగ్గట్లేదు!
3.ఇటీవలే టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో పెంటగన్ అధికారులు కలిసి ట్రంప్ సందేశం అంటూ మాస్కో మీద దాడులు చేయవద్దని కోరగా, దానికి జెలెన్ స్కీ అంగీకరించినా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
4.గత నెల రోజులుగా పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద అణు దాడి చేయబోతున్నాడు అని పుకార్లు చెలామణిలో ఉన్నాయి.
5. రష్యా దగ్గర పొసేడోన్ ( Poseidon ) అనే అండర్ వాటర్ న్యూక్లియర్ పవర్ తో నడిచే అణు బాంబుని ప్రయోగించగల డ్రోన్ ఉంది. దీనిని సబ్ మెరైన్ ద్వారా ప్రయోగించవచ్చు. ఈ పొసేడోన్ అండర్ వాటర్ డ్రోన్ అణుశక్తితో నడుస్తూ, అదే అణు రియాక్టర్ ని బాంబుగా వాడి పరిమిత ప్రదేశంలో అణు ధార్మిక శక్తిని విడుదల చేస్తుంది. దీనిని ఉక్రెయిన్ రాజధాని కీవ్ ని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు! ఒక్క డ్రోన్ తో కీవ్ ని నివాసయోగ్యంగా వీలుకాని ప్రదేశంగా చేయగలదు!
6.పొసేడోన్ అండర్ వాటర్ నూక్లియర్ డ్రోన్ ని కీవ్ మీద ప్రయోగించే విషయంలో నిజం ఉండవచ్చు. ఎందుకంటే షెడ్యూల్ లో లేని జైశంకర్ మాస్కో పర్యటనకి కారణం పుతిన్ న్యూక్లియర్ వెపన్ ని ప్రయోగించబోతున్నాడనే! జైశంకర్ మోడీ సందేశాన్ని తీసుకెళ్లారు మాస్కోకి! న్యూక్లియర్ వెపన్ వాడితే ప్రపంచ దేశాలతో పాటు భారత్ కూడా రష్యాని దూరం పెట్టాల్సి రావొచ్చు అనేదే మోడీ సందేశం.
పొసేడోన్ ( Poseidon ) అంత ప్రమాదకరమైనదా?
పొసేడోన్ అండర్ వాటర్ డ్రోన్ అనేది సబ్ సానిక్ వేగంతో ( 900 kmph ) ప్రయాణిస్తుంది కాబట్టి సాధారణ AK -47 రైఫిల్ తో కూడా పేల్చేయవచ్చు.
కానీ పొసేడోన్ డ్రోన్ ని ఎలా డిజైన్ చేశారు అంటే నూక్లియర్ బాంబుని డిటోనేట్ చేయాలి అంటే ప్రత్యేకమైన ట్రిగ్గర్ కావాలి. కానీ దీనిలో ప్రెజర్ సెన్సార్స్ ని అమర్చి డ్రోన్ కి ఏ మాత్రం ఒత్తిడి కలిగినా వెంటనే సెన్సర్స్ నూక్లియర్ ట్రిగ్గర్ ని యాక్టివేట్ చేస్తుంది అణు విస్ఫోటనం జరిగిపోతుంది!
దారిలో ఉండగా పేల్చేయాలని చూసినా లేదా అలా వదిలేసినా అణు విస్ఫోటనం తప్పదు!
నిర్మానుష్య ప్రాంతంలో పేలిస్తే కొంతలో కొంత జన నష్టం తగ్గుతుంది తప్పితే ఆ ప్రాంతానికి 50 km పరిధిలో నివాసయోగ్యం కానిదిగా ప్రకటించాల్సి ఉంటుంది!
పెసోడోన్ ని డిజైన్ చేసింది 50 నుండి 60 km పరిధిలో రేడియోధార్మికతని వ్యాపింపచేయడానికి మాత్రమే! ఇందులో 20 km పరిధిలో అణు ధార్మికత ఎక్కువగా ఉంటుంది.
పేసెడోన్ (Poseidon ) డ్రోన్ అనేది టాక్టికల్ నూక్లియర్ క్రూయిజ్ మిసైల్ కి వేరే రూపం అండర్ వాటర్ క్రూయిజ్ మిసైల్ అన్నమాట!
టాక్టికల్ నూక్లియర్ వెపన్ ( Tactical Nuclear Weapon ) అనేది ఒక నిర్దేశిత ప్రాంతానికే అంటే మిలిటరీ స్థావరాలు ఉన్న చోట ప్రయోగిస్తారు. సాధారణంగా ఒక కిలో టన్ నుండి 50 కిలో టన్ల మధ్య పేలుడు పదార్ధం ఉంటుంది.
స్ట్రాటజిక్ నూక్లియర్ వెపన్ ( Strategic Nuclear Weapon ) మొత్తం దేశాన్ని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. 100 కిలోటన్ ల నుండి 200 కిలోటన్ ల వరకూ పేలుడు పదార్ధం ఉంటుంది. జపాన్ లోని హీరోషిమా, నాగసాకి పట్టణాల మీద అమెరికా ప్రయోగించిన లిటిల్ బాయ్ బాంబు 150 కోలోటన్ ల పేలుడు పదార్ధం కలిగివుంది.
