Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎలన్ మస్క్‌‌కు రాయునది ఏమనగా… కాస్త నేను చెప్పేదీ ఓసారి విను…

June 9, 2025 by M S R

.

‘‘డియర్ ఎలన్ మస్క్… కొత్త రాజకీయ పార్టీల ఏర్పాటు మీద అభిప్రాయ సేకరణ జరిపించావు కదా… కాస్త నా మాట కూడా ఓసారి విను… మా తెలుగు మీడియా రాజకీయాల గురించి తెలుసుకో, నీకు క్లారిటీ వస్తుంది…

ప్రస్తుతం ఓ కొత్త రాజకీయ పార్టీ అవసరం అమెరికాకు ఉందనేదే కదా నీ అభిప్రాయం, సరే… చూడు మస్క్, రాజకీయాల్ని ప్రముఖులు, ప్రభావశీలురు తెర వెనుక నుంచి నడిపించడం వేరు, మీడియా స్వయంగా రాజకీయాల్ని నడిపించడం వేరు… జనంలోకి వచ్చి నేరుగా రాజకీయాలు నడిపించడం వేరు…

Ads

చాలా కాలం నుంచి తెలుగు రాజకీయాలను మీడియా యజమానులే నడుపుతున్నారు … 1982 లో టీడీపీ ఆవిర్భావం … tdp తొలి మ్యానిఫెస్టో 1983 లో ఈనాడు తన పేరుతోనే ప్రింట్ చేసింది … తొలి ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ప్రచార బాధ్యత మొదలుకొని జగన్ ఓటమి, బాబు గెలుపు వరకు ప్రచార బాధ్యత ఈనాడు తన భుజాల మీద మోసింది …

ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మీడియా ఓనర్లు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు . అలా అని యజమానులు స్వయగా, నేరుగా పోటీ చేస్తే కార్పొరేటర్ గా కూడా గెలవరు … ముఖేష్ అంబానీ మీడియా ద్వారా దేశాన్ని నడిపితే … అనిల్ అంబానీ తానే రాజకీయాల్లో చేరి నిండా మునిగాడు …

మస్క్, నీకు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపే మీడియా (ఎక్స్) ఉండవచ్చు . ఆ సోషల్ మీడియా ద్వారా ప్రపంచ రాజకీయాలను నడపాలి అనుకుంటే తప్పు కాదు .. కరెక్ట్ పని .. మావాళ్లు చేసేది అదే… కానీ నువ్వే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే దెబ్బ తింటావు .. తరువాత నీ ఇష్టం …

రామోజీరావుకి కూడా ఓ దశలో పార్టీ పెట్టి సీఎం కావాలి అనే పురుగు కుట్టిందిట ( ఈ మాట యూ ట్యూబ్ ఇంటర్వ్యూల్లో ఆయన సంస్థలో చేసిన వారే చెప్పింది ).. కానీ తను తెలివైన వ్యాపారి కాబట్టి తనకు ప్రత్యక్ష రాజకీయ వ్యాపారం అచ్చి రాదు, లాభసాటి వ్యాపారం కాదు అని గ్రహించి పార్టీ పెట్టలేదు .,,

చిరంజీవి వల్లే పవన్ సినిమాలోకి వచ్చారు . చిరంజీవికి రాజకీయ వ్యాపారం కలిసి రాలేదు . పవన్ కు కలిసి వచ్చింది … రాజకీయ వ్యాపారం అందరికీ కలిసి రాదు … ప్రాంచైస్ వ్యాపారం కొందరికి కలిసి వస్తుంది .

మీడియాకు సైతం అంతే .. రాజకీయ వ్యాపారాన్ని తెర వెనుక లాభసాటిగా నడపగలరు . వారే పోటీ చేస్తే గుండు సున్నా అవుతారు … ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే… నీలాంటి సాహస వీరుడు, ప్రయోగాల వ్యాపారి, స్థితిమంతుడు ప్రపంచానికి అవసరం … ఈ రాజకీయాల బురద నీకు అవసరమా చెప్పు.. ?

మాస్క్ తొడుక్కుని రాజకీయాలు నడపాలి కానీ మాస్క్ తీసేసి, మస్క్ స్వయంగా తనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లాభసాటి వ్యాపారం మాత్రం కాదు … కనుక చిత్తగించవలెను……… ఇట్లు బుద్ధా మురళి, హైదరాబాద్



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?
  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…
  • సీజేపీ ధర్నా… బొద్దింకల పేరిట ‘యాంటీ మోడీ’ సెక్షన్ హంగామా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions