నో డౌట్… పలు సందర్భాల్లో టీవీ9 వార్తల ప్రజెంటేషన్ చికాకు పుట్టిస్తోంది… పిచ్చి ప్రయోగాలు సీరియస్ వార్తలనూ కామెడీ ప్రజెంటేషన్ స్థాయికి దిగజారుస్తున్నయ్… పైగా సోషల్ మీడియాలో నెటిజన్లు కొన్ని సందర్భాల్లో ఆ న్యూస్ ప్రజెంటర్ల జ్ఞానజ్యోతులను ఆడుకుంటున్నారు… రుధిరం, పోస్కో, ఆటోస్పై, నీటి గురుత్వాకర్షణ శక్తి వంటి ఐన్‌స్టీన్ స్థాయి సగటు ప్రేక్షకుడికి జీర్ణం కావడం లేదు… వెరసి ఇదంతా ఒకప్పుడు నంబర్ వన్ స్థానాన్ని ఎంజాయ్ చేసిన టీవీ9 ఇప్పుడు సెకండ్ ప్లేసుకు దిగజారిపోయింది…
అప్పట్లో రిపబ్లిక్ టీవీ అక్రమ పద్ధతులతో, బార్క్ రేటింగుల్ని ట్యాంపర్ చేస్తోందని ముంబై పోలీసులు కక్షకట్టి కేసులు పెట్టి, ఆర్నబ్‌ను అరెస్టు చేసిన రచ్చ తెలుసు కదా… తరువాత అదంతా ఉత్త తూచ్ అయిపోయింది… కావాలని ఠాక్రే ప్రభుత్వం తప్పుడు కేసు పెట్టిందని ఆర్నబ్ ప్లస్ రైట్ వింగ్ ఆరోపిస్తూనే ఉన్నయ్… సరే, అదంతా వేరే కథ… అప్పట్లో బార్క్ వాడు హఠాత్తుగా న్యూస్ చానెళ్ల రేటింగ్స్ ఆపేశాడు… తరువాత ఇన్ని నెలలకు, అంటే దాదాపు 17 నెలల తరువాత అయిదారు వారాల కంబైన్డ్ రేటింగ్స్ రిలీజ్ చేసింది…
(నిజానికి బార్క్ రేటింగ్స్ అనేదే ఓ పెద్ద దందా… న్యూస్ చానెళ్ల రేటింగ్స్ ఆపడం కాదు, మొత్తం బార్క్ తన రేటింగ్ విధానాన్నే మార్చుకోవాలి… మన ప్రభుత్వ పెద్దలకు ఎప్పటిలాగే బుర్రలు పనిచేయవు కదా… వినోదచానెళ్ల రేటింగ్స్ మీద కాస్త దర్యాప్తు చేయిస్తే బోలెడు డొంకలు బయటపడేవి… మళ్లీ ఇదంతా వేరే కథ…)
Ads
ప్రస్తుతానికి వస్తే తెలుగు న్యూస్ చానెళ్లలో టీవీ9 పట్ల ప్రేక్షకుల ఆగ్రహం, అసంతృప్తి, అసహనం, అసహ్యం ఎట్సెట్రా ఫీలింగ్స్ అన్నీ ఎన్టీవీకి కలిసొస్తున్నయ్… అంటే, అది పెద్ద తోపు అని కాదు… ప్రేక్షకుడు టీవీ9కు ఆల్టర్నేట్ వెతుక్కునే సమయంలో… వీ6, టీన్యూస్ తెలంగాణ చానెళ్లు… టీవీ5 పచ్చ చానెల్… పైగా వార్తలకన్నా న్యూస్ ప్రజెంటర్ల వికారాలే అధికం… ఏబీఎన్ పచ్చదే… ఈటీవీని పట్టించుకునేవాడే లేడు… సో, సహజంగానే ఎన్టీవీకి కలిసొస్తోంది… దాంతో నంబర్ వన్ అయిపోయింది… ఇదీ జాబితా…
ఈ రేటింగ్స్ బయటపడగానే ఎన్టీవీలో ఫుల్ ఖుష్… యమర్జెంటుగా గ్రీటింగ్స్ కార్డులు ప్రిపేర్ చేసి, వాట్సప్ గ్రూపుల్లోకి పుష్ చేసి పండుగ చేసుకుంటోంది ఆ యాజమాన్యం… (హైదరాబాద్ వీక్షకులు మాత్రం ఇప్పటికీ టీవీ9 చానెల్‌నే ప్రిఫర్ చేస్తున్నారు… టీవీ9 భారత్ వర్ష కూడా హిందీ న్యూస్ చానెళ్లలో టాప్ ఫైవ్‌లో ఉంది… అది కంటితుడుపు అన్నమాట…) రాజ్ న్యూస్, ఐ న్యూస్, ఈటీవీ ఆంధ్ర, ఈటీవీ తెలంగాణ ఉనికి నామమాత్రం… వాటిని ఎవడూ దేకడం లేదు… చివరకు హెచ్ఎంటీవీ, మహాన్యూస్ కూడా ఈటీవీని దాటిపోయాయ్… ఫాఫం ఈటీవీ…
ఈ తెలుగు వదిలి కాస్త హిందీ చానెళ్లకు వెళ్తే ఆజ్ తక్ ఫస్ట్ ప్లేస్… టీవీ9 భారత్ వర్ష రెండో ప్లేస్… రిపబ్లిక్ భారత్ మూడో ప్లేస్… (ఎన్డీటీవీ సహా మరికొన్ని చానెళ్లు బార్క్ రేటింగ్ సిస్టమ్ నుంచి తప్పుకున్నయ్…) ఇంగ్లిష్ చానెళ్లలో రిపబ్లిక్ టీవీ ఫస్ట్ ప్లేస్… ఈ డేటా బయటికి రాగానే మళ్లీ ఒరిజినల్ ఆర్నబ్ బయటికి వచ్చేశాడు… రకరకాల ట్వీట్లు, తిట్లు గట్రా సాగిపోతూనే ఉన్నయ్…
ఎవరినీ క్షమించేది లేదు, మరిచిపోయేది లేదు అంటూ పలు పోటీచానెళ్లను ప్రస్తావిస్తూ ఆర్నబ్ మార్క్ అరుపులు, కేకలు దేశమంతా వినిపిస్తున్నయ్… ఎవడెన్ని కక్షసాధింపులు ప్రయోగిస్తేనేం, రిపబ్లిక్ ఇంగ్లిష్, హిందీ, బెంగాల్ చానెళ్లు నంబర్ వన్ అంటున్నాడు ఆర్నబ్… విచిత్రంగా టైమ్స్ నవ్ వాడు కూడా నేనే నంబర్ వన్ అని ప్రచారం చేసుకుంటున్నాడు… (అది ఒక కేటగిరీలో…) అవునూ, ఆర్నబ్ టీవీ ఏకంగా 41 శాతం వ్యూయర్‌షిప్‌తో ఫస్ట్ ప్లేసులో నిలవడం కూడా మోడీ కుట్ర, బీజేపీ ట్యాంపరింగ్ అని ఇంకా ఎవరూ Trolling స్టార్ట్ చేసినట్టు లేదు…!!
Share this Article