నిజమేనా..? పవన్ కల్యాణ్ సినిమాకు టీవీల్లో ఇంత దారుణమైన రేటింగ్సా..? ఆశ్చర్యం..! బీమ్లానాయక్ సినిమాకు దక్కిన టీవీ రేటింగ్స్ కేవలం 9.06 మాత్రమే… (హైదరాబాద్ కేటగిరీలో జస్ట్, 6.16 మాత్రమే) ఈ సినిమాకు థియేటర్లలో వచ్చిన భారీ వసూళ్లు పక్కన పెట్టేయండి, స్థూలంగా సినిమా హిట్టా, ఫ్లాపా అనే సంగతీ కాసేపు వదిలేయండి… 70 కోట్ల దాకా ఖర్చు పెడితే, 200 కోట్ల దాకా వసూలు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి… సినిమా క్వాలిటీ, ఇతరత్రా గుణగణాలు కూడా కొద్దిసేపు మరిచిపోదాం…
కానీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో డిజాస్టర్ అనిపించుకున్నా సరే, తను వ్యక్తిగతంగా ఎన్నికల్లో ఫెయిలయినా సరే, మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక కూడా… తన రాజకీయ వైఫల్యాల ప్రభావం తన సినిమా కెరీర్ మీద ఏమీపడలేదు… అదే పాపులారిటీ… అదే స్టార్‌డం కంటిన్యూ అవుతున్నాయి… అలాంటిది సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ అంటే చాలు సినిమా చూసేవాళ్లు బోలెడుమంది…
బీమ్లానాయక్‌లో రానా కూడా ఉన్నాడు… ఒక విలన్, ఒక హీరో అన్నట్గుగా గాకుండా ఇద్దరికీ మంచి కథానుసార ప్రయారిటీ ఇచ్చాడు దర్శకుడు… మలయాళ ఒరిజినల్ అయ్యప్పనుం కోషియుంతో పోలిస్తే చాలా తేడాలు, తెలుగులో పవన్ ఇమేజీకి తగ్గట్టుగా చేసుకున్న క్రియేటివ్ మార్పులు ఎలా ఉన్నా… ఒకటీరెండు పాటలు బాగానే హిట్టయినా… సినిమా పవన్ కల్యాణ్ రేంజులో హిట్ కాలేదనే చెప్పాలి… కానీ సినిమా ఫెయిల్ మాత్రం కాదు…
Ads
ఎందుకో టీవీ ప్రేక్షకులు సినిమాను పెద్దగా పట్టించుకోలేదు… ఒకరకంగా చెప్పాలంటే తిరస్కరించారు… ఆల్‌రెడీ చాన్నాళ్ల క్రితమే ఓటీటీల్లో విడుదల కావడం వల్ల టీవీ ప్రేక్షకుల సంఖ్య తగ్గిందడానికి లేదు… దీన్ని ప్రసారం చేసింది మాటీవీలో… దాని రీచ్ ఎక్కువ… మామూలు హీరోల మామూలు సినిమాలు కూడా మంచి రేటింగ్స్ పొందుతుంటాయి… అలాంటిది పవన్ సినిమాకు చాలా ఎక్కువ రేటింగ్స్ వచ్చి ఉండాలి నిజానికి… మరీ ఈ తక్కువ స్థాయి రేటింగ్స్ ఎవరూ ఊహించలేదు… 9 రేటింగ్స్ అంటే ఒకరకంగా పవన్ స్థాయికి టీవీ డిజాస్టరే…
Share this Article