సరే, ఎవరమూ అంకుల్ శామ్ పిట్రోడాకు చెప్పబోం, అధీర్ రంజన్ చౌదరికి అసలే చెప్పబోం కానీ ఏమిటది అంటారా..? డెయిలీ రికార్డ్, ది మిర్రర్ అనే అమెరికన్ మీడియా సైట్లలో కనిపించింది… ది హోబిట్ అని చరిత్రకారులు (ఆంత్రపాలజిస్టులు) ముద్దుగా పిలిచే హోమో ఫ్లోర్‌సైన్సిస్ అనే ఆదిమ జాతి మనుషులు ఇంకా ఈ భూమ్మీద కనిపించే చాన్సెస్ ఉన్నాయట… వాళ్లు మూడు ఫీట్ల 6 అంగుళాల ఎత్తు ఉండేవాళ్లు…
కోతులు- చింపాంజీలకూ మనుషులకూ నడుమ పరిణామ దశ జాతి (ఏప్ మ్యాన్) కావచ్చు బహుశా… 60 వేల నుంచి 7 లక్షల ఏళ్ల క్రితం నాటి మానవ పూర్వ జాతి… నో, నో, పూర్వ జాతి ఏమీ కాదు, మానవజాతే… అందుకే ఈ వార్త చదవగానే అంకుల్ శామ్ పిట్రోడా ‘అవునవును, సౌత్ ఇండియాలో, పర్టిక్యులర్‌గా దండకారణ్యంలో ఇప్పటికీ ఉన్నారు, మరీ పర్టిక్యులర్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంటారు’ అనే ప్రమాదం కూడా ఉంది…
Ads
చూశారా, మా చంద్రబాబు వంటి ప్రచండ మేధావులు పుట్టిన తెలుగుజాతిని కాంగ్రెసోళ్లు ఎలా అవమానిస్తున్నారో అని మళ్లీ మోడీ తిట్టే ప్రమాదమూ ఉంది… ఇంకా పోలింగ్ దశలున్నాయి కదా… ఏదీ వదలడం లేదాయన… అవమానకరం అని ఎందుకు అంటున్నామంటే సదరు హోమో ఫ్లోర్‌సైన్సిస్ జాతి మనుషులకు చిన్న మెదళ్లు, పెద్ద పాదాలు ఉంటాయట… కానీ ఆ సైంటిస్టులే చెబుతున్నారు… ప్రస్తుతం ఫ్లోర్స్ అని పిలవబడే ఇండొనేషియా ప్రాంతంలో నివసించి ఉంటారని…
కానీ అక్కడికి ఎక్కడి నుంచి వచ్చారో మాత్రం ఊహించలేకపోతున్నారట… అదుగో అక్కడ దొరికిపోతాం మనం కాంగ్రెస్ పెద్ద బుర్రలకు..!
అల్‌బెర్టా యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ బోఫిన్ ఏమంటాడంటే… ‘‘ఫలానా సంవత్సరాల్లో వీళ్ల ఉనికి ఉండేది, ఈ కాలంలో అంతరించింది అని చెప్పేవాళ్లు లేరు, నిజానికి వాళ్లు ఇంకా ఈ విశ్వంలో ఎక్కడో ఉండే ఉంటారు’’… కావచ్చు, మనుషులు ఉండీ మన నాగరిక (?) సమూహాలు ప్రవేశించని చాలా ద్వీపాలున్నయ్ కదా… ఉదాహరణకు మన అండమాన్, నికోబార్ దీవుల్లోని సెంటినలీస్…
సరే, ఆయన వాదనతో విభేదించేవాళ్లూ బోలెడు మంది… 1984 నుంచి ఇండొనేషియాలోని ఫ్లోర్స్ ద్వీపాల్లో పరిశోధనలు సాగిస్తున్న ఆంత్రపాలజిస్టులు ఏమంటారంటే..? ‘‘చిన్నగా, దట్టమైన వెంట్రుకలతో, దాదాపు జంతువుల్లాగే తిరిగే మనషుల గురించి ఇప్పటికీ బోలెడు కథలున్నయ్ ఆ ప్రాంతాల్లో… వాళ్లను లియోలు అని పిలుస్తారు లోకల్స్…
Share this Article