కేంద్ర ప్రభుత్వ హోం మినిస్ట్రీ ఈమధ్యకాలంలో తీసుకున్న మంచి క్రమశిక్షణ చర్య…. ఇద్దరు ఐఏఎస్ భార్యాభర్తల్లో ఒకరిని లడాఖ్‌కు, మరొకర్ని అరుణాచల్‌ప్రదేశ్‌కు బదిలీ చేసింది… ఇంకానయం, కేంద్ర సర్వీస్ అధికారుల మీద కక్షసాధింపు, అప్రజాస్వామికం, మనువాద కుట్ర, హిందుత్వ కుట్ర వంటి వ్యాఖ్యలు, విమర్శలు రాలేదు… బహుశా దీన్ని ఎలా ఖండించాలో ఆలోచిస్తున్నాయేమో కొన్ని సోకాల్డ్ ఓవర్ డెమోక్రటిక్ సెక్షన్లు… మరి మనం ఎందుకు సమర్థించాలి..? అదీ అసలు ప్రశ్న…
ముందుగా నేపథ్యంలోకి వెళ్దాం… ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం… సంజీవ్ ఖిర్వార్ అనే ఐఏఎస్ అధికారి తన కుక్కతో పాటు వాకింగ్ చేస్తుంటాడు… తోడుగా భార్య రింకూ దుగ్గా… వాళ్లు వాకింగ్ వెళ్లే టైంకి అందరూ ఖాళీ చేయాల్సిందే… ఇదొక నియో ఫ్యూడల్ కల్చర్… సెంట్రల్ సర్వీసు ఉన్నతాధికారుల వ్యవహారశైలి, పనితీరు, సంపాదనల మీద లెక్కకు మిక్కిలి ఆరోపణలున్న విషయం తెలిసిందే కదా… ఇది మరీ దారుణం… నయా జమీందారు, రాచరిక పోకడలు…
మీడియా ఎక్స్‌పోజ్ చేసింది… వెంటనే కేంద్రం స్పందించి మొగుడిని లడాఖ్‌కు, పెళ్లాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌కు తన్ని తరిమేసింది… నిజానికి వాళ్లను సస్పెండ్ చేసి, వీలయితే సీఆర్ఎస్ కింద ఇంటికి పంపించాల్సింది… వీళ్లవి నయా రాజరికాలు… అయితే కేంద్రం ఆ నిర్ణయం అంత వీజగా ఎలా తీసుకుంది..? ఎందుకంటే… వాళ్లు ఏజీఎంయూటీ కేడర్ అధికార్లు… అంటే టెక్నికల్‌గా అరుణాచల్‌ప్రదేశ్-గోవా-మిజోరం అండ్ యూనియన్ టెరిటరీ కేడర్…
Ads
అంటే… ఏ రాష్ట్రానికీ సంబంధించని కేడర్… ఒక్క ముక్కలో చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్… అంటే నేరుగా కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటారు… అందుకే ఈ నయా రాచరికపు పోకడల విమర్శలు రాగానే ఇద్దరినీ వేర్వేరుగా బదిలీ కొట్టేసింది… ఏ లక్షద్వీప్ వంటి ఏరియాలకు జాయింట్‌గా పంపించకుండా… ఒకరిని లడాఖ్, మరొకరిని అరుణాచల్ ప్రదేశ్‌కు పంపించేసింది… మంచి పనిచేసింది…
ఒకే ఏరియాలో ఉంచితే, మళ్లీ అదే కథ… నయా ఫ్యూడల్ రాజరికం… అందుకే విడివిడిగా, దూరందూరంగా… ఇద్దరూ కలవాలంటే పెద్ద టాస్క్… అలా కొట్టింది… ఉంటే ఉండండి, లేదా సర్వీస్ వదిలి వెళ్లిపొండి… అదే మెసేజ్… ఐనా వదలరు వీళ్లు… ఇలాంటివాళ్లు బోలెడు మంది… రాష్ట్రాల సర్వీసుల్లో అధికార పార్టీలకు ఊడిగం చేస్తూ, విపరీతంగా సంపాదిస్తూ… ఇదొక మాఫియా… సారీ టు సే… ఇదొక సర్వీస్ మాఫియా…
ఇప్పుడు బదిలీకి గురైన అధికారి డిల్లీ రెవెన్యూ కమిషనర్… డీఎంలు తన పరిధిలోనే ఉంటారు… ఇక అడ్డేమిటి..? అదుపేమిటి..? భార్య కూడా సేమ్ 1994 బ్యాచ్… ఫ్యామిలీ అక్కడే కదా… ఢిల్లీ వదిలేదు లేదు… ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీగా పోస్టింగు… చేసే పనేమీ ఉండదు… లక్షల జీతం సరేసరి, వాళ్ల సర్వీస్ ఏమిటి సొసైటీకి..? అసలు ఇంకా లోతుగా ఇలాంటి అధికార్ల పనితీరు మీద సమీక్ష జరగడం లేదు… జరగాలి… జరగాలి…
అన్నింటికీ మించి సెంట్రల్ సర్వీస్ అధికార్ల ఆస్తిపాస్తులు, వ్యవహారధోరణి మీద సరైన సమీక్ష జరగడం లేదు… మోడీ వచ్చాక కొంతలోకొంత నయం… పనికిమాలిన అధికార్లను కంపల్సరీ రిటైర్‌మెంట్ కింద నిర్బంధంగా పంపించేస్తున్నారు… కానీ సరిపోదు… విచారణలు జరగాలి… రాజకీయాల్లో ప్రక్షాళన కాదు, ముందుగా జరగాల్సింది ఇదుగో, ఇలాంటి సెంట్రల్ సర్వీస్ కేడర్ అధికార్ల ప్రక్షాళన… నిర్మొహమాటంగా విచారణల్లోకి తీసుకొచ్చి, కఠిన శిక్షలకు గురిచేయాలి… అది జరుగుతుందా..? లేదు… జరగాల్సినంత వేగంగా, పకడ్బందీగా జరగడం లేదు… మిగతా సెంట్రల్ సర్వీసు అధికార్లకు భయపడుతున్నాడా మోడీ…!!
Share this Article