.
సినిమాలు బాగా లేవని టాక్ వచ్చిందంటే ఇక అదంతే… తరువాత నాలుక కర్చుకుని, సినిమాలో కొన్ని కత్తిరించి, కొన్ని యాడ్ చేసి, ఎన్ని కాస్మొటిక్ మార్పులు చేసినా సరే, ఇక ఎవడూ చూడడు… కథలో, కథనంలో దమ్ములేకపోతే, విసిగిస్తే… దాన్ని ఎన్ని భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేసినా ఎవడూ పట్టించుకోడు…
అదంతా వృథా ప్రయాస… నెగెటివ్ పోస్టులకు లీగల్ నోటీసులు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు తమ సరుకు నాణ్యత మీద ఉంటే బాగుండేది… అదేనండీ, టాక్సిక్ సినిమా నిర్మాణ సంస్థ గురించే… ప్రేక్షకుల మీద, రివ్యూయర్ల మీద ఏడుపులతో ఏం లాభం..? భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పరిధిలో, సినిమాపై అభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కు ఉంది ప్రేక్షకులకు!
Ads
అంతేకాదు, మార్కెట్‌లోకి వచ్చిన సరుకు నాణ్యత, ధర మీద అభిప్రాయం చెబితే, అది మరికొంత మందినీ నష్టం నుంచి కాపాడినట్టు అవుతుంది కూడా… ఖచ్చితంగా టాక్సిక్ ఓ ‘టాక్సిక్ సినిమా’… దర్శకురాలికీ, హీరోకు, నిర్మాతకూ ఎవరికీ ఏ సోయి లేదు… ఐదుగురు తారల్ని బెట్టగానే జనం పరుగెత్తుకు రావాలా థియేటర్లకు… వాటి దోపిడీకి జేబులు, పర్సులు అప్పగించేయాలా..?
ఒక ఇరుముడి… ఒక హనుమాన్ అంశ్… ప్రజెంట్ ట్రెండ్… హనుమాన్ అంశ్ కోటిన్నర పెడితే 100 కోట్లు కొట్టింది ఇప్పటికే, స్టిల్ రన్నింగ్ ఆ రెండు మూవీస్… ఇప్పటికిప్పుడు కేజీఎఫ్-3, పుష్ప-3 పాత వాటి తరహాలోనే తీస్తే… టాక్సిక్ ఫలితమే రావచ్చు, పాపం శమించుగాక… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే..?
ఎండిపోయిన టాక్సిక్ పంట చేల నుంచి పరిగె ఏరుకోవడానికి దాని ఇంగ్లిష్ వెర్షన్ రిలీజ్ చేశారు… ఏమైంది, మరింత భీకరమైన డిజాస్టర్… ఎక్కడో చదివాను… తేడా ఏమిట్రా అంటే, భాష మారింది, 18 నిమిషాలు ట్రిమ్ చేశారట, అంతే… ఆల్రెడీ విపరీతమైన నెగెటివ్ టాక్ ఉన్న సినిమాను ఏ భాషలో చూస్తేనేం, అదే తలనొప్పి కదా…
ట్రేడ్ టాక్ ప్రకారం… దేశం మొత్తం మీద చాలా పరిమిత షోలలో కేవలం నాలుగు వందల యాభై టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయట… అంటే వసూళ్లు చూసుకుంటే లక్షన్నర కూడా దాటి ఉండదు…. ఇదే నిజమైతే పెద్ద షాకే… అంటే నిర్మాతల ఆలోచనధోరణిలోనే భారీ తేడా ఉందని అర్థం…
నిజానికి హాలీవుడ్ వెర్షన్ దేనికి..? ఆస్కార్ మీద ఆశతోనా..? రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు చేసినట్టు లాబీయింగ్ చేసి, ఖర్చు పెడితే ఏదో ఒక విభాగంలో ఆస్కార్ తగలకపోదు అనే ఆశతోనేనా..? యశ్ కాబట్టి కన్నడంలో కాస్తోకూస్తో ఆడుతోంది… మిగతా భాషల్లో ఢమాల్…
జనం తిరస్కరించడమే పెద్ద నేరం అయినట్టు శాండల్‌వుడ్ పెద్ద తలకాయలు నీతులు బోధిస్తున్నాయి.,. కానీ వాళ్లు మరిచిపోతున్న నిజం ఒకటుంది… ప్రేక్షకుడిదే అంతిమ తీర్పు, వాడే న్యాయమూర్తి అని…!!
Share this Article