ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన తాజా కొత్త పలుకు వ్యాసంలో ఎప్పటిలాగే చంద్రబాబు వాయిస్‌లాగా ఏదేదో రాసుకుంటూ పోయాడు… ఆ మొత్తం వ్యాసంలో తెలంగాణలో సెటిలర్స్, పర్టిక్యులర్‌గా కమ్మజనం ఈసారి కేసీయార్, బీజేపీ, జగన్ మీద కోపంతో కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు అని దాదాపు తేల్చేశాడు… ఆయన వ్యాసంలోని ముఖ్యా సారాంశం ఏమిటంటే…
తెలంగాణలో తెలుగుదేశం పోటీచేయకూడదని కమ్మప్రజానీకం ఒత్తిడి తెస్తున్నదట… దీనివల్ల వోట్లు చీలిపోయి బీఆర్ఎస్ లేదా బీజేపీ లబ్ధిపొందుతాయట… చంద్రబాబును అరెస్ట్ చేసిన జగన్‌కు సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీలకు ఫాయిదా ఉండకూడదని కమ్మ సెటిలర్లు కృతనిశ్చయంతో ఉన్నారట… (అసలు సెటిలర్లు పదం వాడకమే కరెక్టు కాదని కొందరు రాస్తున్నారు సోషల్ మీడియాలో… కానీ ఆ పదాన్ని ఏనాటి నుంచో వాడుతూనే ఉన్నారు ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణలో సెటిలైన వారిని ఉద్దేశించి…)
ఈ ప్రమాదం గమనించే అమిత్ షా లోకేష్‌ను పిలిచి మాట్లాడాడట… ఇక్కడ ఓ డవుటు… సరే, తనే పిలిచి మాట్లాడాడు అనుకుందాం… బీజేపీయే అరెస్టు చేయించిందనే భావన ఉంది కాబట్టి, అది తొలగిపోయి బీజేపీకి డ్యామేజీ కంట్రోల్ జరుగుతుందా..? అబ్బే, కన్విన్సింగుగా లేదు వాదన… పోనీ, పొలిటికల్ ఫాయిదా ఏమొస్తుంది..? తెలుగుదేశం, జనసేనతో కలిసి పోటీచేస్తే, బీజేపీకి ఉన్న ఈ నాలుగు వోట్లు కూడా పోతాయి తెలంగాణలో… ఆ రిస్క్ బీజేపీకి ఎందుకు..?
పైగా సెటిలర్లు అంటే కేవలం కమ్మవారే కాదు… ఆంధ్రా నుంచి ఇతర కులాల వాళ్లు కూడా లక్షల్లో వచ్చారు… తెలంగాణ జిల్లాల్లో కమ్మ ఊళ్లతోపాటు రెడ్ల ఊళ్లు కూడా బోలెడు… కమ్మజనం నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్లు రెడ్డి స్పృహతో వాళ్లకు వ్యతిరేకంగా, అంటే బీఆర్ఎస్‌కు లేదా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదా ఆర్కే సాబ్..? (ఓహ్, కాంగ్రెస్ అంటే ఇప్పుడు రేవంత్, రేవంత్ అంటేనే చంద్రబాబు, అంటే కాంగ్రెస్‌కు వోటేస్తే చంద్రబాబుకు మద్దతునిచ్చినట్టే అనే ఈక్వేషనా..?)
Ads
హైదరాబాదులో సెటిలైన వాళ్లలో కమ్మ, రెడ్లు మాత్రమే కాదు, దాదాపు అన్నికులాల ఆంధ్రాజనం ఉన్నారు… కేవలం కమ్మ మనోభావాలకు అనుగుణంగా వాళ్లు వ్యవహరిస్తారని అనుకోవడానికి వీల్లేదు… పైగా అనేక కులాల ప్రజలు హైదరాబాదీలుగా మారిపోయారు… లోకల్ పొలిటికల్ స్టాండ్ అనేదే వాళ్లకు ప్రధానం… సో, ఆర్కే కొత్త పలుకు గందరగోళంగా అనిపించింది… కేవలం ప్రవాస కమ్మ వోటర్ల మనోభావాల్ని మొత్తం సెటిలర్ల భావనగా చిత్రీకరించడం కరెక్టు కాదనిపిస్తోంది… కానీ ఆ మొత్తం వ్యాసంలో ఓ పేరా మాత్రం ఇంట్రస్టింగుగా కనిపించింది… అది…
‘‘సెటిలర్ల విషయంలో కేసీఆర్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం మార్గదర్శి చిట్ ఫండ్ విషయంలో రామోజీరావును అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకెళ్లాలని అనుకుంటున్నామని, అందుకు తెలంగాణ పోలీసుల సహకారం కావాలని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి కోరారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ తన తండ్రి కేసీఆర్‌కు చెప్పగా, ‘అక్కడి దరిద్రాన్ని మనకు చుట్టాలని చూస్తున్నారు. ఇక్కడకు వచ్చి ఇష్టం వచ్చినట్టు అరెస్టు చేస్తే సహకరించేది లేదు అని చెప్పు’ అని కేసీఆర్ బదులిచ్చారు. దీంతో రామోజీరావు అరెస్టు ప్రయత్నాన్ని జగన్ తాత్కాలికంగా విరమించుకున్నారు. చంద్రబాబు కూడా హైదరాబాద్ వెళ్లిపోతే స్కిల్ కేసులో అరెస్టు చేయలేమన్న ఉద్దేశంతోనే నంద్యాలలో తెల్లవారుజామున హడావుడిగా అరెస్టు చేయించారు…’’
అంటే, రామోజీరావు గనుక పొరపాటున హైదరాబాద్ వదిలివెళ్తే ఇక కటకటాల్లోకే అన్నమాట… ఎలాగూ కేసీయార్ రామోజీరావుకు మొదటి నుంచీ (లక్ష నాగళ్లను కోల్డ్ స్టోరేజీలో పడేశాడు కదా…) మద్దతుదారే కదా… సో, ఆ మార్గదర్శికి కేసీయారే బలమైన రక్షణగోడ అన్నమాట… రామోజీరావును కూడా అరెస్టు చేసి ఉంటే కమ్మజనంలో మరింత వ్యతిరేకత ప్రబలిపోయే ప్రమాదం ఉండేదనే మాట ఎందుకోగానీ రాధాకృష్ణ రాయలేదు…!! (ఈ కథనానికి వాడుకున్న ఫోటో ఆంధ్రజ్యోతి సౌజన్యమే…)
Share this Article