ఫరూఖ్ అబ్దుల్లా… వయస్సు 84 దాటింది… ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఉంటాడట… వీలైతే ప్రధాని పోస్టు బెటర్ తప్ప రాష్ట్రపతి పదవి వద్దేవద్దట… శరద్ పవార్… వయస్సు 81 దాటింది… సేమ్ ఆలోచనలు… అప్పుడే నాకు వయస్సు అయిపోలేదు అంటున్నాడు… వస్తే గిస్తే ప్రధాని పదవే కావాలట… ఫాఫం… దేశమంతా జల్లెడపడుతున్నా సరే విపక్షాలకు సరైన రాష్ట్రపతి అభ్యర్థి దొరకడం లేదు… ఏమి సేతురా లింగా అనుకుని చివరకు మళ్లీ ఆ గోపాలకృష్ణ గాంధీ అనబడే ఓ ఉగ్రవాద మద్దతుదారుడినే తమ ఏకగ్రీవ అభ్యర్థిగా ప్రకటిస్తారట… గాంధీ అనబడే అర్హత సరిపోతుందట…
నిజానికి రాష్ట్రపతిగా రాజకీయ నాయకుడే ఎందుకు ఉండాలి..? బేసిక్‌గా విపక్షం ఆలోచనల్లోనే ఈ అవకరం ఉంది… అదీ సమస్య… అబ్దుల్ కలాం వంటి అధిక ఆమోదయోగ్యత ఉన్న వ్యక్తే కనిపించడం లేదా..? విద్యావేత్తలు, పరిశోధకులు, సాహిత్యకారులు, సాంకేతికవేత్తలు, ఇంజనీర్లు, న్యాయవాదులు, పాత్రికేయులు, వైద్యులు, సామాజికవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆర్మీ ఆఫీసర్లు, ఫిలాంత్రపిస్టులు… ఎన్నో రంగాలు… కానీ ఒక్కరూ లేరా..? లేక వాళ్లు రాష్ట్రపతి పదవులకు అక్కరకు రారా..? (బీజేపీ ఏదో విపక్షాలకు భిన్నంగా ఆలోచిస్తున్నదనే భ్రమలు కూడా అక్కర్లేదు)…
పోనీ, రాజకీయ నాయకుడే కావాలి అనుకుంటే… ఎంతసేపూ ఫరూఖ్‌లు, శరద్ పవార్‌లు, లేకపోతే ములాయంసింగ్, లాలూప్రసాద్, దేవెగౌడ… వీళ్లేనా..? వీళ్లేమో నిత్యయవ్వనులు… 89 ఏళ్లు నిండిన దేవెగౌడను అడిగి చూడండి, తను కూడా అదే అంటాడు… ఇంకా క్రియాశీల రాజకీయాల్లో ఉంటాను అని..! ఈ ఎంపిక విషయంలోనూ బోలెడంత అనైక్యత… మొన్న శివసేన ఉద్దవ్ ఠాక్రే అన్నట్టుగా… రాష్ట్రపతి అభ్యర్థినే మనం ఎంపిక చేయలేనప్పుడు, రాబోయే రోజుల్లో యాంటీ-మోడీ క్యాంపు ఏకగ్రీవ ప్రధాని అభ్యర్థిని ఎలా ఎంపిక చేయగలం..?
Ads
పోనీ, రాజకీయ నాయకులు తప్ప వేరెవరూ అక్కర్లేదు అని విపక్షం భావిస్తే… అత్యంత వెనుకబడిన జాతులకు చెందిన వాళ్లను ఎందుకు ఆలోచించకూడదు..? ఉదాహరణకు, ద్రౌపది ముర్ము… సవతి పిల్లల్లా చూడబడే ఈశాన్య రాష్ట్రాల్లోని భిన్న జాతుల నుంచి ఎందుకు ఆలోచించకూడదు..? ఉదాహరణకు, మాణిక్ సర్కార్… ఆ పేరును తన సొంత పార్టీయే ప్రతిపాదించదేమో బహుశా… సీపీఎం నుంచి వందేళ్ల అచ్యుతానందన్, 78 ఏళ్ల బుద్ధదేవ్ తదితరులున్నారు… ఎటొచ్చీ, సొంత పార్టీయే పెద్దగా పట్టించుకోదు… మాయావతి ఉంది, కానీ మమత పట్టించుకోదు…
చంద్రబాబు 72 ఏళ్లు… ఇతర వృద్ధ నేతలతో పోలిస్తే తనకు ఇంకా క్రియాశీల రాజకీయాలకు సరిపడే బోలెడంత వయస్సున్నట్టే లెక్క… కానీ ప్రస్తుతం విపక్షంలో ఒక్కరికీ ఆయన అక్కర్లేదు… ప్రస్తుతం మమత బెనర్జీ లీడ్ చేస్తున్న విపక్ష కూటమి కోణంలోనే ఆలోచిద్దాం… ములాయం, లాలూ, శిబూ సోరెన్, ముఫ్తి, బాదల్… వాళ్ల వారసులే వాళ్ల పేర్లను తెర మీదకు తీసుకురావడం లేదు… సరిగ్గా డీల్ చేస్తే బీహార్ నితిష్‌ను లాగొచ్చు… కానీ తనకు కూడా ఇంకా 71 ఏళ్లే కదా… తనకు ప్రధాని పదవి అయితే వోకే అంటాడేమో…
కాంగ్రెస్ క్యాంపు నుంచే గెహ్లాట్ వంటి సీనియర్ నేతల్ని ప్రతిపాదించినా తప్పులేదు… మరీ దిగ్గీరాజాలు, శశిథరూర్‌లు అవసరం లేదు గానీ కాస్త జల్లెడ పడితే గెహ్లాట్‌లు దొరుకుతారు… కానీ యాంటీ-మోడీ కూటమి కూడా మా ప్రివిలేజ్, అంతేతప్ప మధ్యలో ఈ మమతల పెత్తనాలు ఏమిటి అనుకునే కాంగ్రెస్ ఏకగ్రీవ విపక్ష అభ్యర్థి అనే పాయింట్‌నే సీరియస్‌గా తీసుకోవడం లేదు… జస్ట్, విపక్ష మర్యాద కోసం ఆ భేటీలకు వెళ్తుంది, అంతే… తటస్థమో, ఏ పక్షమో తెలియని జగన్, కేసీయార్, కేజ్రీవాల్, నవీన్ పట్నాయక్ తదితరులు అసలు రాష్ట్రపతి ఎన్నికనే లైట్ తీసుకుంటున్నారు…
మాజీ గవర్నర్ నరసింహన్, రతన్ టాటా, విప్రో అజీమ్ ప్రేమ్‌జీ, ఇన్‌ఫోసిస్ నారాయణమూర్తి… ఇలాంటోళ్ల పేర్లు తట్టవు సరే… పోనీ, సూపర్ పొలిటిషియన్ ప్రశాంత్ కిషోర్ పేరును ప్రకటించండి మేడం మమత… దేశరాజకీయాలకు ఓ బాధ తొలగిపోతుంది…! స్టాలిన్, ఠాక్రే, కేసీయార్, జగన్, మమత… అందరూ సానుకూల వోట్లు గుద్దేస్తారు… అక్కడ పంజాబ్ లోక్‌కాంగ్రెస్ అమరేందర్ దగ్గర నుండి, ఇక్కడ మక్కల్ నీది మయ్యం కమల్‌హాసన్ దాకా నైతిక మద్దతు కూడా దొరుకుతుంది…!
Share this Article