Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

క్షమించండి… యాదాద్రి కాదు… ఒడిశాలోని తారాతరిణి శక్తిపీఠం ఇది…

May 20, 2022 by M S R

సంకల్పం ఉండగానే సరిపోదు… శ్రద్ధ ఉండాలి… సరైన ఆచరణ ఉండాలి… పర్యవేక్షణ ఉండాలి… అన్నింటికీ మించి ఓ ఆత్మసంతృప్తి ఉండాలి… యాదగిరిగుట్ట పేరు మార్చారు… పేదల దేవుడిని పెద్దల దేవుడిని చేసేశారు… పార్కింగ్ ఫీజు దోపిడీ వార్తలు చదివాం కదా… వందల కోట్లు ఖర్చు పెట్టారు… మధ్యలో కేసీయార్ స్తుతిస్థంభాల కథలూ విన్నాం… పార్టీ, ప్రభుత్వ ప్రచార యుక్తులూ చదివాం… చివరకు పూర్తి చేశాం అనిపించారు… ఒక పార్టీ కార్యక్రమంలాగా మళ్లీ తలుపులు తెరిచారు… కానీ ఇప్పటికీ అది అసంపూర్ణమే… చినుకు కురిస్తే చాలు గుడిలోకి నీళ్లు చేరే నాసిరకం నిర్మాణం… యావత్ తెలంగాణ సమాజం బిత్తరపోయింది… అంతటి ఉగ్ర నర్సింహస్వామి కూడా మోసపోయాడు…

దీనివల్ల పుణ్యమే వచ్చిందో, పాలకుడికి ఎనలేని పాపఫలితమో సమకూరిందో చెప్పుకోనక్కర్లేదు కానీ… ఒక విషయం చెప్పుకోవాలి… మే 18… ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తారాతరిణి గుడిని పునఃప్రారంభించాడు… కేవలం 100 కోట్లతో గుడి రూపురేఖలు మార్పించాడు… గంజాం జిల్లాలోని ఆ గుడికి వెళ్లి మనస్పూర్తిగా దండం పెట్టాడు… బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరినీ ప్రశంసించాడు… అంతేకాదు… కటక్‌లోని చండీ మందిర్‌ పునర్నిర్మాణం కోసం 70 కోట్లు మంజూరు చేశాడు…

(గుడి పునర్నిర్మాణానికి ముందు, తరువాత)

Ads

యాదాద్రి పేరు పెట్టడంతో మొదలైంది… పెద్ద ఎత్తున ప్రచారం… అనేకసార్లు సీఎం స్వయంగా వెళ్లాడు… పర్యవేక్షించాడు… ప్రతిసారీ ఏవో తప్పులు గుర్తించాడు, మార్పులు సూచించాడు… ఏం కడుతున్నారో, ఏం కూలగొడుతున్నారో ఎవరికీ తెలియని ఓ బ్రహ్మరహస్యం… చివరకు కొత్త పేరు పెట్టి అంతులేని పాపాన్ని మూటగట్టుకున్న చినజియ్యరుడు కూడా దానికి దూరమైపోయాడు… పాపం, ఊరకే పోదు… ఇద్దరూ ఒకరికొకరు దూరమైపోయారు…

(తారాతరిణి ముఖద్వారం)

అన్నింటికీ మించి… ఒక్కసారి గుడి దగ్గరకు వెళ్తే నిలబడటానికి చోటు ఉండదు… పైకి వాహనం తీసుకెళ్తే 500 పార్కింగ్ ఫీజు… చివరకు గుడిని ఎలా మార్చారో, ఏం చేశారో… వారానికి ఓ కథనం అన్ని పత్రికల్లోనూ కనిపించేది… ఆహా, ఓహో… అద్భుతం, పరమాద్భుతం అంటూ… ఈ దేశంలో వేల మంది పాలకులు వేలాది గుళ్లను కట్టారు… వందల ఏళ్లయినా చెక్కుచెదరలేదు… చిన్న రాయి కూడా అటూఇటూ కదలనంత పకడ్బందీ నిర్మాణాలు… అనేక విశేషాలు… ఆధ్యాత్మిక, ఆర్కిటెక్చర్ అద్భుతాలు… కానీ చినుకుపడితే చాలు కురిసే గుడిని ఇలా కొత్తగా కట్టిన ఘనత ఈ గొప్ప పాలకులదే…

With continued efforts of #Odisha Govt & unwavering support of people of #Ganjam, #MaaTaraTarini temple has become a modern day masterpiece. The new temple boasts of architecture that gives it a sense of holiness & is strongly connected with traditions.https://t.co/PxqZVpardM

— CMO Odisha (@CMO_Odisha) May 18, 2022

odisha

ఇదీ కొత్తగా ఒడిశా ప్రభుత్వం డెవలప్ చేయబోయే చండీ మందిర్ చిత్రం… ప్రభుత్వం 5టీ ప్రాజెక్టు పేరిట అయిదు గుళ్ల పునర్నిర్మాణం చేపట్టింది… అందులో ఇదీ ఒకటి… దేవుడా… దేవుడా… యాదగిరిగుట్టను ఏదో ఉద్దరించారు సరే… ఇక వేములవాడ గుడిని కూడా సేమ్, అలాగే పునరుద్ధరిస్తారట… ఇంకెన్ని వందల కోట్లు ధారబోస్తారో… వేమాద్రి అని పేరు పెడతారో ఏం పాడో… ఆ గుడినేం చేస్తారో… మళ్లీ చెప్పుకుందాం… సంకల్పాన్ని తప్పుపట్టడం లేదు… ఆచరణ తీరు అధ్వానంగా ఉందని గుర్తుచేస్తున్నాం అంతే…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నో నో… కల్వకుంట్ల శైలిమ రాజకీయాల్లోకి అస్సలు రాకపోవచ్చు..!!
  • అమెరికా మీద చైనా అగ్రిటెర్రర్ కుట్ర… ఆ ఫంగస్ దానికోసమేనా..?
  • అప్పు పుట్టని దురవస్థ నుంచి…. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ దాకా…
  • జుట్టు సెట్ చేయాలంటే కనీసం లక్ష… ఇదొక సక్సెస్ స్టోరీ…
  • కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీతం, ఫోటోగ్రఫీ, దర్శకత్వం, నటన…
  • రాజకీయ నాయకులతో కృష్ణ కబడ్డీ… తరువాత తనే పాలిటిక్స్‌లోకి…
  • అచ్చు శ్యాంసింగరాయ్‌ కథలాగే… ఆ సినిమాల్లో ప్రస్తావించిన స్టోరీయే..!!
  • మెగాస్టార్‌ కనిపిస్తే చాలు, ఈ కెమెరా రెచ్చిపోయేది… ఓ విశేషబంధం..!
  • జైనబ్… అఖిల్‌కన్నా 9 ఏళ్లు పెద్ద… ఐతే ఏంటట..? ఆమెకు తెలియదా..?!
  • పేరుకు గోల్డ్ ఫ్లేక్ కింగ్ … గణేష్ బీడీ పొగ… శ్రీశ్రీశ్రీ రాజావారి లంకచుట్ట పొగ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions