ఇదుగో… ఇలాంటి మూర్ఖుల వల్లే కాంగ్రెస్ మరింత భ్రష్టుపట్టిపోతోంది… అలాంటోళ్లను సపోర్ట్ చేయడంతో కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజల్లో ఆసక్తి కూడా చచ్చిపోతోంది… కనీస సంస్కారం లేకపోవడం కాదు… ఒకరకమైన బలుపును ప్రదర్శించడం ఇది… విషయం తెలుసు కదా… కాంగ్రెస్ అధికార ప్రతినిధి అధీర్ రంజన్ చౌధరి రాష్ట్రపతి ప్రసాద్ ముర్మును రాష్ట్రపత్ని అని సంబోధించడం..!
ద్రౌపది అనే పేరు వినగానే ఓ తెలుగు బురద పంది మరి పాండవులు ఎవరు అని ప్రశ్నిస్తుంది… ప్రత్యర్థిగా నిలబడ్డ ఇంకొకడు ఆమె విగ్రహం అంటాడు… మరొకడు దిష్టిబొమ్మనా అనడుగుతాడు..? ఇక్కడ ద్రౌపది ముర్మును వీళ్లు ఒక బీజేపీ మనిషిగా మాత్రమే చూస్తున్నట్టున్నారు… బుర్రలో డొల్లతనం… కాదు, కాదు… ఇదొక హెరిడిటరీ ఇన్‌ఫెక్షన్ కావచ్చు… జన్మత పుట్టుకొచ్చినదే కావచ్చు…
అందుకే… ఒక మహిళను… ఒక ఆదివాసీని… అందులోనూ లార్జెస్ట్ డెమోక్రసీ ఉన్న దేశాధినేతను అవమానిస్తున్నామనే సోయి కూడా ఉండటం లేదు… రాజకీయాల్లో ఘాటు విమర్శలు ఉంటాయి, విమర్శలుంటాయి… పరుష వ్యాఖ్యలూ ఉంటాయి… కానీ ఈ రాష్ట్రపత్ని అనే వ్యాఖ్య మరీ నీచస్థాయిలో ఉంది… అచ్చమైన సంస్కార రాహిత్యం… యాంటీ-బీజేపీ పోకడల్ని క్రమేపీ యాంటీ-ఆదివాసీ, యాంటీ వుమెన్ వైపు తీసుకుపోతున్నామనే సోయి కూడా లేదు… పైగా ఇంకెంత బలుపు, ఆధిపత్య ధోరణి అంటే…
Ads
ఒకవైపు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ వాళ్లు ఆందోళన అందుకున్నారు… ఈమధ్య విపక్షాలపై ఎదురుదాడికి వాళ్లకూ పెద్దగా ఇష్యూస్ దొరకడం లేదు కదా… ప్రజలపై జీఎస్టీ బాదుడు తప్ప నిర్మలా సీతారామన్‌కు పెద్ద పనేమీ లేదు… తన బిడ్డకు చెందిన గోవా బార్‌ను బజారుకు లాగారని స్మృతీ ఇరానీకి అసలే మంటగా ఉంది… సో, ఈ ఇష్యూలో పెట్రోల్ పోసే పనిలోపడ్డారు… పలు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయా బీజేపీ శాఖలు పిలుపునిచ్చాయి…
అదేమిటి..? అధీర్ రంజన్ క్షమాపణ చెప్పాడు కదా అంటోంది సోనియా… కానీ తనేమీ క్షమాపణ చెప్పలేదు, ఎందుకు చెప్పాలి అని ఇంకా అదే బలుపు దూలానికి వేలాడుతున్నాడు… ‘‘ఈ బీజేపీ వాళ్లకు పనిలేదు… అందుకే చిన్న మట్టిదిబ్బను పర్వతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నారు, క్షమాపణ ఎందుకు చెప్పాలి..? ఏదో పొరపాటున నోరుజారింది..’’ అంటున్నాడు… అంతిమంగా ఇలాంటి వివాదాలు త్వరగానే చల్లారతాయి… కానీ ఒక ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడాన్ని సహించలేని మగ వర్ణవివక్షి కూసిన పిచ్చి కూతను చాన్నాళ్లపాటు గిరిజనగణం మరిచిపోదేమో… అదీ ఓ మహిళ పెత్తనం వెలగబెడుతున్న జాతీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి…!!
Share this Article