Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎవరు ఈ మూర్తి..? ఏమిటి ఈ వెలి..? ఇదేం జర్నలిజం..?

November 25, 2026 by M S R

.

మనం ఏ ప్రపంచంలో ఉన్నాం..? దీన్ని జర్నలిజం అందామా..? ఫిలిమ్ జర్నలిజం అంటే అన్నింటికీ అతీతమైన ఓ రాజ్యాంగేతర శక్తా..? సిండికేటా..? సినిమా ఇండస్ట్రీ మొత్తం దాసోహం అని సాగిలబడాలా..?

… ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే..? గతంలో గ్రేటాంధ్రలో పనిచేసిన మూర్తి అనే జర్నలిస్టును ఫిలిమ్ జర్నలిస్టుల అసోసియేషన్ వెలివేసిందట… అనగా తనపై బ్యాన్ విధించిందట… అంటే ఏమిటి..? తనకు ఎవరైనా సినిమా వాళ్లు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, సినిమా ఫంక్షన్లకు పిలవకూడదు..?

Ads

ఇక్కడ కొన్ని ప్రశ్నలు… అసలు నేను ఆ అసోసియేషన్‌లోనే లేను అంటున్నాడు సదరు మూర్తి… (గతంలో తను కూడా ఈ అసోసియేషన్‌లో ఇదే ధోరణితో ఉండేవాడు…) మరి అసోసియేషన్‌లో లేని సభ్యుడిని అసోసియేషన్ ఎలా వెలివేస్తుంది..? లేదా ఎలా బ్యాన్ విధిస్తుంది..?

గతంలో ఓసారి ఇదే మూర్తిపై బ్యాన్ పెట్టారు… కారణం, వేణుస్వామిని ఇంటర్వ్యూ చేయడం! తరువాత సద్దుమణిగింది, మళ్లీ ఇప్పుడు మొదలు… అసలు వేణుస్వామి సినిమా పర్సనాలిటీయే కాదు, ఐనా ఎవరిని ఇంటర్వ్యూ చేయాలి, ఏ వార్తలు కవర్ చేయాలనేది సదరు జర్నలిస్టుతో పనిచేయించుకునే సంస్థ ఇష్టం… ఆ అసైన్‌మెంట్ పూర్తి చేయాల్సిందే, లేదు, మా అసోసియేషన్ బ్యాన్ పెట్టింది అని ఎలా వదిలేస్తారు..?

సపోజ్, ఒక నిర్మాత ఇప్పుడు మూర్తికి ఇంటర్వ్యూ ఇచ్చాడు, ప్రెస్‌మీట్‌కు పిలిచాడు అనుకుందాం… సదరు నిర్మాతను, తన సినిమాలనూ ఈ అసోసియేషన్ వెలివేస్తుందా..? అప్పుడు ఆ నిర్మాత ఈ ‘కవర్ల కవరేజీ’  జంఝాటం, బ్లాక్ మెయిల్ వ్యవహారాలు ఎందుకులే అనుకుని పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చుకుంటాడు… అప్పుడు ఈ అసోసియేషన్ ఏం చేస్తుంది..? ఆ యాడ్స్ ఇచ్చేటప్పుడు చైతన్య, నారాయణ సంస్థల్లాగే నెగెటివ్ వార్తలు రావద్దని ఆంక్షలు- షరతులు పెట్టాడని అనుకుందాం… అప్పుడు వీళ్లు ఏం నెగెటివ్ వార్తలు రాసి, ఏం చెడగొట్టగలరు..?

అసలు ఇలా వ్యక్తుల మీద, సంస్థల మీద బ్యాన్లు పెట్టే అధికారం ఏమిటి..? ఈ సిండికేట్ వ్యవహారం ఏమిటి..? మా, ఫిలిమ్ ఛాంబర్లు కూడా ఎందుకు ఈ ఇష్యూను టేకప్ చేయడం లేదు..? ఇప్పుడు మూర్తి మీద బ్యాన్ పెట్టిన అసోసియేషన్ బాధ్యులకు వాళ్లు పనిచేస్తున్న మీడియా సంస్థలు గనుక… ఫలానా నటుడిని ఇంటర్వ్యూ చేయాలి అని అసైన్‌మెంట్ ఇచ్చాయనుకుందాం… లేదు, ఆ నటుడి వార్తలు కవర్ చేయకూడదని మా అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది, కాబట్టి అసైన్‌మెంట్ చేయను అని ధిక్కరిస్తారా..?

వీళ్లు సినిమా యాడ్స్ తీసుకొస్తారు కాబట్టి మీడియా సంస్థలు కూడా… అసోసియేషన్ ఏది నిర్ణయిస్తే అదే శిరోధార్యం అని తలవంచుతాయా..? వేణుస్వామి మీద కూడా గతంలో ఇలాగే చేశారు… తను ఏదో జంట విడిపోతుందని అని జోస్యం చెబితే మహిళా కమిషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు..? ఎవరో ఎవరి మీదో జోస్యం చెబితే అందులో జర్నలిజానికి వచ్చిన నష్టం, అవమానం ఏమిటి..? జర్నలిస్టులకు దాంతో ఏం సంబంధం..?

