Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జయమాలిని కేవలం మసాలా డాన్సర్ కాదు… ఫుల్ లెంగ్త్ రోల్ సుమలతలాగే…

June 9, 2025 by M S R

.
Subramanyam Dogiparthi ………. విజయవంతమైన మరో కౌబాయ్ కం ట్రెజర్ హంట్ సినిమా 1984 లో వచ్చిన ఈ మెరుపుదాడి . మన తెలుగులో దేవతలారా దీవించండి , మోసగాళ్ళకు మోసగాడు వంటి ట్రెజర్ హంట్ సినిమాలు ఈ సినిమాకు ముందే ఉన్నాయి . ఇంక మెకన్నాస్ గోల్డ్ గురించి చెప్పేదేముంది ! ట్రెజర్ హంట్ సినిమాలకు చిరునామా .

దేవతలారా దీవించండి సినిమాను నిర్మించిన గిరిబాబే ఈ సినిమాకూ ఆద్యుడు , కధా రచయిత , స్క్రీన్ ప్లే రైటర్ కూడా . మొదట చిరంజీవి , మోహన్ బాబులతో తీద్దామని కధను చిరంజీవికి వినిపిస్తే ఆయన కొన్ని మార్పులు చెప్పారట . మార్పులను చేయటానికి ఇష్టపడని గిరిబాబు భానుచందర్ , సుమన్లతో తీసారట .

యన్ రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వ్యాపారపరంగా కూడా విజయమయింది . నిధి నిక్షేపాల మీద రీసెర్చ్ చేసే ఒక ప్రొఫెసర్ రత్నగిరి సామ్రాజ్యాధిపతి దాచిపెట్టిన నిధి వివరాలను శోధించి ఆ నిధి కోసం బయలుదేరుతాడు .

Ads

సాహసవంతుల కోసం వెతుకుతూ వెళుతుంటాడు . చిల్లర దొంగతనాలను చేస్తూ మిత్రులయిన సుమన్ , భానుచందర్ , హంటర్ జయమాలిని , నక్కజిత్తుల గొల్లపూడి మారుతీరావు , కళ్ళకు గంతలు కట్టుకుని కత్తులు విసిరే గిరిబాబు , అతని చెల్లెలు సుమలతతో టీంను ఏర్పాటు చేసుకుని సంసిధ్ధమవుతాడు ప్రొఫెసర్ పాత్రలో రంగనాథ్ .

అడవులు , అడవి జాతి వాళ్ళు , వాళ్ళు ఈ బృందాన్ని బంధించటం , దొర కూతురు భానుచందర్ మీద మోజు పడటం , వాళ్ళ బారి నుండి బయటపడటం , పులి ఎలుగుబంటు పోరాటం , పాము ముంగిస పోట్లాట , అడవిలో డాన్సులు , ఫైనల్గా నిధిని కనుక్కోవటం , క్లైమాక్సులో విలన్లు రావటం , విలన్లను మట్టుబెట్టటం , నిధిని తీసుకుని వెనుతిరగటం . ఇదీ కధ టూకీగా .

కధ ట్రెజర్ హంట్ సినిమాల ఫార్ములాలో ఉన్నా గిరిబాబు స్క్రీన్ ప్లేని బిర్రుగా వ్రాసుకోవటం వలన ప్రేక్షకులకు బోర్ లేకుండా సాగుతుంది . ఇద్దరు హీరోల హీరోచిత ఫైట్లు బాగుంటాయి . స్టంట్ మాస్టర్ రాజును అభినందించాలి .

మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో నాగభూషణం పాత్ర వంటి పాత్ర ఈ సినిమాలో కూడా ఉంటుంది . గొల్లపూడి మారుతీరావు నటించాడు . గ్లామర్ స్పేసుని సుమలత , జయమాలిని ఫిల్ చేసారు . వీళ్ళిద్దరి డాన్సులతో పాటు సిల్క్ స్మిత సిల్కీ డాన్స్ పాట కూడా ఒకటుంది .

ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డ్యూయెట్లు , గ్రూప్ పాట , అన్నీ బాగుంటాయి . థియేటర్లో బాగున్నా బయట హిట్ అయినట్లుగా లేవు . చంద్రమ్మా గంధమందుకో , వెండి మబ్బు చీరె కట్టుకో , ఇటు ప్రళయం అటు విలయం పాటలు బాగుంటాయి . కోడి కాదురా ఈ లేడినందుకో అంటూ సాగుతుంది సిల్క్ స్మిత డాన్స్ పాట . పాటలనన్నీ వేటూరే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , యస్ జానకి , యస్ పి శైలజ పాడారు .

డైలాగులను అప్పలాచార్య బాగానే వ్రాసారు . ఏక్షన్ , ఎడ్వంచర్ సినిమా కదా ! అవి ఉంటే చాలు . ఇతర ప్రధాన పాత్రలలో ప్రభాకరరెడ్డి , త్యాగరాజు , సారధి , కె విజయ , సుత్తి వీరభద్రరావు , నర్రా , చలపతిరావు , దేవి , ప్రభృతులు నటించారు .

ఇప్పటి సినిమాల్లాగానే స్పీడుగా సాగుతుంది . యూట్యూబులో ఉంది . కోబాయ్ , ట్రెజర్ హంట్ , ఏక్షన్ సినిమాల మీద ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు . జయమాలినిది ఫుల్ లెంగ్త్ పాత్ర . ఆమె అభిమానులు కూడా చూడవచ్చు . చూడబులే . తలకోన అడవుల అందాలను బాగానే చూపారు . It’s an adventure , action , romantic , treasure hunt movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions