నిజానికి సుడిగాలి సుధీర్‌కు ప్రేక్షకాదరణ చాలా ఎక్కువ… టీవీ సీరియళ్ల హీరోలు, స్టార్ కమెడియన్లు, సూపర్ యాంకర్లు, బంపర్ హోస్టులు, డూపర్ జడ్జిలు ఎవరున్నా సరే సుధీరే తెలుగు టీవీల్లో నంబర్ వన్… తను కమెడియన్ మాత్రమే కాదు, సింగర్, డాన్సర్, మెజిషియన్, ఫైటర్, హోస్ట్, సినిమాల్లో హీరో… అన్నీ… టీవీ షోలలో తనను ఓ ప్లేబాయ్‌గా చిత్రీకరిస్తున్నా, తన స్కిట్లు అలాగే ఉంటున్నా తన భాష, బాడీ లాంగ్వేజీ మరీ బట్టలిప్పి బజారులో బరిబాతల డాన్సు చేసినట్టుగా లేకుండా జాగ్రత్తపడుతున్నాడు… కానీ సుధీర్‌ను కూడా భ్రష్టుపట్టించే కార్యక్రమం ఏదో స్టార్టయినట్టుంది…
శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో చూస్తుంటే అలాగే అనిపించింది… ఆడ, మగ టీవీ ఆర్టిస్టుల నడుమ ఓ చెత్తా ఫైట్ పోటీ పెట్టారు… జనం ఎనాడో మరిచిపోయిన రోహిత్‌ను స్పెషల్ జడ్జిగా ఎందుకు పట్టుకొచ్చారో తెలియదు… అంటే సందర్భరహితంగా…!! చివరకు ఆ రోహిత్‌తో కూడా సుధీర్ మీద వెక్కిరింపు పంచులు వేయించాడు ఈ షో దర్శకుడెవరో గానీ..! సుధీర్‌ను చూసి ఆది డాన్సు వాతలు పెట్టుకుంటుంటే… ఆదిని చూసి రాంప్రసాద్ అదే బాటలో ఉండి, చెమటలు కక్కుతూ డాన్స్ చేస్తున్నాడు ఈ షోలో… సారీ, డాన్సు కాదు, ఏవో పిచ్చి గెంతులు…
ప్రోమో చివరలో సుధీర్‌తో ఓ డైలాగ్ అనిపించారు… ఆ దర్శకుడి నీచాభిరుచికి ఇది మరో ఎత్తు… ‘‘బల్ల గుద్ది చెబుతున్నా బాంచెత్… ఈ ఎపిసోడ్‌లో ఎంటర్‌టెయిన్‌మెంట్ మామూలుగా ఉండదు’’… ఇదీ డైలాగ్… ఆ దర్శకుడెవరో, ఆ స్క్రిప్ట్ రైటర్ ఎవరో బుర్రల్లేవు సరే, ఆ డైలాగ్ పలికేముందు ఆ బాంచెత్ పదానికి అర్థం తెలుసుకోవద్దా సుధీర్… నీ తెలివి యాడబోయింది..? సిగ్గుపడాలిగా సుధీర్…
Ads
అసలే జబర్దస్త్ షోలో ఈమధ్య ‘మింగుడు’’ భాష ఎక్కువైపోయింది… హైపర్ ఆది డైలాగుల్లో చాలాసార్లు వినిపించింది ఈ పదం… చివరకు ఓ తాజా ఎపిసోడ్‌లో ఫైమాతో కూడా ‘‘మనకు ప్రతి డే మంగళారమే’’ అనే డైలాగ్ అనిపించారు… అసలే బూతు షో, ఇక భాషలో కూడా ఇలా కొత్త ఎత్తుల్ని ట్రై చేస్తున్నారన్నమాట… థూ… దాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీకి వ్యాపింపజేస్తున్నారు… ఈమధ్య కొన్ని ఎపిసోడ్లు డిఫరెంటుగా ఉన్నాయి అని జనం మెచ్చుకుంటుంటే, చివరకు పొగడ్త నెత్తికెక్కి, ఇలా దిగజారుస్తున్నారన్నమాట…
నిజానికి టీవీ సీరియళ్లలో ఓ పైత్యం కనిపిస్తోంది… తెలంగాణ డయలెక్ట్ అనగానే అ బదులు గ పెట్టేసి, వాక్యాల చివరలో డ్రు అని పలికిస్తే చాలు, అదే తెలంగాణ భాష అట… మరీ కొన్ని సీరియళ్లలో వీళ్లు పలికించే తెలంగాణ పదాలు, ఆ యాస వింటుంటే తెలంగాణ జనానికి వాంతులే దిక్కు అవుతున్నయ్… పైగా తెలంగాణ యాస అంటే యథేచ్ఛగా తిట్లు అనే దురభిప్రాయం కూడా ఉన్నట్టుంది కొందరికి… సుధీర్ నోట బాంచెత్ పదం వినగానే ఆమధ్య నాని దసరా టీజర్ గుర్తొచ్చింది…
‘‘ఈ దసరా నిరుటిలెక్క ఉండదు బాంచెత్, జమ్మి పెట్టి చెప్పుతున్న, బద్దలు బాషింగాలైతయ్, ఎట్లయితే గట్లయితది, చూస్కుందాం…’’ ఇదీ నానితో పలికించిన డైలాగ్… నిజానికి సినిమాల్లో గానీ, ఓటీటీ వెబ్ సీరీసుల్లో గానీ బూతు పదాలు దొర్లినా జనం పెద్దగా పట్టించుకోరు, ఇష్టం లేకపోతే అవాయిడ్ చేస్తారు, నిర్మాత వాడి చావు వాడు చస్తాడు… కానీ టీవీల్లో అలా కాదు… టీవీల్లో ప్రసారాలు నేరుగా ఇంటింటికీ చేరి జనం మెదళ్లలోకి పాసవుతూ ఉంటయ్…
ఆమధ్య ఏదో సినిమాలో పెద్ద హీరోతో ఓ బూతు పదాన్ని అనిపించారు… కానీ టీవీలు దాన్ని అనుసరించలేదు… వాళ్లే సిగ్గుపడి, ఆ అర్థం వచ్చేలా లక్డీకాపూల్ అని మార్చుకున్నారు… మాదాపూర్, లంగర్ హౌజ్, పంజాగుట్ట అనే పదాలకూ మీరే అర్థాలు ఊహించుకొండి… మెల్లిమెల్లిగా ఆ సభ్యతను సడలించి పారేసి, మనదీ ఓటీటీ భాషే అన్నట్టుగా ఇప్పుడిక బాంచెత్ దాకా వచ్చేశారు… ఇప్పటికే పీకినవ్ తీ, తొక్కా, తోలూ, బొక్క, మింగు, గువ్వ, మొగ్గ పదాల్ని ధారాళంగా వాడేస్తున్నారు… పత్తాపారం, పులిహోర అర్థాలు మార్చి పారేశారు… బోసిడికే, నీయమ్మా మొగుడు వంటి పదాలతో లీడర్లే చెలరేగిపోతున్నారు ఏపీలో… టీవీలదొక లెక్కా..? అంటారా..? అవునేమో… రేపు రేపు ప్రోగ్రాముల పేర్లే దొంగ లమ్డీ, మాదచ్చోద్ వంటివి పెట్టేస్తారేమో…!!
Share this Article