అప్పుడు కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసిన వాళ్లలో ఈ మూర్తి కూడా ఉన్నట్టు గుర్తు… ఐనా సినిమా వార్తల కవరేజీ కొందరు వ్యక్తుల చేతుల్లో ‘ఇరుక్కుపోవడం ఏమిటి..? ఈ వెలి, ఈ నిషేధం ఏ ప్రమాణాల కింద సమర్థనీయం..? ఇండస్ట్రీ పెద్దల చేతకానితనం సరే, ఏమిటి ఈ వెలి అనే రాతియుగపు అనాగరిక సంప్రదాయం అని ఎవరైనా మీడియా అకాడమీకి వెళ్తే… శ్రీనివాసరెడ్డి ఏమంటాడో చూడాలని ఉంది… జర్నలిస్టు యూనియన్లు స్పందిస్తే చూడాలని ఉంది…

ఇది ఒక మూర్తి సమస్య కాదు, ఆ మూర్తితో ఈ అసోసియేషన్ బాధ్యులతో పంచాయితీ ఏమిటో తెలియదు… కానీ రేప్పొద్దున ఈ వెలి అనేది మరికొందరికీ విస్తరిస్తే, మేం చెప్పినట్టే నడవాలనే విషరూపం ధరిస్తే..? అసోసియేషన్‌లో లేని జర్నలిస్టులకు ఇక ఎవరూ ఇంటర్వ్యులు ఇవ్వకూడదా..? సినిమా ఫంక్షన్లకు పిలవకూడదా..? అసలు సినిమా ఫంక్షన్లకు జర్నలిస్టులను పిలవడమే వేస్ట్… మీడియా సంస్థలు వ్యూస్ కోసం, డబ్బు కోసం లైవ్ ఇస్తున్న రోజులు ఇవి…

ఒకవేళ ఇదే మూర్తికి ఓ పెద్ద స్టారో పిలిచి ఇంటర్వ్యూ ఇచ్చాడు అనుకుందాం… చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ ఎట్సెట్రా… లేదా పెద్ద నిర్మాతలు… వాళ్ల మీద కూడా నిషేధం పెట్టగలదా ఈ అసోసియేషన్..? అసలు ఎందుకు ఈ వెలి సంప్రదాయం..? ఫిలిమ్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఇస్తోంది… అదేమీ స్వతంత్ర సంస్థ కాదు…  మీడియా అకాడమీ, యూనియన్లు కూడా ఓ కన్నేసి ఉంచాల్సిన స్థితి కనిపిస్తోంది…

ఈ వెలి, ఈ నిషేధం గురించి రాయాలంటే ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి… ఎవరైనా ఈ వెలి మీద కోర్టుకు నా ప్రాథమిక హక్కులకు, నా ఉపాధి హక్కుకు, నా బతికే హక్కుకు వ్యతిరేకం అని వెళ్తే..? అప్పుడు సినిమా ఇండస్ట్రీ ముఖ్యులు, మీడియా సంస్థల వైఖరి ఎలా ఉండబోతుంది..? వెలిని సమర్థిస్తాయా..? ఇలా బోలెడు ప్రశ్నలు…

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరు ఈ మూర్తి..? ఏమిటి ఈ వెలి..? ఇదేం జర్నలిజం..?
  • లేదు, అక్కడ ‘కార్తీకదీపం’ వెలిగించలేదు- కోర్టు తీర్పులూ బేఖాతరు!
  • వైభవం! ఒకే మ్యాచులో ఏకంగా ఎనిమిది వరల్డ్ రికార్డులు!
  • వైభవ్ సూర్యవంశీ దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యాయి!
  • ఇండియా అంటే మోదీ కాదు- తెలంగాణ అంటే కేసీయార్ కాదు…
  • కపిల్, సచిన్, ధోనీ, కోహ్లీ కాదు- నాటి ట్రూహీరో బయోపిక్‌లో ఆమీర్ ఖాన్ !!
  • జై చిరంజీవా జగదేకవీరా – ఈ పాట రాగానికీ ఓ కథ ఉంది… విలువ ఉంది!!
  • మస్క్ అంతరిక్షంలో… అంబానీ అంగట్లో! బిజినెస్ దిగ్గజాల రెండు భిన్న ప్రపంచాలు!!
  • అంబానీ క్యాంపాకు కోకాకోలా కౌంటర్ – 26 ఏళ్ల తరువాత గోల్డ్‌స్పాట్ !!
  • అది 30 వేల కోట్ల ‘నీటి దందా’… అందుకే అంబానీ ఏదీ వదలడు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions