Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా… ఏం తెలివి..? ఆటో-పే సబ్‌స్క్రిప్షన్ తిర‘కాసులు’…!!

June 8, 2025 by M S R

.

సరే, యాడ్స్‌తో చంపేస్తున్నాడు కదా… ఒకే మొబైల్‌కు నెలకో, రెండు నెలలకో సబ్‌స్క్రయిబ్ చేసుకుందామని వెతికితే… ఆ స్కీం లేదట, కనిపించలేదు… (ఆమధ్య ఎప్పుడో సింగిల్ మొబైల్‌కు 99 అన్నాడు, తీరా క్లిక్కితే 149 కనిపించింది… ఇప్పుడది లేనట్టుంది…)

జస్ట్, నెలకు 67తో స్టార్ట్ చేయండి, 3 నెలలకు ఒకేసారి కట్టండి అని కనిపించింది… పర్లేదు, 3 నెలలకు 200 లోపే కదా అని క్లిక్ చేస్తే బాటా రేటు 249 కనిపించింది… అంతేనా గోల్డ్ అనీ మరొకటీ ప్యాకేజీలు కనిపించాయి… యాడ్స్ లేకపోతే ఒక రేటు, మాంచి హై డెఫినిషన్, డోల్బీ సౌండ్ అయితే మరో రేటు…

Ads

బ్యాక్ బటన్ నొక్కేలోపు ఏడాది ప్యాకేజీ 499 మాత్రమే అని కనిపించి, టెంప్టయి క్లిక్ చేస్తే … చిన్నగా ఎక్కడో రాసి ఉంది (పరిమితమైన యాడ్స్ ఉంటాయి)… సర్లె, ఏదో భరిద్దాంలే అనుకుని క్లిక్ చేస్తే… మరింత చిన్న అక్షరాల్లో ఆటోపే అని కనిపించింది…

అంటే, గడువు ముగియగానే ఆటోమేటిక్‌గా ఓ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫారం ద్వారా మన బ్యాంకు నుంచి సబ్‌స్క్రిప్షన్ డబ్బు లాగేసుకుని, రెన్యువల్ చేస్తారన్నమాట… ఆ గడువు నాటికి సబ్‌స్క్రిప్షన్ ప్యాకేజీ పెరిగితే ఇన్‌ఫాం చేస్తారట, లేకపోతే వాళ్లే డబ్బు తీసేసుకుంటారు…

ఈ కరెంటు బిల్లుకో, నల్లా బిల్లుకో వోకే గానీ, మరీ ఆహా వంటి ఓటీటీకి ఈ ఆటో-పే అవసరమా..? అది లేకుండా కట్టేద్దాం అనుకుంటే ఆ ఆప్షనే లేదు… కడితే ఆటో-పే, లేకపోతే లేదు అంటాడు… ఇదేం నిర్బంధం..? ఐనా ఇలా చేస్తే ఇల్లీగల్ కదా, పైగా అనైతికం కదా… స్ట్రెయిట్ సబ్‌స్క్రిప్షన్ లేకపోవడం అనే దరిద్రం ఏమిటి..?

ఐనా ఇల్లీగల్ అయినా, ఇమ్మోరల్ అయినా మన తెలుగు వినోదవ్యాపారులను కట్టడి చేయలేవు కదా రూల్స్ అనుకుని సమాధానపడి… చాట్‌లోకి వెళ్లి అడిగితే… ఏదేదో ఫార్మాట్‌లో విసిగించి, చివరకు చెప్పింది… మీరు ముందు సబ్‌స్క్రిప్షన్ కట్టండి, తరువాత ఆటో-పే రిమూవల్ చేసుకోవచ్చు అని…

ముందు ఆటో-పే చేయమనడం దేనికి..? తరువాత రిమూవల్ చేసుకోవచ్చు అనే ఏడుపు దేనికి..? అసలు ఇదెంత మందికి అర్థం అవుతుంది..? వాడు క్లిక్కుమనగానే మనం ఏ గూగుల్ పే లేక ఏ ఫోన్ పే క్కిక్కుమనిపిస్తే… ఇక మన ప్రమేయం లేకుండానే వాడు డబ్బు తీసేసుకుంటాడు కదా రెన్యువల్ పేరిట..? ఇది జనాన్ని మభ్యపెట్టడమో, నిజాలకు గంతలు కట్టడమో, మోసగించడమో అవుతుంది కదా..?

aha

ఒరేయ్, నాన్నా… నువ్వు ఇలాంటి ఎన్ని ఇకారాలకు పాల్పడినా సరే, నీకు నష్టాలు తప్పడం లేదు… వందల కోట్ల నష్టాలు అంటున్నారు… పోనీ, కంటెంటు..? అదీ పెద్ద చూడబుల్ కాదు… పైగా ఇదుగో ఈ మదివాడ తేజస్వి బాపతు వెగటు, రోత, అసభ్య, అశ్లీల ప్రోగ్రామ్… పేరు కాకమ్మ కథలు…

ఏమాటకామాట… సుడిగాలి సుధీర్ హోస్ట్ చేసే సర్కార్ కాస్త నయం… సరదాగా ఉంటుంది… కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి ఒకటీరెండు షోలు మాత్రమే ఆహా వైపు దృష్టి మళ్లించేవి… ఇప్పుడదీ లేదు… తెలుగు ఇండియన్ ఐడల్ మొదట్లో బాగానే ఉండేది… గత సీజన్ భ్రష్టుపట్టించారు… ప్చ్, ప్చ్… ఈమాత్రం దానికి ఆటో-పే మస్ట్ అనే ఇకారాలు అవసరమా..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • A Journalist’s Journey Through Two Eras of Reporting
  • ఒక డోరతీ… కొంచెం సమీక్ష.. బోలెడు సైన్సూ…
  • మన పేదరికం నిజంగా తగ్గిందా..? జబ్బలు చరుచుకుందామా..?
  • ఒక సరస్వతీ పుత్రుడు – ఒక సరస్వతీ పుత్రిక – ఓ అదర్శ కుటుంబం !!
  • పగులుతున్న పాపాల పుట్టలు – బీఆర్ఎస్ క్యాంప్ హఠాత్తుగా సైలెంట్
  • ఎఐ కొలువుల్నే కాదు, ప్రాణాలనూ తీయగలదు… బహుపరాక్…
  • ఫ్లూ వేక్సిన్ అనగానే… చిన్ననాటి మశూచి టీకాలు, పుండ్లు గుర్తొచ్చాయి…
  • మరీ ‘ఆదర్శ’ కుటుంబం కాదు గానీ… ఏదో సంసారపక్షంగా నడిపించేశారు!
  • అటు నోటి దూలతో నెగెటివిటీ – ఇటు మహర్దశ కూడా నడుస్తోంది
  • ప్రవచనకారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారూ… తమరు తప్పులో కాలేశారు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions