ఏమో… అప్పుడప్పుడూ ఈ టీవీ ప్రోగ్రాముల ప్రోమోలు చూస్తే ఎక్కడి నుంచో ఒక్కసారిగా చివ్వెర పుట్టుకొస్తది… అంటే చిరాకు, చికాకు, కోపం గట్రా కలిసిన ఫీలింగ్ అన్నమాట… అబ్బే, 30 సెకండ్ల ప్రోమోకు 40 సెకండ్ల రెండు ప్రోమోలు రుద్దుతున్నందుకు కాదు… యూట్యూబయినా అంతే, ఫేస్‌బుక్ వీడియో అయినా అంతే… ఇప్పుడు రెండేసి యాడ్స్ కంపల్సరీ.., నడుమ నడుమ కూడా వాయిస్తున్నారు… వాటికన్నా టీవీ సీరియళ్ల బాపతు పదేసి నిమిషాల వాయింపు నథింగ్… టీవీ అంటే యాదికొచ్చింది…
ఈటీవీ వాళ్లది తాజాగా ఓ ప్రోమో కనబడ్డది… అందులో లైలా, ఆమని, రోజా ఉన్నారు… ఏవో స్కిట్లలో కూడా ఉన్నారు… లైలా నవ్వడం తప్ప నటన వదిలేసినట్టుంది… సరే, డాన్సులు కూడా చేశారు… ఫైమా మళ్లీ అదరగొట్టింది, అలవాటైన కాస్త ఓవర్ యాక్షన్‌తో సహా… ఓ స్కిట్‌లో విష్ణుప్రియ కూడా కనిపించింది… ఈమధ్య రాకేష్, సుజాత ప్రేమ ఇంకా చిక్కబడ్డది… మళ్లీ ఓసారి ప్రదర్శించారు… త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు… అది వేరే సంగతి… రాకేష్ కాస్త పద్దతిగా ఉంటాడు, సుజాతకు కంగ్రాట్స్…
ఈ ఎపిసోడ్ మొత్తం కలర్లుకలర్లుగా నవ్వుతున్న రష్మి హఠాత్తుగా ప్రోమో అయిపోయే టైములో బ్లాక్ అండ్ వైట్‌లో ఏడుస్తూ కనిపించింది… ఎందుకురా అని చూస్తే వెనుకా ముందూ ఏ లింకూ లేదు, జస్ట్, ఏడుపు… ఎందుకు..? ఎవరికీ తెలియదు… నిజానికి రష్మికి ఈమధ్య విడాకులు మంజూరయ్యాయి… ఇప్పుడు సమంతలాగే ఓ స్వేచ్ఛావిహంగం… మరెందుకు ఏడుస్తున్నట్టు..?!
Ads
ఆమె చాన్నాళ్లుగా వివాహబంధంలో ఉంది… నేవీలో చేస్తాడు తను… తనకు విడాకులు ఇచ్చింది… ఆమధ్యలో మరో వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు ఏవో వార్తలు వచ్చాయి కానీ నిజం కావు… తనకు సుధీర్‌తో మంచి కెమిస్ట్రీ ఉందనేది వాస్తవం… బియాండ్ గుడ్ ఫ్రెండ్‌షిప్… తప్పుపట్టే పనిలేదు… పదేళ్ల తెర ప్రేమాయణం (On Screen Love Track) వాళ్లది… ఇప్పుడు అధికారికంగానే ఆమె ఒంటరిది… సుధీర్ అధికారికంగా బ్రహ్మచారి… నిజంగానే వాళ్లు అధికారికంగా ఒక్కటైతే బెటరే… మరి ఎందుకు ఏడుస్తున్నట్టు..?
మల్లెమాల వాళ్లు జబర్దస్త్ నుంచి కూడా తీసేశారా..? సుధీర్‌ను కూడా వెళ్లిపొమ్మన్నారా..? ఏం జరిగింది..? మాటీవీ రారమ్మంటోందా..? ఈటీవీ స్టూడియో పోపో అంటోందా..? నిజానికి హైపర్ ఆది కొన్నాళ్లు బ్రేక్ కావాలని అడుగుతున్నాడట… కారణం తెలియదు… మూడు షోలలో తనే ప్రధానం… కొన్ని నెలల బ్రేక్ దేనికో అర్థం కాదు… అసలు ఈటీవీలో రియాలిటీ షోల విషయంలో ఏం జరుగుతోందో ఎవడికీ అర్థం గాకుండా పోతోంది… ఏం సుధీర్ భాయ్… ఏం జరుగుతోంది..?! ఎందుకు ఏడిపిస్తున్నవ్..?!
Share this Article