ఆమధ్య ముగిసిన ఐండియన్ ఐడల్ సింగింగ్ కంపిటీషన్ ఆహా ఓటీటీలో సూపర్ హిట్… నిత్యా మేనన్ బదులు సెకండ్ సీజన్‌లో గీతామాధురిని తీసుకున్నారు గానీ తిక్క తిక్క జడ్జిమెంట్లతో ప్రేక్షకులను పిచ్చెక్కించింది ఆమె… హోస్ట్‌గా రామచంద్ర బదులు హేమచంద్రను తీసుకున్నారు… వోకే, పెద్ద ఫరక్ పడలేదు… ఇక అదే కార్తీక్, అదే తమన్, ఎవరో ఒక గెస్టు…
కంటెస్టెంట్ల ఎంపిక బాగుంటుంది, పాటల ఎంపిక బాగుంటుంది కాబట్టి ఆ షో రక్తికట్టింది… జీతెలుగులో అప్పట్లో అదేదో సరిగమప సీజన్ 13 అని షో రన్ చేశారు గానీ… అది సింగింగ్ కంపిటీషన్‌కన్నా యాంకర్ ప్రదీప్ పుణ్యమాని కామెడీ షో అయిపోయింది… దామిని, దీపు, హారిక, రేవంత్, పృథ్వి, రఘురాం, సాకేత్, సోని, సందీప్… బోలెడు మంది మెంటార్లు… కోటి, శైలజ, చంద్రబోస్, కల్పన, సునీత ఎట్సెట్రా జడ్జిలు… తరువాత కొన్నాళ్లకు సీజన్ 14…
ప్రదీప్ బదులు హైపిచ్చి కేకల శ్రీముఖిని హోస్ట్ చేశారు… అదే కోటి, అదే శైలజ జడ్జిలు… కానీ చంద్రబోస్ బదులు అనంత శ్రీరాం, సింగర్ స్మితలను పట్టుకొచ్చారు… నలుగురు మెంటార్లు… సాకేత్, గీత, శ్రీకృష్ణ, రేవంత్… ఇదీ పెద్దగా రక్తకట్టలేదు… పైగా మెంటార్లు, జడ్జిలు అందరూ జబర్దస్త్ ప్రోగ్రామ్ అనుకున్నారు… ఒక్క ఎస్పీ శైలజ మాత్రమే కాస్త హుందాగా వ్యవహరించింది… అనంత శ్రీరాం అయితే అచ్చంగా ఓ కమెడియన్‌లా మారిపోయాడు…
Ads
ఈటీవీ పాడుతా తీయగా, స్వరాభిషేకం క్వాలిటీ ఘోరంగా పడిపోయినా సరే… హుందాగా, పద్ధతిగా సాగుతుంటయ్… ఇక 2024 సరిగమప భిన్నంగా నిర్వహించాలనుకున్న జీతెలుగు మళ్లీ ప్రదీప్‌ను హోస్ట్‌గా పెట్టుకుంది… ఆడిషన్స్ కూడా ప్రకటించారు, కానీ ఏమైందో మరి… అదే కోటి, అదే శైలజ, అదే అనంతశ్రీరాం, అదే స్మిత జడ్జెస్… మెంటార్లుగా అదే శ్రీకృష్ణ, అదే రేవంత్, అదే గీత, అదే సాకేత్ ప్రమోషన్ పోస్టర్‌లో కనిపిస్తున్నారు కానీ టెక్స్ట్‌లో జడ్జిలుగా మాత్రం హిమేష్ రేషమ్మియా, విశాల్ దడ్లాని, శంకర్ మహదేవన్ పేర్లు కనిపిస్తున్నాయి… ఇదేమిటో మరి… వీరిలో విశాల్, హిమేష్ ఇండియన్ ఐడల్ జడ్జిలు…
సరే, ప్రస్తుతం మాటీవీ 23 నుంచి సూపర్ సింగర్ షో స్టార్ట్ చేయబోతోంది… జీ సరిగమపలో ఉండాల్సిన అనంత శ్రీరాం ఈ ప్రమోషన్ వీడియోల్లో కనిపిస్తున్నాడు… మరి జీ వాళ్లు సరిగమప నుంచి తప్పుకున్నట్టేనా..? తనకుతోడు సింగర్ మంగ్లి, రాహుల్ సిప్లిగంజ్, శ్వేత మోహన్ జడ్జిలు అట… పర్లేదు… అనంత శ్రీరాం కామెడీ వేషాలు వేయకుండా చూసుకుంటే బెటర్… కాకపోతే దీనికి హోస్ట్ శ్రీముఖి… జీ నుంచి మా టీవీకి జంప్ అన్నమాట… టీం మాత్రం ఇంట్రస్టింగ్‌గా ఉంది… ఐనా ఎన్నాళ్లు చూస్తారండీ స్మిత, శైలజ, కోటి, చంద్రబోస్ ఇలా… ఈ టీం కాస్త భిన్నంగా కనిపిస్తోంది… అప్‌కోర్స్, ఇది జీతెలుగు కాదు, స్టార్‌మా…
బట్, మ్యూజిక్ ప్రియుల నిరీక్షణ మాత్రం మళ్లీ ఇండియన్ ఐడల్ తెలుగు షో కోసమే… కాకపోతే ఆహా ఓటీటీ నుంచి ఏ అప్‌డేట్ లేదు ఇప్పటికి… అదే తమన్, అదే కార్తీక్ తప్పనిసరి… అదే ఆర్కెస్ట్రా టీం… కాకపోతే హోస్ట్, లేడీ జడ్జి మారతారేమో… మారాలి కూడా…!!
Share this Article