ఎవరేం తిట్టుకున్నా సరే… ఎవరెలా రిసీవ్ చేసుకున్నా సరే…. కొన్ని అంశాల్లో మరీ డిటాచ్డ్‌గా ఆలోచించలేం… మరీ తెలుగు ఇండస్ట్రీ మార్క్ లిబరల్‌లా ఆలోచించడం కుదరదు… బహుశా డాడీ, బిడ్డ బంధాన్ని అపూర్వంగా ప్రేమించే సంస్కృతిలో పెరిగినందుకు కావచ్చు… ప్రజెంట్ ట్రెండ్స్ జీర్ణం కాకపోవడం వల్ల కావచ్చు… ఇంకేమైనా కావచ్చు…
ఎస్పీ బాలు, ఎస్పీ శైలజ ఇద్దరూ అన్నాచెల్లెళ్లు… వాళ్లిద్దరి నడుమ మంచి అనురాగం ఉంది… తోడబుట్టిన చెల్లె పట్ల ఆయనకు అపారమైన సోదరప్రేమ ఉండేది… అయినా సరే, వాళ్లిద్దరూ స్టేజీ మీద గానీ, సినిమాలో గానీ రొమాంటిక్ గీతం కలిసి పాడుతుంటే ఎక్కడో చివుక్కుమన్న భావన… అది ప్రొఫెషన్ అని తెలుసు, అందులో ఏ కల్మషమూ లేదని తెలుసు… ఐనా ఏదో ఇంట్యూషన్ (రీజనింగ్ ఉండాల్సిన పనిలేదు) మొహం మాడ్చుకునేలా చేస్తుంది…
సేమ్… శేఖర్ మాస్టర్… ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ వన్ డాన్స్ కంపోజర్… నో డౌట్, వెరీ ఎఫిసియెంట్… గతంలో ఈటీవీ ఢీ షోకు జడ్జిగా ఉండేవాడు… జంప్ చేసి, మాటీవీలో పడ్డాడు… కొడుకు విన్నీని కూడా అప్పుడప్పుడూ జబర్దస్త్ తెరమీదకు తెచ్చేవాడు… సరే, పిల్లాడు, సరదాగా సాగిపోయేది… డాన్స్ నేర్చుకుంటున్నాడు, బెస్టాఫ్ లక్… బిడ్డ సాహితి… తనూ డాన్స్ మీదే కెరీర్ నిర్మించుకోవాలని ఆశపడుతున్నట్టుంది… అప్పుడప్పుడూ బుల్లితెర మీద డాన్సాడుతోంది… గుడ్, ఇష్టమైన ప్రొఫెషన్, ప్యాషన్ ఆమె ఇష్టం…
Ads
కానీ తండ్రి, బిడ్డ ఇద్దరూ కలిసి ఓ పిచ్చి పాటకు కలిసి డాన్స్ చేయడం ఏమాత్రం నచ్చలేదు… ఎందుకు నచ్చలేదు అనే ప్రశ్నకు జవాబు కష్టం… ముందుగానే చెప్పుకున్నట్టు కొన్ని యాంటీ సెంటిమెంట్… సేమ్, బాలు, శైలజ పాటలాగే… తండ్రి, బిడ్డ… అన్న, చెల్లె… ఇవి కొన్ని మెటీరియలిస్టిక్ వాదనలకు కూడా అతీతమైన బంధాలు… అదేదో సినిమా ఉంది కదా… శ్రీహరి, సిద్ధార్థ్, త్రిష… ఎస్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా… అందులో చంద్రుల్లో ఉండే కుందేలు పాటకు శేఖర్ మాస్టర్, బిడ్డ సాహితి స్టెప్పులు వేయడం బాగనిపించలేదు… ఒకవైపు నా తల్లి, నా లక్ష్మి అంటూనే ఈ పిచ్చి గెంతులు దేనికి శేఖర్..?!
ఈటీవీ జబర్దస్త్‌లో చేసీ చేసీ… అక్కడి వెగటు ధోరణులు ఒంటపట్టించుకున్న నితిన్, భరత్ ఇప్పుడు మాటీవీలో చేరినట్టున్నారు… నాగబాబుతోపాటు… హోలీ కోసం ‘‘ఈ హోలీకి తగ్గేదేలే…’’ అని ఓ స్పెషల్ షో చేశారు… మాటీవీ షో అంటే తెలుసు కదా… బిగ్‌బాస్ కేరక్టర్లు, సీరియళ్ల నటీనటులతో స్పెషల్ షో నడిపించేస్తారు… ఈసారి సుడిగాలి సుధీర్, రష్మి రంగప్రవేశం చేశారు… సరే, అది వేరే కథ… షోలో ఎంత వెగటుతనం నింపారంటే… కార్తీకదీపం సీరియల్ ఫేమ్ నిరుపమ్, శోభా శెట్టి తెలుసు కదా…
ఏదో టాస్కులో శోభను ఎత్తుకుంటాడు… ఆమె నడుం కింద భాగంలో చేతులు వేసి, ఎత్తుకుని అలా నిలబడతాడు… ఓ సీరియల్ యాక్టర్ అంటాడు, ఆహా, ఏం కన్వినియెంట్, ఏం కంఫర్ట్ అంటూ… వెంటనే యాంకర్ రవి అనబడే ఓ మరో వెగటు కేరక్టర్ యాంకర్ అన్నమాట… ఏదో వెకిలి వ్యాఖ్య… మరో డాన్స్ జోడీని చూస్తే బేస్‌మెంట్ షేక్ అవుతోంది అని మరో వ్యాఖ్య… (అర్థమైంది కదా… అదీ రవి రేంజ్)… ఎక్కడి నుంచి వచ్చార్రా మీరంతా..?!
ఇదే షోలో ఓ ప్లేబాయ్ ఇమేజీ ఉన్న సుధీర్ కూడా ఎంత సరదాగా ఉన్నాడు… రష్మిని టీజ్ చేస్తూ, ఆంటీ, డ్రెస్ బరువైపోలేదా… అనే ఓ డైలాగ్… ఎవరూ నొచ్చుకునేవి కావు ఇలాంటి పంచులు… ఎంచక్కా ఎంజాయ్ చేయదగిన పంచులు… సరసం వేరు, అశ్లీలం వేరు… వీటి నడుమ తేడాను గుర్తించే క్రియేటివ్ డైరెక్టర్లు, కమెడియన్లు, ఆర్టిస్టులు లేకపోవడమే ప్రస్తుతం తెలుగు టీవీ ప్రేక్షకుల దురదృష్టం..!!
Share this Article