Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు- వైవిధ్యం తక్కువ ! తెలిసిన మొహాలూ తక్కువ !

September 5, 2026 by M S R

.

రేపే కదా బిగ్‌బాస్ 10 వ సీజన్ స్టార్ట్… ఇన్నిరోజులూ అందరూ ఇదుగో తను హౌజులోకి వెళ్తున్నాడు, ఇదుగో ఈమె వెళ్తోంది అని ఊహాగానాలు రాస్తూ వచ్చారు… బోలెడు యూట్యూబ్ వీడియోలు కూడా..,. కానీ నిజం చెప్పాలంటే ఈసారి  బిగ్‌‌బాస్ టీమ్ మంచి గోప్యతను పాటించింది… ఇదే సీక్రెసీని ఎలిమినేషన్ల విషయంలోనూ పాటిస్తే ఆట రక్తికడుతుంది…

కానీ కంటెస్టెంట్ల ఎంపికే కాస్త పూర్ అనిపిస్తోంది… పేరున్న సెలబ్రిటీస్ ఎవరూ లేరు.., ఈసారి కూడా అగ్నిపరీక్ష పేరిట పిచ్చి పిచ్చి టాస్కులు చేయించి బిందుమాధవి, అభిజిత్, నవదీప్, శ్రీముఖి ఆరుగురిని వడబోతలో తేల్చారు… మరో ఇద్దరిని రిజర్వ్‌లో ఉంటారట… అవసరాన్ని బట్టి ప్రవేశపెడతారు…

Ads

వీరిలో ప్రామిసింగ్ అనిపిస్తున్నది సింగర్ ఝాన్సీ… తను పాటగత్తె మాత్రమే కాదు, స్వయంగా రైతు… మాంచి వాగ్దాటి ఉంది… ప్లజెంట్ అప్పియరెన్స్… అగ్నిపరీక్ష టీమ్ ఆమెకు అందరికన్నా ముందు బిగ్‌బాస్ టికెట్ ఇచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… మరి మిగతా వారు..?

జబర్దస్త్ నుంచి ఏకంగా ఇద్దరు ఒకేసారి… ఇద్దరూ కమెడియన్లే… ఒకరు ఆటో రాంప్రసాద్, స్పాంటేనియస్‌గా పంచ్‌లు విసరగలడు… అవినాష్, ఇమాన్యుయెల్ తరహాలో హౌజులో వినోదం పంచగలడు, తోడుగా పొట్టి నరేష్… పర్లేదు… కొన్నాళ్లు ఉంటాడు… టీవీ షోలతో పేరు తెచ్చుకున్న వర్షిణి సౌందర్‌రాజన్ కూడా పర్లేదు, గ్లామర్ స్పేస్ ఫిల్ చేయగలదు..,

అజిత్ ఈశ్వరన్… తెలుగు ప్రేక్షకులకు ఎందరికి తెలుసు? ప్రశ్న..! రోహిత్… నాగార్జున స్వయంగా చెప్పి, ఏవీ వేస్తే ఏమైనా గుర్తుపట్టగలమేమో, తెలుసుకోగలమేమో… తరువాత అప్పట్లో కొన్ని సినిమాలు చేసిన హీరో కృష్ణుడు… ఆఫ్ స్క్రీన్ తన గురించి ఎవరికీ ఏమీ తెలియదు… పెద్దగా ప్రచార తెర మీద కూడా కనిపించడు… టాస్కులు, గేమ్స్ విషయంలో చూడాలిక…

శాలిని… తెలియదు… ముఖేష్ గౌడ, టెంపర్ వంశీ, శ్రష్టి వ్యాకరణం, ఆర్‌జే చరణ్, డెబ్ జానీ, చైత్రా రాయ్, నవరసాలు ఆర్కే, సుధీర్ రెడ్డి…. మరో ఇద్దరు కామనర్స్ ను పంపించాలి అనుకుంటే అమన్ దీపక్, రాజకుమారి కావచ్చు…

చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు… టీవీలు, రీల్స్, షార్ట్స్ గ్యాంగులే అన్నీ దాదాపుగా… భిన్న రంగాలకు సంబంధించిన వారిని ట్రై చేస్తే హౌజ్ వైవిధ్యంగా ఉండేది… కానీ అలా ఆలోచిస్తే అది బిగ్‌ బాస్ టీమ్ ఎందుకు అవుతుంది..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈసారి బిగ్‌బాస్ ఎంపికలు- వైవిధ్యం తక్కువ ! తెలిసిన మొహాలూ తక్కువ !
  • ఉండవల్లి అంటే ఉడుంపట్టు ! కానీ పోరాటమార్గాలు ఏం మిగిలాయి !?
  • అమెరికా ఆధిపత్యానికి అంతిమరోజులు – చైనా నోస్ట్రడామస్ జోస్యం
  • పాపం టాక్సిక్ – ఈ హాలీవుడ్ అద్దకం మరింత వికటించింది !
  • ఈ సినిమా తరువాత ‘రష్మి’ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించినట్టు లేదు!!
  • ఉచ్చకు హిమాలయాలే కరిగిపోతున్నాయట! ఓ స్టడీ చెబుతోంది!!
  • కీలకాంశాల్లోనూ కేసీయార్ వాయిస్‌లో లోపించిన విజ్ఞత!
  • ఎంతగా బుర్ర చించుకున్నా- ఈ హోదా ఏమిటో అర్థం కాలేదు !!
  • ప్రతి లిక్కరూ విస్కీ కాదు – ప్రతి మద్యానికీ ఓ కథ ఉంది
  • గుండు గీకే ప్రోగ్రామ్ వద్దులే అమ్మాయ్… సినిమా సోసో, నువ్వు పాస్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions