శివాజీ ప్లేసులో ఇంకెవరైనా ఉండి ఉంటే… ఆ పిచ్చికూతలు కూసి ఉంటే… వీకెండ్ షోలో నాగార్జున రెచ్చిపోయి క్లాస్ పీకేవాడు… కానీ శివాజీ కదా… ఈ మహారాణులు, మీకు డ్యాష్ డ్యాష్ అని వెకిలి కూతలు కూస్తే, మొత్తం రికార్డయితే… జస్ట్ లైట్ తీసుకున్నాడు నాగార్జున… ఇదేం పక్షపాతం బాస్..?
నీకు శివాజీ అంటే ప్రేమ ఉండనీ… కావాలని విజేతను చేసే దిశలో ప్రయాణం చేయి… నువ్వు, నీ బిగ్‌బాస్ టీం ఇష్టం… ఎలాగూ మీ ఇష్టమొచ్చినట్టు చేస్తారు కదా… కనీసం ఆట నిష్పాక్షికంగా సాగుతుందనే భ్రమల్ని సజీవంగా ఉంచవచ్చు కదా… రేటింగుల కోసం, యాడ్స్ కోసం, డబ్బు కోసం…
నేనేదో సరదాగా అన్నాను బాబు గారూ అని శివాజీ అనగానే… ఆ బాబు గారేమో మన శివాజీయే కదా అనుకుని, అంతే కదా, ఐతే సరే అని తలూపేశాడు… మరీ బాగుండదేమోనని అనుకుని… సరదాగానైనా సరే, అలాంటి మాటల్ని వాడకపోవడం మంచిది అని ఓ హితబోధ పైపైన చేసేసి వదిలేశాడు… అలాంటి కూతలు చాలా కూశాడు శివాజీ హౌజులో… షో చూడటానికి వచ్చిన ఓ ప్రేక్షకుడు అన్నాడు కూడా… శివాజీ ఏదో వివరణ ఇచ్చుకున్నాడు గానీ, ఆ సందర్భాన్ని బట్టి చూస్తే శివాజీ మాటలు సరైనవి కావని… ఆ సోయి నాగార్జునకు ఎందుకు లోపించింది..?
Ads
పోనీ, తనేమైనా అందరి మనిషా..? కాదు… తనది ఓ గ్యాంగు… ఒకవైపు వీకెండ్ షో సాగుతుండగానే, పాస్-ఫెయిల్ అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉండగానే… పల్లవి ప్రశాంత్ చెవిలో ఏదో కూశాడు… తను సరేనని గొర్రెలా తలూపాడు… దాన్ని కూడా నాగార్జున గమనించాడు, కానీ సీరియస్‌గా ఏమీ పట్టించుకోలేదు… చివరకు శివాజీని కెప్టెన్‌ను చేశారు… ఇదీ పక్షపాతమే…
ఫిజికల్ టాస్క్ పెడితే అర్జున్ గెలిచి మళ్ళీ కెప్టెన్ అవుతాడు… అందుకని గేమ్ పెట్టకుండా… హౌజ్ మెట్స్ నుంచి రహస్య అభిప్రాయ సేకరణ అనే ప్రహసనం జరిపారు… విచిత్రంగా అందరూ తనకే వోటు వేశారు… నాగార్జున కోరుకున్నదీ అదే… జరిగిందీ అదే… బిగ్ బాస్ అవుడియా అందరికీ అర్థమై, వ్యతిరేకంగా పోలేక శివాజీకి జై అన్నారు… నాగార్జున ఫుల్లు ఖుషీ…
తరువాత లాన్‌లోకి వచ్చి ఆ శివాజీ, తన వెంట గుడ్డిగా తిరిగే యావర్, ప్రశాంత్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు… అందరూ వోట్లేసి, నువ్వే మా తదుపరి కెప్టెన్ అని చెబితే… ఆ ముగ్గురే సెలబ్రేట్ చేసుకోవడం ఏమిటో… హేమిటో, శివాజీ ధోరణి ఆ నాగార్జునకు, ఆ బిగ్‌బాస్ టీంకే ఎరుక…
ఇటు శివాజీకి దీటైన గ్యాంగు ఉండకపోతే ఆట మొత్తం చప్పబడిపోయి, రేటింగ్స్ దారుణంగా పడిపోతాయని బిగ్‌బాస్ టీంకూ తెలుసు… అందుకే శోభ, అమర్, ప్రియాంక గ్యాంగును కూడా చెలామణీ కానిస్తున్నారు… పర్టిక్యులర్‌గా శోభ ఆటతీరు ఇంట్రస్టింగ్… మాటకుమాట కంపల్సరీ… ఎవరికీ భయపడదు, అనాల్సినవి అనేస్తుంది… తను ఆ ధోరణితో పోతున్నది కాబట్టే కొంతలోకొంత శివాజీకి చెక్… లేకపోతే ఆట మొత్తం ఏకపక్షంగా మారిపోయి, అర్థంతరంగా శివాజీకి కప్పు ఇచ్చి, మధ్యలోనే హౌజు మూసేసేవారేమో…
చివరగా ఈ వీకెండ్ షో గురించీ చెప్పాలి… బిగ్‌బాస్ చూసే ప్రేక్షకులు వీక్ డేస్‌లో పెద్దగా చూడకపోయినా, ఇంట్రస్టు చూపకపోయినా వీకెండ్ షోలు చూస్తుంటారు… కాస్త ఫన్, ఎలిమినేషన్ ప్రాసెస్, ఐదారురోజుల ఆటపై సమీక్ష ఎట్సెట్రా ఉంటాయి కాబట్టి… కానీ ఈ శనివారం ఏమైంది..? ఎవరినీ సేవ్ చేయలేదు… ఫన్ లేదు, గేమ్స్ లేవు, ఎంటర్‌టెయిన్‌మెంట్ లేదు… బోరింగ్… వెరీ బోరింగ్…
Share this Article