7.అమెరికా మొదలు పెట్టిన ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని అమెరికా మధ్యలో వదిలేసి ఆ భారాన్ని యూరోపు మీదకి వదిలేసింది.
8.డెమోక్రాట్స్ ముఖ్యంగా జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ కి ఉక్రెయిన్ లో చమురు, సహజ వాయువు వ్యాపారాలు ఉన్నాయి. ఉక్రెయిన్ ని NATO లో భాగస్వామిని చేయడానికి చేస్తున్న కుట్రని ఎదుర్కోవడానికే పుతిన్ ఉక్రెయిన్ మీద దాడి మొదలు పెట్టాడు.
9. జెలెన్ స్కీని ఉక్రెయిన్ అధ్యక్షుడిగా చేయడానికి కారణం జెఫ్రీ ఎప్స్టీన్ తో సన్నిహిత సంబంధాలు ఉండడమే!
10. జెలెన్ స్కీకి జెఫ్రీ ఎప్స్టీన్ తో సన్నిహిత సంబంధాలు ఎంతలా ఉండేవి అంటే జెలెన్ స్కీ ఉక్రెయిన్ నుండి మైనర్ బాలికలని ఎప్స్టీన్ కి సరఫరా చేసేవాడు.
11.జెఫ్రీ ఎప్స్టైన్ కి చిన్న పిల్లలని సరఫరా చేసిన దేశాలలో ఉక్రెయిన్ మొదటి స్థానంలో ఉండగా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ దేశాలు తరువాతి వరుసలో ఉన్నాయి.
ఇంతకీ అమెరికన్ ఇంటెలిజెన్స్ చీఫ్ తెచ్చిన సందేశం ఏమిటి? మీరు NATO దేశం మీద దాడి చేస్తే నాటో ఆర్టికల్ 5 ఆటోమాటిక్ గా యాక్టివేట్ అవుతుంది. అప్పుడు అమెరికా కూడా యూరోప్ తో కలిసి మీతో యుద్ధం చేయాల్సి వస్తుంది అనే హెచ్చరికతో జాన్ రాట్ క్లిఫ్ పుతిన్ కి నచ్చచెప్పడానికి వచ్చాడు!
మరి ఇదే సందేశం బ్రిటన్ కి ఎందుకు ఇవ్వలేదు అమెరికా? గత జులై లో బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన కీర్ స్టార్మర్ అమెరికాకి వ్యతిరేకంగా పనిచేసాడు!
గత జులై 20న ఆండీ బుర్హామ్ ( Andy Burnham ) ఇరాన్ మీద దాడి చేయడానికి ఎయిర్ బేస్ లని వాడుకోవడానికి అనుమతి ఇచ్చాడు!
ఆండీ మరో గొప్ప పని కూడా చేశాడు. స్ట్రామ్ షాడో క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీని ఉక్రెయిన్ కి ఇచ్చి ఉక్రెయిన్ లోనే మిసైల్స్ తయారుచేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు!
జెలెన్ స్కీ తమ ఫ్లెమింగో ఆంటీ షిప్ క్రూయిజ్ మిసైల్ టెక్నాలజీని బ్రిటన్ కి ఇచ్చాడు!
పుతిన్ పెసోడోన్ నూక్లియర్ డ్రోన్ ని కీవ్ మీద ప్రయోగించడానికి సిద్ధం అవడానికి కారణం ఇదే!
నిజంగా యుద్ధం ఆపాలానే ఉద్దేశ్యం ఉంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బ్రిటన్ ప్రధానిని స్ట్రామ్ షాడో మీసైల్ టెక్నాలజీ ట్రాన్ఫర్ ని ఉక్రెయిన్ కి ఇవ్వకుండా ఆపేసి ఉండాల్సింది కదా?
2021 లో అప్పటి CIA డైరెక్టర్ విలియమ్ బర్న్స్ రాయబారం కోసం మాస్కో వచ్చి వెళ్లిన మూడు నెలలకే ఉక్రెయిన్ మీద దాడి మొదలుపెట్టాడు పుతిన్ !
ఇప్పుడు CIA డైరెక్టర్ జాన్ రాట్ క్లిఫ్ వచ్చి వెళ్ళాడు! ఈ సారి బ్రిటన్ మీద దాడి చేస్తాడేమో?

పుతిన్ ఉత్తర కొరియా నుండి 50,000 మంది సైనికులని రిక్రూట్ చేసుకున్నాడు ఫ్రంట్ లైన్ లో మొహరించడానికి!
మరో వైపు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 150 అండర్ గ్రౌండ్ ఫాక్టరీలని పెట్టి 24 గంటలు పనిచేయిస్తున్నాడు రష్యా కోసం. 155 MM ట్యాంక్ షెల్స్ తో పాటు క్రూయిజ్ మిసైల్స్ అసెంబ్లింగ్ జరుగుతున్నాయి ఉత్తర కొరియాలో!
రష్యా ఉక్రెయిన్ యుద్ధం చివరి దశకి చేరుకున్నది!
అయిదేళ్ల నుండి ఉక్రెయిన్ పోరాడుతున్నది అంటే అనధికారికంగా NATO మెంబర్ గా ఉన్నట్లు కాదా? వచ్చే సెప్టెంబర్ లో పుతిన్ అణు దాడి చేస్తాడు! అది బ్రిటన్ మీదనా లేక కీవ్ మీదనా అనేది తెలియదు!
Share this Article