ఒక కథ… ఒక సినిమా… ఒక నవల… ఒక సీరియల్… ఒక కెరీర్… సరైన వేళలో ఆపేసేవాడే గొప్పోడు… కార్తీకదీపం సీరియల్ డైరెక్టర్‌కు ఆ సోయి లేదు… నడిచినన్ని రోజులూ నడిపిద్దాం, ఇక ఆదరణ అడుగంటాక ఆపేద్దాం అనే కక్కుర్తిలో ఉన్నాడు… అందుకే కథను ఇష్టారాజ్యంగా మార్చేసి, ఎడాపెడా పాత్రల్ని చంపేసి, కొత్త నటులను తీసుకొచ్చి, రాత్రి మైండ్‌లోకి ఏది జొరబడితే, అది తెల్లారే అమల్లో పెట్టేస్తున్నాడు… వెరసి ఒకప్పుడు ఈ సీరియల్‌కు నీరాజనాలు పట్టిన జనాలే ఇప్పుడు ఛీ అంటున్నారు…
నమ్మడం లేదా…? ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల ప్రీమియర్ ప్రసారాలకు కూడా దక్కనంత హైరేంజ్ రేటింగ్స్ పొందిన ఈ సీరియల్ ఇప్పుడు డౌన్ ఫాల్‌లో పడింది… పడదా మరి..? సీరియల్‌లో మార్పులు చూస్తున్న ప్రేక్షకులకు పిచ్చిలేస్తోంది… సౌందర్య పాత్ర పోషిస్తున్న అర్చనకు జస్ట్, అద్దాలు పెట్టాడు దర్శకుడు, అంతే 20 ఏళ్ల వయస్సు పెరిగింది అనుకోవాలట… ఓ ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు హీరోలు… అంతా గందరగోళం…
Ads
8 ఏప్రిల్ 2022… బుధవారం… కార్తీకదీపం రేటింగ్స్ జస్ట్, 9.91 మాత్రమే… (హైదరాబాద్ కేటగిరీ)… ఫాఫం… మరీ ఈ స్థాయికి పడిపోతామని మాటీవీ వాళ్లకు కూడా అనిపించినట్టు లేదు… ఒకప్పుడు 18, 19 దాకా కూడా రేటింగ్స్ పొందిన ఈ సీరియల్ దురవస్థ అదీ ఇప్పుడు… గత వారం బార్క్ రేటింగుల్లో టాప్ ఇప్పటికీ అదే… కానీ జస్ట్, 12.85… దాని తరువాత ఇంటింటి గృహలక్ష్మి వచ్చేసింది… కార్తీకదీపాన్ని సమీపించింది… దేవత కూడా దూసుకొస్తోంది… వెరసి కార్తీకదీపం ఆరిపోతోంది అని అర్థం…
ఫాఫం… ఎవరున్నారని చూడాలి ప్రేక్షకులు… ఇన్నేళ్లు తాము అనుబంధం పెంచుకున్న కార్తీక్, దీప మరణించారు… మోనిత ఎటో తెలియని దిగంతాల వైపు వెళ్లిపోయింది… ఆ పిల్లలు ఇద్దరూ పెద్దవాళ్లయి ఇతర సీరియళ్లలోని రొటీన్ పాత్రధారుల్లా మారిపోయారు… వీళ్లకు తోడు మరో ఇద్దరు మగ కేరక్టర్లు జతకలిశాయి… మరిక కార్తీకదీపంలో ఏముంది..? పైగా అది ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదు…
నిజానికి ఈ సీరియల్ ఫస్ట్ జనరేషన్‌తో ముగిస్తే సరిపోయేది… కానీ నానా తిప్పలు పడి, యాక్సిడెంట్లు చేయించి, అసలు హీరోహీరోయిన్లను చంపి పాతరేసి, హఠాత్తుగా సెకండ్ జనరేషన్ అనేశాడు దర్శకుడు… అదుగో అక్కడ పడింది దెబ్బ… శోభా శెట్టి, ప్రేమీ విశ్వనాథ్ లేకుండా సీరియల్ ఏమిటి అసలు..? ఉన్నంతలో అర్చన ఒక్కతే బెటర్… కానీ ఆమె ఒక్కతీ సీరియల్‌ను నిలబెడుతుందా..? లేదు… లేదనే రేటింగ్స్ చెబుతున్నాయి..!
Share this Article